దేశంలోనే ఫస్ట్ టైం.. ఆ కారును కొన్న ఫాహద్ ఫాజిల్.. దాని విలువ ఎంతంటే?

లాక్ డౌన్ కాలంలో ఓ నటుడి పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోయింది. మలయాళి నటుడే అయినప్పటికీ నేషనల్ వైడ్‌గా క్రేజ్ తెచ్చుకున్నాడు. అతనెవరో కాదు ఫాహద్ ఫాజిల్. ఏదైనా పాత్రను పోషిస్తుంటే కేవలం ఆ క్యారెక్టర్ మాత్రమే కనిపించేలా ఎంతో సహజంగా నటించడం ఫాహద్ ప్రత్యేకత. ఓటీటీలో ఫాహద్ ఫాజిల్‌కు ఆయన నటనకు ఉండే క్రేజ్ వేరే లెవెల్. ఇక నజ్రియా నాజిమ్‌తో ప్రేమా, పెళ్లి గురించి అందరికీ తెలిసిందే.

 బెంగళూర్ డేస్ ద్వారా..

బెంగళూర్ డేస్ ద్వారా..

బెంగళూర్ డేస్ సినిమా కేవలం మలయాళంలోనే కాదు టోటల్ సౌత్‌లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో నజ్రియా నాజిమ్ (రాజా రాణి ఫేం), ఫాహద్ భార్యాభర్తలు నటించారు. అయితే నిజ జీవితంలోనూ వీరిద్దరూ భార్యాభర్తలు అయ్యారు. ఆ సినిమా టైంలోనే వీరిద్దరూ ప్రేమలో పడిపోయారు. చివరకు పెళ్లితో ఒక్కటయ్యారు.

నటనలో ప్రత్యేకత..

నటనలో ప్రత్యేకత..

ఫాహిద్ నటుడిగా నిర్మాతగా తనకంటూ ఓ ముద్రను ఏర్చుకున్నాడు. ఫాహద్ నటించిన కొన్ని చిత్రాలు లాక్ డౌన్‌లో సెన్సేషన్ అయ్యాయి. ట్రాన్స్, సీ యూ సూన్ వంటి సినిమాల్లో ఫాహద్ నటనను మెచ్చుకోనివారెవ్వరూ ఉండరు. ఈ రెండూ కూడా ఓటీటీల్లో దుమ్ములేపాయి. ఫాహిద్ ప్రతిభకు నెటిజన్లు ఆశ్చర్యపోయారు.

తాజాగా అలా..

తాజాగా అలా..

తాజాగా ఈ జంట ఓ కొత్త కారును కొనుగోలు చేసింది. వారి రేంజ్‌కు తగ్గట్టు ఉండాలన్న కోరికతో ఇండియాలోనే ఎవ్వరికీ లేని కారును సొంతం చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే పోర్చే కార్‌లో 911 మోడల్‌ను కొన్నాడు. గ్రీన్ కలర్ పైథాన్‌ కారు ఇండియాలో మొదటిది అంటూ నెటిజన్లు షాక్ అవుతున్నారు.

కారు విలువ ఎంతంటే?

కారు విలువ ఎంతంటే?

ఇక ఈ కారు మోడల్ ఇండియాలోనే మొదటిది అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. దీని విలువ ఎంత ఉంటుందో అని గూగుల్‌లో సర్చ్ కూడా చేసేస్తున్నారు. అయితే దీని ధర 1.90 కోట్లు అని తెలుస్తోంది. అంటే దగ్గర దగ్గరగా రెండు కోట్ల వరకు అయ్యేలా ఉంది. ప్రస్తుతం ఫాహద్ షేర్ చేసిన కారు ఫోటో, ఇచ్చిన ఆ పోజు మాత్రం వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X