ప్రియుడిని కాజల్ పెళ్లి చేసుకొంటే.. అభిమాని ఎలాంటి పని చేశారో తెలుసా?
హీరోలు, హీరోయిన్లపై అభిమానం ఒక్కోసారి కట్టలు తెంచుకుంటుంది. అభిమానులంరదూ ఒకేలా ఉండరు. ఒక్కొక్కరు ఒక్కోలా తమ ప్రేమను చాటుతుంటారు. ఇలా కొందరు అభిమానులు చేసే చర్యలు హీరో, హీరోయిన్లకు తలనొప్పిగా మారుతుంటాయి. ఇంకొందరు చేసే పనులు సదరు హీరో, హీరోయిన్లు సంబరపడేలా ఉంటాయి. తాజాగా కాజల్ అగర్వాల్ వీరాభిమాని చేసిన పనికి అందరూ ఫిదా అవుతున్నారు. కాజల్ పెళ్లి సందర్భంగా ఆ అభిమాని చేసిన పనిని అందరూ ప్రశంసిస్తున్నారు.

కాజల్ పెళ్లి..
కాజల్ అగర్వాల్ గుజరాతీ కావడం, ప్రియుడు గౌతమ్ కిచ్లూ కశ్మీరి అవ్వడం వల్ల ఆ రెండు ప్రాంతాలకు అనుగుణంగా సంప్రదాయ పద్దతిలో వివాహం జరిపించారు. అక్టోబర్ 30న సాయంత్ర అంగరంగ వైభవంగా ఇరు కుటుంబాల సంప్రదాయాల మేరకు వివాహాతంతును కానిచ్చారు.

పెళ్లికి ముందు అనూహ్య పోస్ట్..
పెళ్లికి ఇంకొన్ని గంటలు ఉందనే ముంద కాజల్ ఓ వింత పోస్ట్ చేసింది. ఎంతో గంభీరంగా నిబ్బరంగా కోపంగా చూస్తున్నట్టు పోజు ఇచ్చింది. ఆ పోజు కంటే ఆమె పెట్టిన కామెంట్ మరింతగా వైరల్ అయింది. తుపాను వచ్చే కంటే ముందుండే ప్రశాంతత నిశ్శబ్దం అంటూ ఏదో పరోక్షంగా చెప్పేసింది.

కాజల్ పెళ్లి సందర్భంగా..
మామూలుగా ఎవరి జీవితంలో అయినా సరే పెళ్లి అనేది ఓ మధుర జ్ఞాపకం. ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. ఇలా కాజల్‌కు అక్టోబర్ 30 అనేది ఎప్పటికీ గుర్తుండి పోతుంది. అయితే కాజల్‌కు ఈ డేట్ స్పెషల్ అయినప్పుడు ఆమె అభిమానులకు కాకుండా ఉంటుందా? అందుకే ఓ అభిమాని (సుకన్య) కాజల్ పేరును పచ్చబొట్టుగా పొడిపించుకుంది.

కాజల్ పెళ్లి కంటే..
అక్టోబర్ 30 కాజల్ పెళ్లి రోజు.. ఇది ఆమెకే కాదు నాక్కూడా ఎంతో స్పెషల్.. అందుకు నా చేతిపై కాజల్ పేరును టాటూగా వేయించుకున్నా.. ఇలా చేయడానికి ఇంతకంటే స్పెషల్ రోజు కంటే మరొకటి ఉండదు అంటూ కాజల్‌పై ప్రేమను కురిపించింది. ఇక ఆమెకు కాజల్‌పై ఉన్న ప్రేమను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.


Click it and Unblock the Notifications











