BoxOfficeKingRAMCHARAN : మెగా ఫ్యాన్సా మజాకా.. నాన్ స్టాప్ ట్వీట్లతో దెబ్బకు షేక్
ప్రస్తుతం హీరోల సత్తా తెలియాలంటే సోషల్ మీడియాను ఓ కొలమాణంగా తీసుకుంటున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్ , ఇన్‌స్టాగ్రామ్ వంటి వాటిలో ఫాలోవర్స్ సంఖ్యను బట్టి ఎవరి గొప్ప ఎంతో బేరీజు వేసుకుంటూ ఉంటారు ఫ్యాన్స్. అయితే ఇప్పటికీ కొంత మంది హీరోలకు సోషల్ మీడియాలో ఖాతాలు లేవు. మరికొంత మంది ఇప్పుడిప్పుడే ఈ ప్రపంచంలోకి అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో అభిమాన గణం అంతా కలిసి తమ హీరో సత్తాను అందరికీ చాటి చెబుతారు.

నడుం బిగించిన మెగా ఫ్యాన్స్..
గత కొన్ని రోజులుగా రామ్ చరణ్‌కు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్స్ లేకపోవడంతో ఫ్యాన్స్ అందరూ కలిసి ఓ ట్రెండ్ సెట్ చేయడానికి సిద్దమయ్యారు. ఈ మేరకు మెగా ఫ్యాన్స్ అందరూ కలిసి రామ్ చరణ్‌కు సంబంధించిన విషయాన్ని ట్విట్టర్‌లో ట్రెండ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ మేరకు విడుదల చేసిన కామన్ డీపీ ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది.

మొదటి అడుగే..
ఈ మేరకు శనివారం (జూన్ 6) సాయంత్రం నుంచి ట్వీట్ల యుద్దాన్ని మొదలుపెట్టారు. BOXOfficeKingRamCharan అనే హ్యాష్ ట్యాగ్‌తో చెర్రీ రికార్డుల గురించి చాటి చెబుతున్నారు. ఈ సోషల్ మీడియా యుద్దాన్ని జూన్ 7వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగించాలని ఫిక్స్ అయ్యారు.

బాక్సాఫీస్ లెక్కలు..
ఈ క్రమంలో రామ్ చరణ్ బాక్సాఫీస్ లెక్కలను బయటకు తీశారు. సౌత్‌లో ఫస్ట్ 50 కోట్లు కొట్టింది, ఎంట్రీ సినిమాతో రికార్డులు బద్దలు కొట్టింది చెర్రీయే అని ట్వీట్లు చేస్తున్నారు. కెరీర్ మొత్తంలో 2 ఇండస్ట్రీ హిట్స్, రెండు సూపర్ హిట్స్, మూడు హిట్స్, ఒక యావరేజ్, రెండు ఫ్లాపులు, రెండు డిజాస్టర్ ఇలా మొత్తంగా హిట్ పర్సెంటేజ్ 68శాతమని పేర్కొన్నారు.
Recommended Video

డిజాస్టర్లతో సైతం బాక్సాఫీస్ షేక్..
డిజాస్టర్లతో కూడా బాక్సాఫీస్‌ను దడదడలాడించే హీరో రామ్ చరణ్ అని తెలిపారు. వినయ విధేయ రామ దాదాపు 60 కోట్లకు పైగా కొల్లగొట్టి 70శాతం రికవరీ చేసిందని పేర్కొన్నారు. ఇలా తమ హీరో బాక్సాఫీస్ లెక్కలను చెబుతూ.. బాక్సాఫీస్ కింగ్ రామ్ చరణ్ అని ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ట్విట్టర్‌లో ట్వీట్ల వర్షం కురుస్తోంది. తక్కువ సమయంలో 30k, 50k, 100k, 200k, 300k ట్వీట్లలో రికార్డులు క్రియేట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











