Pushpa విషయంలో హర్ట్ అయిన షెకావత్... అందుకు ఇంత దారుణంగా చంపాలా?
పుష్ప సినిమా వచ్చి రెండేళ్లు అవుతున్నా... ఆ సినిమాలోని ప్రతి సీన్ గుర్తుంటుంది. ఇక ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం వేరే లెవెల్ ఉంటుంది. ఇక భన్వర్ సింగ్ షెకావత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ ఇక ఈ పాత్రలో జీవించేశాడు అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో భన్వర్ సింగ్ షెకావత్ గురించి ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే...
2021 ఏడాది డిసెంబరులో రిలీజ్ అయిన పుష్ప.. ఏ రేంజులో హిట్ అయిందో చెప్పనక్కరలేదు. ఇక అల్లు అర్జున్... అయితే పాన్ ఇండియా స్టాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక విదేశాల్లో కూడా ఈ సినిమాకు క్రేజ్ వేరే లెవెల్ ఉంది. ఇక సెలబ్రేటీలు సైతం పుష్ప స్వాగ్ ను ఫాలో అయ్యారు.

ఇక ఈ సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్ గా ఫహద్ ఫాజిల్ నటన అద్భతం అని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాలో పుష్ప రాజ్.. భన్వర్ సింగ్ ను హర్ట్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. క్లైమాక్స్ లో పుష్ప రాజ్.. షెకావత్ తో... ఇదీ సార్ బ్రాండ్ అంటే.. అంటూ ఫైర్ అవుతాడు. నువ్వు గుడ్డలు ఇప్పి తిరుగితే కుక్క కూడా గుర్తుపట్టదు అంటూ... చెప్తాడు.

ఇక బట్టలు లేకుండా భన్వర్ సింగ్ వెళ్లగా... అక్కడ ఓ డాగ్ అతడిని గుర్తుపట్టదు. దీంతో పుష్ప రాజ్ మాటలు గుర్తొచ్చి.. ఆ డాగ్ ను దారుణంగా చంపుతాడు. ఇక ఇదే కాదు.. ఇటీవల వచ్చిన తమిళ సినిమా మామన్నంలోనూ.. ఫహద్ ఫాజిల్ కుక్కను దారుణంగా రాడ్ కొట్టి చంపుతాడు. ఇక ఆ విజువల్స్ భయానకంగా ఉంటాయి. రక్తపు మడుగులో కుక్క పడి ఉండటం.. డాగ్ లవర్స్ అయితే చూసి తట్టుకోలేరు.

అయితే ఇప్పుడు ఈ సీన్స్ కనెక్ట్ చేస్తూ.. సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది. పుష్ప రాజ్ విషయంలో హర్ట్ అయిన భన్వర్ సింగ్.. అలా కుక్కలను దారుణంగా చంపుతున్నాడు అంటూ ఓ వీడియో వైరల్ గా మారింది. పుష్ప సినిమాలో కుక్కను చంపే సీన్, నాయకుడు (మామన్నం) సినిమాలో కుక్కను చంపే సీన్ రెండింటినీ కలిపి ఓ వీడియో వైరల్ గా మారింది.
ఇక కుక్కలపై ఇలా పగబట్టావ్ ఏంట్రా అంటూ ఫన్నీగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఫహద్ పాజిల్ విషయానికి వస్తే.. హనుమాన్ గెయిర్, పాట్టు, పుష్ప ది రూల్ సినిమాల్లో నటిస్తున్నారు. ఇటీవల ఆయన నాయకుడు సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు.


Click it and Unblock the Notifications











