Jai Balayya: బాలకృష్ణను మరిపించిన ఫారెనర్.. చూడ్డానికి అచ్చం ఆయనలాగే.. చివర్లో మాత్రం ట్విస్ట్
తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. ఎన్టీఆర్ కుమారుడిగా సినిమాల్లోకి వచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నారాయన. ఈ క్రమంలోనే కొన్ని కోట్ల మంది అభిమానాన్ని సైతం సొంతం చేసుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే బాలకృష్ణ పేరుపై ఉన్నన్ని అభిమాన సంఘాలు మరే హీరోకూ లేవని అంటుంటారు. కొంత కాలంగా బాలయ్య సినిమాలు అంతగా ఆడడం లేదు. కానీ, తాజాగా విడుదలైన 'అఖండ' మాత్రం భారీ సక్సెస్‌ను అందుకుంది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నటసింహా ఫారెన్ ఫ్యాన్ జై బాలయ్య స్టెప్పుతో అలరించాడు. దానిపై మీరూ ఓ లుక్కేయండి!

‘అఖండ'గా మారిపోయిన బాలయ్య
నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన సినిమానే 'అఖండ'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ మూవీని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాడు. ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా చేసింది. శ్రీకాంత్ నెగెటివ్ రోల్ చేశాడు. ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇది డిసెంబర్ 2న గ్రాండ్‌గా విడుదలైంది.

పాజిటివ్ రివ్యూలు.. సూపర్ హిట్ టాక్
భారీ అంచనాల నడుమ వచ్చిన 'అఖండ' మూవీకి ప్రీమియర్ షోల నుంచే భారీ రెస్పాన్స్ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను ఫ్యాన్స్ కోలాహలం నడుమ ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. అందుకు అనుగుణంగానే దీనికి ఆరంభం నుంచే సూపర్ డూపర్ హిట్ టాక్ వచ్చింది. దీనికితోడు విమర్శకుల నుంచి ఈ మూవీకి పాజిటివ్ రివ్యూలు కూడా వచ్చాయి.

నాలుగు రోజుల్లోనే అన్ని కోట్లు కొట్టేసి
నాలుగు రోజుల్లో బాక్సాఫీస్‌పై అఖండ కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఫలితంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 37.56 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.05 కోట్లు రాబట్టింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 44.86 కోట్లు షేర్, రూ. 73.60 కోట్లు గ్రాస్ రాబట్టింది. తద్వారా టార్గెట్‌కు మరింత చేరువ అయింది.

ఆ దేశాల్లో కూడా బాలయ్య మేనియా
నందమూరి బాలకృష్ణకు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. అందుకే 'అఖండ' మూవీని అమెరికా, ఆస్ట్రేలియాతో పాటు పలు సినిమాల్లో విడుదల చేశారు. అక్కడ కూడా ఈ సినిమా ప్రదర్శితం అయ్యే థియేటర్లు కళకళలాడిపోయాయి. ఫ్యాన్స్ హంగామాతో మోత మోగిపోయాయి. దీంతో కలెక్షన్లు కూడా భారీ స్థాయిలో వసూలు అయ్యాయి.

బాలకృష్ణను మరిపించిన ఫారెన్ ఫ్యాన్
క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ' మూవీ ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులంతా నీరాజనాలు పలుకుతున్నారు. రోజు రోజుకూ ఈ సినిమాకు వచ్చే ఆదరణ పెరుగుతూనే ఉంది. అదే సమయంలో ఈ సినిమాలో బాలయ్య చెప్పిన డైలాగులు, వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఫారెనర్ అచ్చం బాలయ్యలా డ్యాన్స్ చేశాడు.
Recommended Video
అచ్చం ఆయనలానే... చివర్లో ట్విస్ట్
'అఖండ' మూవీలోని జై బాలయ్య సాంగ్ ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాటకే ఓ ఫారెనర్ డ్యాన్స్ చేశాడు. ఇందులో అచ్చం బాలయ్యలా స్టెప్పులు వేశాడు. అంతేకాదు, షర్ట్స్ మారుస్తూ తెగ హంగామా చేశాడు. అయితే, చివర్లో మాత్రం అతడి శరీరంపై బట్టలన్నీ తీసేసి ట్విస్ట్ ఇచ్చాడు. ఈ వీడియోను ద్వారకా క్రియేషన్స్ సంస్థ ట్విట్టర్‌లో షేర్ చేసింది.


Click it and Unblock the Notifications











