Friendship Day special: మన స్టార్ హీరోల దోస్తాన్.. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మారని స్టార్స్.. స్నేహామంటే ఇదేరా

స్నేహానికి డబ్బు, హోదా, స్థాయి, అంతస్తు ఏమి ఉండవు. ఒకవేళ అలా ఉంటే దాన్ని స్నేహం అనలేరు. ఇక అలాంటి స్టేటస్ తో ఉన్నవాళ్లకు నమ్మకమైన స్నేహితులు దొరకడం చాలా అరుదు. ముఖ్యంగా సినిమా ప్రపంచంలో ప్రాణ స్నేహితులు ఉండడం అనేది ఒక అదృష్టం అనే చెప్పవచ్చు. అందుకే కొంతమంది స్టార్స్ ఒకసారి స్నేహం చేస్తే అంత ఈజీగా ఎవరిని వదులుకోరు. ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ప్రపంచంలో కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఏళ్ళు గడిచినా కూడా విడిపోలేదు. అలాంటి వారిపై ఒక లుక్కేస్తే..

ప్రభాస్ - గోపిచంద్

ప్రభాస్ - గోపిచంద్

సినిమా ఇండస్ట్రీలో హీరోలలో మంచి స్నేహితులు అంటే అందులో ప్రభాస్ - గోపిచంద్ టాప్ లో ఉంటారు. వర్షం సినిమాలో హీరో, విలన్ గా కొట్టుకున్నప్పటికి రియల్ లైఫ్ లో మాత్రం ఇద్దరి స్నేహం గురించి అందరికి తెలిసిందే. వారి కెరీర్ మొదలవ్వక ముందు నుంచి ఇప్పటివరకు అలానే కొనసాగుతోంది.

చిరంజీవి - నాగార్జున

చిరంజీవి - నాగార్జున

సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి - నాగార్జున కూడా చాలా మాంచి స్నేహితులు. ఇండస్ట్రీలో అగ్ర తారల మధ్యలో ఎలాంటి విబేధాలు వచ్చినా కూడా వీరు మాత్రం కలిసే ఉంటారు. ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటు బ్రదర్స్ లాగా ఉంటారు. సినిమాల ప్రమోషన్స్ లో కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు.

రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్

రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్

రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమా ద్వారా మరింత దగ్గరైన విషయం తెలిసిందే. సినిమా మొదలవ్వక ముందు నుంచే పర్సనల్ గా ఒకరికొకరు అనేక విషయాలను షేర్ చేసుకుంటూ దగ్గరయ్యారు. ఇక రాజమౌళి ఆ బాండింగ్ ను మరింత దగ్గర చేశారు. ఆ ఇద్దరి హీరోలు కలిసి ప్రమోషన్ లో పాల్గొనబోతున్నారు కూడా. అప్పుడు జనాలకు వారి స్నేహంపై మరింత క్లారిటీ వస్తుంది.

రానా దగ్గుబాటి బెస్ట్ ఫ్రెండ్

రానా దగ్గుబాటి బెస్ట్ ఫ్రెండ్

రానా దగ్గుబాటికి ఇండస్ట్రీలో చాలా మంది క్లోజ్ ఫ్రెండ్స్ వున్నారు. రానా ఉన్నాడు అంటే అక్కడ వాతావరణం అల్లరిగా కొనసాగుతుంది. ఇక చిన్నప్పటి నుంచి రానాతో ఎంతో స్నేహంగా ఉండేవారిలో రామ్ చరణ్ ఒకరు. ఎందుకంటే వీరిద్దరూ కూడా చిన్నప్పుడు ఒకే స్కూల్ లో చదువుకున్నారు. ఎంత బిజీగా ఉన్నా రామ్ చరణ్ - రానా తరచుగా కలుసుకుంటూనే ఉంటారు.

నితిన్ అఖిల్

నితిన్ అఖిల్

ఇక యంగ్ జనరేషన్ లో అఖిల్ తో ఎక్కువగా క్లోజ్ ఉండేవారిలో నితిన్ ఒకరు. ఇండస్ట్రీలో అఖిల్ అడుగు పెట్టకముందే పార్టీల ద్వారా నితిన్ పరిచయం అయ్యాడు. జిమ్ లో కలిసి వర్కౌట్స్ కూడా చేస్తుంటారు. ఇక అఖిల్ మొదటి సినిమాను నితిన్ తన హోమ్ ప్రొడక్షన్ లోనే నిర్మించిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ వీరి మధ్య స్నేహం ఏ మాత్రం తగ్గలేదు.

అల్లరి నరేష్ - నాని

అల్లరి నరేష్ - నాని

అల్లరి నరేష్ - నాని కూడా చాలా మంచి ఫ్రెండ్స్ అని అందరికి తెలిసిందే. నాని ఎంట్రీ ఇచ్చిన కొత్తలో అల్లరి నరేష్ కెరీర్ బాగానే ఉంది. ఆ టైమ్ లోనే నరేష్ నానితో ఏరా అనిపించుకునేంత క్లోజ్ అయ్యాడు. ఇద్దరి హీరోలకు ఎన్ని అపజయాలు వచ్చినా ఎన్ని విజయాలు వచ్చినా కూడా స్నేహంలో మాత్రం ఎలాంటి తేడా రాలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X