twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Samantha అడ్వకేట్‌పై పరువునష్టం దావా ఎందుకంటే? కూకట్ పల్లి కోర్టు తీర్పు నేడే!

    |

    టాలీవుడ్ హీరో నాగచైతన్యతో విడాకులు తర్వాత తనకు వ్యతిరేకంగా, తన మనోభావాలను కించపరిచే విధంగా కథనాలు ప్రసారం చేసిన యూట్యూబ్ ఛానెల్స్‌పై సమంత రుత్ ప్రభు ఘాటుగా స్పందించారు. రెండు యూట్యూబ్ ఛానెల్స్‌కు కోర్టు ద్వారా నోటీసులు జారీ చేశారు. తన విడాకులకు కారణమంటూ అసత్య కథనాలు ప్రచారం చేశారంటూ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

    అక్టోబర్ 2న విడాకుల ప్రకటన

    అక్టోబర్ 2న విడాకుల ప్రకటన

    నాగచైతన్యతో దాంపత్య జీవితం గురించి అనేక ఊహాగానాలకు తెరదించుతూ అక్టోబర్ 2వ తేదీన సమంత దంపతులు తాము వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్టు ప్రకటించారు. ఒకే ప్రకటనను సమంత, నాగచైతన్య తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి క్లారిటీ ఇచ్చారు. సమంత, నాగచైతన్య విడాకులు ప్రకటనను నాగార్జున అక్కినేని కూడా ధృవీకరించారు.

     వీడియోలపై సమంత అభ్యంతరకరం

    వీడియోలపై సమంత అభ్యంతరకరం

    అయితే నాగచైతన్య, సమంత విడాకులకు అసలు కారణాలు అంటూ అడ్వకేట్, డాక్టర్ వెంకట్ రావు, మరో రెండు యూట్యూబ్ ఛానెల్స్ తమ కథనాలను ప్రకటించారు. సదరు యూట్యూబ్ చానెల్స్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలపై సమంత అభ్యంతరం వ్యక్తం చేసింది. తనకు అఫైర్లు ఉన్నాయంటూ అక్రమ సంబంధాలను అంటగట్టడంపై సమంత ఆగ్రహం వ్యక్తం చేసి పరువు నష్టం దావా వేసింది.

    వెంకట్ రావు స్పందన ఏమిటంటే..

    వెంకట్ రావు స్పందన ఏమిటంటే..

    న్యూస్ అనలిస్టుగా మారిన అడ్వకేట్ కమ్ డాక్టర్ వెంకట్ రావు విడుదల చేసిన 13 నిమిషాలలో వీడియోలో ఆయన మాట్లాడుతూ.. లెజెండ్, స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు తనకు వ్యక్తిగతంగా తెలుసు. నాగచైత్యన ప్రవర్తన, వ్యవహరశైలి హుందాగా, ప్రతీ ఒక్కరిని ఆకట్టుకొనేలా ఉంటుంది. కానీ విడాకుల విషయంలో సమంత తొందరపాటు నిర్ణయం తీసుకొన్నది అని వ్యాఖ్యానించారు.

    నాగచైతన్య శ్రీరామచంద్రుడు అంటూ

    నాగచైతన్య శ్రీరామచంద్రుడు అంటూ

    అంతటితో వెంకటరావు ఆగకుండా తనదైన శైలిలో నాగచైతన్య, సమంతపై వ్యాఖ్యలు చేశారు. విడాకుల విషయంలో సమంత తప్పు చేసిందని అందరూ భావిస్తున్నారు. నాగచైతన్య శ్రీరామచంద్రుడు లాంటి వాడు. సున్నిత భావాలు, మర్యాదగా మారుపేరుగా కనిపించే చైతన్యను వదులుకోవడం సమంత తప్పే అన్నట్టు వెంకట్ రావు వ్యాఖ్యలు చేశారు.

    అసత్య ప్రచారంపై సమంత ఆగ్రహం

    అసత్య ప్రచారంపై సమంత ఆగ్రహం


    సోషల్ మీడియాలోను, అలాగే యూట్యూబ్ ఛానెల్స్‌లోను తనపై అభ్యంతకరమైన వ్యాఖ్యలు, అనుచిత ప్రచారం చేయడంపై సమంత మనస్తాపానికి గురైంది. అలాంటి అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట వేయడానికే సమంత కూకట్ పల్లి కోర్టును ఆశ్రయించారు. పరువు నష్టం కింద ఎంత మొత్తం అనేది ఇంకా ఆమె నిర్ణయించుకోలేదు. త్వరలోనే పరువు నష్టం మొత్తంపై నిర్ణయం తీసుకొంటారు అని ఆమె సన్నిహితులు పేర్కొన్నారు.

    యూట్యూబ్ వీడియోలను డిలీట్ చేయాలని..

    యూట్యూబ్ వీడియోలను డిలీట్ చేయాలని..


    తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా, తన వ్యక్తిగత జీవితంపై మచ్చ పడేలా ఉన్న యూట్యూబ్ వీడియోలను, అలాగే సోషల్ మీడియాలో ఉన్న లింకులను వెంటనే తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును సమంత వేడుకొన్నారు. ఇక ముందు కూడా తనపై అసత్య ప్రచారాన్ని ఆపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

    Recommended Video

    నాకు అఫైర్స్, అబార్షన్స్ అని మాట్లాడుతున్నారు, సమంత ఎమోషనల్ నోట్..! || Filmibeat Telugu
    సమంత పిటిషన్‌పై కూకట్ పల్లి విచారణ

    సమంత పిటిషన్‌పై కూకట్ పల్లి విచారణ

    యూట్యూబ్ ఛానెల్స్‌లో తన వ్యక్తిగత జీవితం గురించి అసత్య ప్రచారాన్ని ఆపాలంటే సమంత దాఖలు చేసిన పిటిషన్‌ను కూకట్ పల్లి కోర్టు గురువారం (అక్టోబర్ 21) రోజున విచారించనున్నది. సమంత పిటిషన్‌పై కూకట్ పల్లి కోర్టు ఏ విధంగా స్పందిస్తుందనే విషయం ప్రస్తుతం ఆసక్తిగా మారింది. సమంత పరువు నష్టం దావా సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

    English summary
    South Indian Actress Samantha files defamation case on Advocate Venkat Rao and other two youtube Channels. Here is reason behind Samantha petition.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X