For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వకీల్ సాబ్‌పై సుప్రీం మాజీ జడ్జి రివ్యూ: పవన్‌పై ఊహించని వ్యాఖ్యలు.. ఇండియాలోనే ఏకైక హీరో అంటూ!

  |

  కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతోన్న పేర్లలో 'వకీల్ సాబ్' ఒకటి. దీనికి కారణం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దాదాపు మూడేళ్ల తర్వాత ఈ మూవీ ద్వారా రీఎంట్రీ ఇవ్వడమే. ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఫలితంగా కలెక్షన్లు కూడా భారీగానే వసూలు అయ్యాయి. దీంతో మెగా హీరోకు ఘనమైన కమ్‌బ్యాక్ దక్కినట్లైంది. ఇలాంటి సమయంలో సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ గోపాల గౌడ 'వకీల్ సాబ్' మూవీపై రివ్యూ ఇచ్చారు. ఈ క్రమంలోనే కొన్ని ఊహించిన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు మీకోసం!

  వెండితెరపై లిప్‌లాక్స్.. శృంగార సన్నివేశాల్లో మునిగి తేలిన తారలు

  వాళ్ల కోసం ‘వకీల్ సాబ్'‌‌గా మారిన పవన్

  వాళ్ల కోసం ‘వకీల్ సాబ్'‌‌గా మారిన పవన్

  సుదీర్ఘ విరామం తర్వాత ‘వకీల్ సాబ్'తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు పవన్ కల్యాణ్. ఆడవాళ్ల సమస్యలపై తీసిన ఈ సినిమాను వేణు శ్రీరామ్ రూపొందించాడు. బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించాడు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటించగా.. అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రలు చేశారు. థమన్ సంగీతం అందించాడు. ఇది ‘పింక్'కు రీమేక్‌గా వచ్చింది.

  అర్ధనగ్నంగా హాట్ హీరోయిన్.. బికినీలో దారుణంగా స్కిన్ షో

  భారీ స్పందన... 10 రోజుల్లోనే 80 శాతం

  భారీ స్పందన... 10 రోజుల్లోనే 80 శాతం

  ఎన్నో అంచనాల నడుమ ఏప్రిల్ 9న ‘వకీల్ సాబ్' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి అన్ని ప్రాంతాల్లోనూ అద్భుతమైన స్పందన వచ్చింది. తద్వారా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో పాటు భారీ స్థాయిలో ఓపెనింగ్స్‌ దక్కాయి. ఫలితంగా ఈ సినిమా కలెక్షన్లను కూడా అదే రీతిలో దక్కించుకుంది. ఇక, పది రోజుల్లోనే దాదాపు రూ. 85 కోట్ల వరకు వసూలు చేసింది.

  సముద్ర తీరంలో సానియా గ్లామర్ డోస్.. యువ హీరోయిన్ గ్లామర్ జోరు

  ప్రభుత్వం నుంచి వరుస ఎదురుదెబ్బలు

  ప్రభుత్వం నుంచి వరుస ఎదురుదెబ్బలు

  ఆరంభం నుంచే ‘వకీల్ సాబ్' చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వరుసగా దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఈ సినిమా బెనిఫిట్, స్పెషల్ షోలు రద్దు చేసిన జగన్ సర్కారు.. ఆ వెంటనే టికెట్ రేట్లను తగ్గించాలని కొత్త జీవోను తీసుకొచ్చింది. దీంతో పవన్ కల్యాణ్ సినిమా కలెక్షన్లపై తీవ్ర స్థాయిలో ప్రభావం పడిపోయింది. ఇప్పుడేమో కరోనా నేపథ్యంతో సిట్టింగ్‌ను 50 శాతం చేసింది.

  మాస్టర్ హీరోయిన్ క్లీవేజ్ షో.. చీరకట్టులో సరికొత్త అందాలు

  ‘వకీల్ సాబ్'పై సుప్రీం మాజీ జడ్జ్ రివ్యూ

  ‘వకీల్ సాబ్'పై సుప్రీం మాజీ జడ్జ్ రివ్యూ

  ‘వకీల్ సాబ్' మూవీకి ప్రేక్షకులతో పాటు సెలెబ్రిటీల నుంచి సైతం మంచి రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన ఎంతో మంది హీరోలు, మిగిలిన ప్రముఖులంతా ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో ఈ సినిమా రేంజ్ దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లోనే సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ గోపాల గౌడ ‘వకీల్ సాబ్' మూవీపై రివ్యూ ఇచ్చారు.

  హాట్ హాట్‌గా సినీ హీరోయిన్లు.. స్థూలకాయం నుంచి సన్నజాజిలా మారిన భామల (ఫోటోలు)

  అప్పట్లో ఆ సినిమా.. ఇప్పుడు ఇది అని

  అప్పట్లో ఆ సినిమా.. ఇప్పుడు ఇది అని

  ‘వకీల్ సాబ్' సినిమాను చూసిన ఆయన ఓ లేఖను విడుదల చేశారు. అందులో ‘సాధారణంగా సినిమాలు ఒక వ్యక్తి లేదా కుటుంబం లేదా ఇతిహాసం లేదా కల్పిత కథలతో వస్తాయి. కానీ, దేవదాసు చిత్రం పవిత్ర ప్రేమను చూపించింది. అందుకే దేశంలోనే ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఇన్నాళ్లకు ‘వకీల్ సాబ్' రూపంలో అలాంటి చిత్రం మళ్లీ వచ్చింది' అని జస్టిస్‌ గోపాల గౌడ చెప్పారు.

  పవన్‌ కల్యాణ్‌పై ఊహించని వ్యాఖ్యలతో

  పవన్‌ కల్యాణ్‌పై ఊహించని వ్యాఖ్యలతో

  ‘వకీల్ సాబ్'లో పవన్ నటన గురించి మాజీ జస్టిస్ చెబుతూ.. ‘మహిళల హక్కుల కోసం పోరాటం చేసే లాయర్‌గా పవన్ గారి నటన అత్యద్భుతం. సాధారణంగా ఇలాంటి సందేశాత్మక చిత్రాలు మాస్ ఫాలోయింగ్ ఉన్న నేటి హీరోలు చేయరు. కానీ, పవన్ గారు నిజ జీవితంలో మాదిరిగానే సినిమాలోనూ పోరాటం చేశారు. వకీల్ సాబ్‌లో ఆయన నటించలేదు.. జీవిచారు' అని పేర్కొన్నారాయన.

  ఏ నటుడికీ అలాంటిది దక్కలేదు అంటూ

  ఏ నటుడికీ అలాంటిది దక్కలేదు అంటూ

  దీనిని కొనసాగిస్తూ.. ‘వకీల్ సాబ్ చిత్రాన్ని మెచ్చుకుంటూ దేశంలోని అగ్ర నటులే కాదు.. ప్రపంచ స్థాయి నటుల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి. నాకు తెలిసి ఈ అరుదైన గౌరవం చలనచిత్ర రంగంలో ఇప్పటి వరకూ ఏ నటుడికీ దక్కలేదు. అందుకే వకీల్ సాబ్ అద్భుత చిత్రంగా చిరస్థాయిగా నిలిచిపోతుంది' అంటూ జస్టిస్‌ గోపాల గౌడ వెల్లడించారు. దీంతో ఈ లేఖ వైరల్ అవుతోంది.

  English summary
  Vakeel Saab is a 2021 Indian Telugu-language legal drama film directed by Venu Sriram and produced by Dil Raju and Sirish under Sri Venkateswara Creations in association with Bayview Projects. A remake of the 2016 Hindi film Pink, the film stars Pawan Kalyan, Nivetha Thomas, Anjali, Ananya Nagalla, Prakash Raj, and Shruthi Haasan.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X