చిరుతతో నాన్న.. చిరునవ్వుతో నా బిడ్డ, ధైర్యమే ఆయన ఊపిరి.. చిరంజీవి, మహేష్, చెర్రీ, శృతి ఎమోషనల్‌గా

నాన్నంటే తరగని ప్రేమ.. వెలకట్టలేని అభిమానం.. స్పూర్తి, ప్రేరణ ఇలా ఎన్నైనా, ఎంతైనా చెప్పుకోవచ్చు. చేతి వేలిపట్టి నడిపించే స్థితి నుంచి చివరకు చితి వరకు నడిపించేంత వరకు ప్రతీ ఒక్కరికి ఎన్నో జాపకాలు, భావోద్వేగాలతో జీవితం కలిబోసి ఉంటుంది. అలాంటి తండ్రిని మరింత ప్రేమతో గుర్తు చేసుకొనే రోజు ఫాదర్స్ డే. జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ డేను జరుపుకొంటున్న నేపథ్యంలో చిరంజీవి, మహేష్ బాబు, లక్ష్మి మంచు తమ భావోద్వేగాన్ని సోషల్ మీడియాలో పంచుకొన్నారు. సినీ ప్రముఖులు తమ తండ్రి గురించి ఏం చెప్పారంటే..

చిరుతతో నాన్న.. చిరునవ్వుతో నా బిడ్డ

చిరుతతో నాన్న.. చిరునవ్వుతో నా బిడ్డ

తండ్రి వెంకట్రావును మెగాస్టార్ చిరంజీవి ఫాదర్స్‌ డే రోజున తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. తన కుమారుడు బాల్యంలో ఉండగా రాంచరణ్‌ను ఎత్తుకొన్ని ఫోటోను చిరంజీవి షేర్ చేశారు. మా చార్మింగ్ డాడీతో చిరుత. మా నాన్న నవ్వు ...నా బిడ్డ చిరునవ్వు...రెండు నాకు చాలా ఇష్టం. హ్యాపీ ఫాదర్స్ డే అంటూ మెగాస్టార్ ఇన్స్‌టాగ్రామ్‌లో ట్వీట్ చేశారు.

ధైర్యానికి, ప్రేమకు ప్రతీక

ధైర్యానికి, ప్రేమకు ప్రతీక

తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గురించి చెబుతూ మహేష్ బాబు భావోద్వేగానికి లోనయ్యారు. మానసిక ధృడత్వం, దయ, ప్రేమ, ఉన్నతమైన వ్యక్తిత్వం, ఇతరులపై కురిపించే అభిమానం .. ఇలా ఎన్నైనా నా తండ్రితో ఉన్న బంధం గురించి చెప్పుకొంటూ వెళ్తాను. ఆయన లేకుంటే నేను లేను. నా తండ్రి నాకు నేర్పిన ఎన్నో విషయాలను నా పిల్లలతో పంచుకొంటున్నాను. హ్యాపీ ఫాదర్స్ డే అంటూ మహేష్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో పేర్కొన్నారు.

 రాంచరణ్ ఎమోషనల్‌గా

రాంచరణ్ ఎమోషనల్‌గా

ఫాదర్స్ డే రోజున మెగా పవర్ స్టార్ రాంచరణ్ చాలా సింపుల్‌గా స్పందించి గొప్ప ఫీలింగ్‌ను అందించారు. కొన్ని బంధాలను నిర్వహించడానికి మాటలు, ప్రేమను చూపించడానికి చేతలు అవసరం లేదు. హ్యాపీ ఫాదర్స్ డే అంటూ రాంచరణ్ తన తండ్రితో కలిసి ఉన్న ఫోటోలను ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

అందమైన జీవితాన్ని ప్రసాదించిన నాన్నకు

అందమైన జీవితాన్ని ప్రసాదించిన నాన్నకు

ఫాదర్స్ డేను పురస్కరించుకొని శృతిహాసన్ తన తండ్రికి విషెస్ అందించారు. నా ప్రియమైన తండ్రికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు. అందమైన జీవితాన్ని ప్రసాదించినందుకు థ్యాంక్స్. జీవితాన్ని పరిపూర్ణంగా జీవించడానికి, ధైర్యాన్ని, కళలపట్ల ఆరాధనాభావాన్ని పెంచినందుకు జీవితాంతం రుణపడి ఉంటాను అని శృతి హాసన్ తన ఇన్స్‌టాలో పేర్కొన్నారు.

Recommended Video

Simbu's Father Given Clarity Over His Son's Marriage
త్యాగాలకు నిలువెత్తు రూపం

త్యాగాలకు నిలువెత్తు రూపం

ఫాదర్స్ డే రోజున తండ్రి త్యాగాలను లక్ష్మీ మంచు గుర్తు చేసుకొన్నారు. పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చూసిన నా తండ్రి ఎప్పటికే నా దృష్టిలో గ్రేటెస్ట్. ప్రతీ రోజు పిల్లలపై కురిపించే ప్రేమ చేస్తుంటే నాన్నను మించిన దైవం ఉండదనే ఫీలింగ్ కలుగుతుంది. నాన్న మనస్తైర్యంతోనే ముందుకు వెళ్తున్నానే ఫీలింగ్ కలుగుతుంది అని లక్ష్మీ మంచు తన ఇన్స్‌టాగ్రామ్‌లో ఎమోషనల్ అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X