నిహారిక కాబోయే భర్త గురించి తెలిస్తే షాకే.. ఇంట్రెస్టింగ్‌గా జీతం, చదువు. హాబీస్.. పెళ్లి ఎప్పుడంటే!

మెగా డాటర్ నిహారిక కొణిదెల పెళ్లి వ్యవహారం ఒక్కసారిగా మీడియాలో ఆసక్తికరంగా మారింది. గుట్టుచప్పుడు కాకుండా, మూడో కంటికి తెలియకుండా మెగా ఫ్యామిలి నిహారిక నిశ్చితార్థం కార్యక్రమాన్ని నిర్వహించడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో నిహారిక కాబోయే భర్త ఎవరనే విషయం ఆసక్తికరంగా మారింది. అయితే నిహారిక కాబోయే భర్త చైతన్య జొన్నలగడ్డకు సంబంధించిన విషయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. చైతన్య కెరీర్, చదువు, ఫ్యామిలీ నేపథ్యం ఎలా ఉందంటే..

ఉన్నత విద్యాభ్యాసం

ఉన్నత విద్యాభ్యాసం

నిహారిక కొణిదెల కాబోయే భర్త చైతన్య వయసు 27 సంవత్సరాలు. ఆయన గుంటూరు ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జే ప్రభాకర్ రావు కుమారుడు. చైతన్య విద్యాభ్యాసం జూబ్లిహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్, బిట్స్ పిలానీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఉన్నత విద్యను పూర్తి చేశారు.

ప్రముఖ కంపెనీలో బిజినెస్ స్ట్రాటెజిస్ట్‌గా

ప్రముఖ కంపెనీలో బిజినెస్ స్ట్రాటెజిస్ట్‌గా

చైతన్య జొన్నలగడ్డ ప్రస్తుతం హైదరాబాద్‌‌లోని ప్రముఖ కంపెనీలో బిజినెస్ స్ట్రాటెజీస్ట్‌గా పనిచేస్తూ.. లక్షలాది రూపాయాల జీతాన్ని పొందుతున్నారు. అంతేకాకుండా సొంత వ్యాపారాలు కూడా ఉన్నట్టు సమాచారం. చదువు, జీతం పక్కన పెడితే.. ఫొటోగ్రఫీలో ప్రత్యేక శిక్షణ పొందారు. ఆయన తీసిన కొన్ని ఫోటోలు ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లు తీసిన చిత్రాలకు ధీటుగా ఉన్నాయనే అభిప్రాయం ఉంది.

పర్సనల్ హాబీస్

పర్సనల్ హాబీస్

నిహారిక కాబోయే భర్త చైతన్యకు పర్వతారోహణ, ఆధ్యాత్మిక విషయాలపై మక్కువ ఎక్కువగా ఉంది. హిమాలయాల్లో పర్వతారోహణ నుంచి దుబాయ్‌లో స్కై డైవింగ్ చేయడం లాంటి హాబీలు ఉన్నాయి. ప్రపంచంలోని పలు దేశాల్లో పర్యటించిన అనుభవం ఉంది.

ఖరీదైన వాచీలంటే ప్రాణం

ఖరీదైన వాచీలంటే ప్రాణం

చైతన్య జొన్నలగడ్డకు వాచీలు అంటే చాలా ఇష్టం. బ్రాండెడ్, ఖరీదైన వాచీల కలెక్షన్ ఆయన హాబీ. ఆయన వద్ద లక్షల్లో ఖరీదు చేసే వాచీలు ఆయన సొంతం. చైతన్య ఇన్స్‌టాగ్రామ్‌ ఫోటోలను చూస్తే ఆయన హాబీలు స్పష్టంగా కనిపిస్తాయి.

ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి

ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి

చైతన్య జొన్నలగడ్డ విషయానికి వస్తే.. ఆరడుగుల అందగాడు. చూడగానే ఆకట్టుకునే రూపం. ఆయనకు ఫిట్‌నెస్‌ పూర్తిస్థాయిలో దృష్టిపెట్టడం ఆయనకు ఇష్టం. గంటల తరబడి జిమ్‌లో కసరత్తు చేసే అలవాటు ఉందనే విషయం ఆయన ఇన్స్‌టాగ్రామ్ చూస్తే ఇట్టే అర్ధం అవుతుంది.

Recommended Video

Ram Charan & Upasana Celebrates 5 Years Of Wedding
ఆగస్టులో పెళ్లి

ఆగస్టులో పెళ్లి

నిహారిక, చైతన్య నిశ్చితార్తం ఇటీవలే లాక్‌డౌన్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో పూర్తయింది. ఇక పరిస్థితులు అదుపులో ఉంటే వీరిద్దరి పెళ్లిని ఆగస్టులో చేసేందుకు ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ మేరకు ఇరు కుటుంబాలు తమ తమ ఏర్పాట్లలో ఉన్నట్టు తెలిసింది. అయితే త్వరలోనే నిహారిక, చైతన్య పెళ్లిపై అధికారికంగా ప్రకటన వెల్లడించడానికి మెగా ఫ్యామిలీ ప్లాన్ చేస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X