Happy Father's Day: సిద్ధమవుతున్న టాలీవుడ్ స్టార్ హీరోల కిడ్స్.. లైన్‌లో పవన్, మహేష్, రవితేజ వారసులు

సినిమా ఇండస్ట్రీలో రాబోయే వారాసులపై అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే హీరోల స్టార్ డమ్ అందుకోవడం అనేది అందరికి సాధ్యం కాదు. బ్యాక్ గ్రౌండ్ ఉన్నా లేకపోయినా ఫైనల్ గా టాలెంట్ ఉన్నవాళ్లే ఇండస్ట్రీలో ఉంటారనేది అసలైన సత్యం. అందుకు ఉదాహరణలు కూడా చాలానే ఉన్నాయి. ఇక నేడు ఫాదర్స్ డే సందర్భంగా స్టార్ హీరోల పిల్లల వారసుల పేర్లు కూడా వైరల్ అవుతున్నాయి. తప్పకుండా తండ్రి స్టార్ డమ్ ను అందుకుంటారని టాక్ వస్తోంది.

మరింత పవర్ఫుల్ గా..

మరింత పవర్ఫుల్ గా..

ప్రస్తుతం అక్కినేని, మెగా, నందమూరి నుంచి వచ్చిన యువ హీరోలు వారసత్వాన్ని అదే క్రేజ్ తో కొనసాగిస్తున్నారు. ఇక ఆ తరువాత రాబోయే జనరేషన్ హీరోలు కూడా మరింత పవర్ఫుల్ గా ఎంట్రీ ఇవ్వవచ్చని తెలుస్తోంది. ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, నాగచైతన్య ఎవరికి వారు తండ్రికి తగ్గ తనయులుగా రానిస్తున్నారు.

ఎంతో సమయం పట్టదు

ఎంతో సమయం పట్టదు

ఇక ప్రస్తుతం అందరి చూపు కూడా రేపు రాబోయే హీరోలపైనే ఉంది. అందులో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రవితేజ వారసులు రెడీగా ఉన్నారు. దాదాపు ఈ ముగ్గురు కూడా టీనేజ్ వయసును దాటేసే స్టేజ్ లో ఉన్నారు. చూస్తుండగానే కాలం వేగంగా వేలుతోంది కాబట్టి యంగ్ ఏజ్ లోకి రావడానికి ఎంతో సమయం పట్టదు.

రవితేజ.. మహాధన్

రవితేజ.. మహాధన్

రవితేజ కుమారుడు మహాధన్ భూపతి రాజు ఇదివరకే ఒక సినిమాలో నటించాడు. మాస్ రాజా నటించిన రాజా ది గ్రేట్ సినిమాలో చిన్నప్పటి హీరోగా కనిపించి అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్ చూపించాడు. ఇక ఫాదర్స్ డే సందర్భంగా రవితేజ తన కొడుకు లేటెస్ట్ ఫోటోను షేర్ చేసుకున్నాడు.

మహేష్.. గౌతమ్ ఘట్టమనేని

మహేష్.. గౌతమ్ ఘట్టమనేని

ఇక మహేష్ బాబు తనయుడు కూడా వన్ నేనొక్కడినే సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మరో రెండు నెలలు అయితే అతను కూడా 16లోకి అడుగు పెడతాడు. 20లోకి వచ్చాడు అంటే అభిమానులు అతని ఎంట్రీ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Recommended Video

Mahesh Babu Namrata Shirodkar - Best Couple In Tollywood
పవర్ స్టార్.. అకిరా నందన్

పవర్ స్టార్.. అకిరా నందన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ కోసం కూడా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 17లోకి వచ్చిన అకిరా ఇప్పటికే హీరోల్లో అందరికంటే ఎక్కువ ఎత్తుకు ఎదిగిపోయాడు. అకిరా ఎంట్రీ ఇస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద హంగామా మామూలుగా ఉండదని చెప్పవచ్చు. మరి ఆ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X