twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందరి జీవితాల్ని మార్చేసిన ఆ సినిమాకు మూడేళ్లు.. మహేష్ ఎందుకు రిజెక్ట్ చేశాడంటే?

    |

    2017లో ఇదే సమయానికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఫిదా సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమా సక్సెస్ అవుతుంది అవుతుంది అనుకున్నారు గాని బాక్సాఫీస్ వద్ద మరీ ఆ స్థాయిలో రికార్డులు సృష్టిస్తుందని ఎవరు ఊహించలేదు. ఇక ఈ సినిమా హిట్టుతో వర్క్ చేసిన అందరికి చాలా రోజుల తరువాత ఒక మంచి బాక్సాఫీస్ హిట్ దొరికినట్లయ్యింది. ఇక ఈ సినిమా కథ మొదట మహేష్ దగ్గరకు వెళ్లింది. కానీ ఆయన ఒప్పుకోలేదు. ఆ వివరాలపై ఒక లుక్కేద్దాం..

    ఫిదా మేకింగ్ వీడియో..

    ఫిదా మేకింగ్ వీడియో..

    సినిమా మూడేళ్లు పూర్తయిన సందర్భంగా చిత్ర యూనిట్ నుంచి ఒక మేకింగ్ వీడియోను కూడా విడుదల చేశారు. సాయి పల్లవి, వరుణ్ తేజ్ అలాగే ఇతర నటీనటులు టెక్నీషియన్స్ లొకేషన్స్ లో ఏ విధంగా వర్క్ చేశారు అనే మూమెంట్స్ ని ఆ వీడియో ద్వారా చూపించారు. ప్రస్తుతం యూ ట్యూబ్ లో ఆ వీడియో కూడా వైరల్ అవుతోంది.

    అసలైన హిట్టు..

    అసలైన హిట్టు..

    ఇక ఈ సినిమా కథను దర్శకుడు శేఖర్ కమ్ముల సాయు పల్లవి కోసమే రాసినట్లు అనిపిస్తుంది. ఇక వరుణ్ తేజ్ క్లాస్ యాక్టింగ్ మేజర్ ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. సాయి పల్లవి మాస్ డైలాగ్స్ తో పాటు రొమాంటిక్ సీన్స్ సినిమాలో హైలెట్ గా నిలిచాయి. ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా దర్శకుడు శేఖర్ కమ్ముల చాలా రోజుల తరువాత అసలైన హిట్టు కొట్టాడు.

    మహేష్ ఎందుకు ఒప్పుకోలేదంటే..?

    మహేష్ ఎందుకు ఒప్పుకోలేదంటే..?

    దర్శకుడు శేఖర్ కమ్ముల దిల్ రాజుకు ఫిదా కథ చెప్పగానే మహేష్ బాబు అయితే బావుంటుందని అనుకోని ఆయనను సంప్రదించగా సూపర్ స్టార్ కి కథ బాగా నచ్చేసింది. కానీ ఆయన స్టార్ డమ్ కి ఏ మాత్రం సెట్టవ్వదని చాలా కూల్ గా నో చెప్పేశారు. మహేష్ చెప్పింది కూడా చాలా బెస్ట్ అని శేఖర్ కమ్ముల వరుణ్ తేజ్ ని సంప్రదించగా వెంటనే ఆ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

     ఫిదా అందరికి లాభమే..

    ఫిదా అందరికి లాభమే..

    అప్పటి వరకు వరుస అపజయాలతో ఉన్న వరుణ్ తేజ్ కి ఫిదా అసలైన బ్రేక్ ఇచ్చింది. ఇక సాయి పల్లవి మొదటి తెలుగు సినిమాతోనే టాలీవుడ్ లో మంచి క్రేజ్ అందుకుంది. మరోవైపు శేఖర్ కమ్ముల కూడా కెరీర్ లో చాలా రోజుల తరువాత బిగెస్ట్ బాక్సాఫీస్ హిట్ అందుకున్నారు. ఇక నిర్మాత దిల్ రాజుకి కూడా కెరీర్ లో అత్యధిక లాభాలను అందించిన సినిమాగా ఫిదా నిలిచింది.

    English summary
    When director Shekhar Kammula told Dil Raju the story of Fida, Mahesh Babu did not think it was good and approached him and the superstar liked the story very much. But he said no so cool that he would not set anything for stardom. Shekhar Kammula contacted Varun Tej and the hero immediately gave the green signal.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X