Friendship Day: రీల్ టూ రియల్ లైఫ్‌.. టాలీవుడ్ స్టార్స్‌లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరెవరో తెలుసా?

తెలుగు సినిమా దగ్గర అనేకమంది స్టార్స్ తమ పలు చిత్రాలతో ఆడియెన్స్ ని ఎప్పటికప్పుడు అలరిస్తూ వస్తున్నా సంగతి విదితమే. అయితే ఈ స్టార్స్ లో కూడా చాలా మంది సినిమాల్లో స్నేహితులుగా నటించిన వాళ్ళు ఉన్నారు అలాగే సినిమాల్లోనే కాకుండా బయట కూడా మంచి స్నేహతులుగా ఉన్న వారు కూడా ఉన్నారు. అయితే కొందరికి సినిమాల మూలాన పరిచయం పెరిగి స్నేహితులుగా మారితే మరికొందరు ఇండస్ట్రీ లోనే ఉండడం మూలాన కుటుంబాలు, చదువులు పరంగా మంచి స్నేహితులు ఉన్నారు.

మరి మన టాలీవుడ్ లో అలా ఉన్నటువంటి చాలా మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరెవరో తెలుసా? ప్రెజెంట్ జెనరేషన్ లో అయితే చాలా మంది యంగ్ హీరోస్ తో ఒక్క మెగా హీరో మాత్రం చాలా ఎక్కువగా కామన్ గా కనిపిస్తాడు. ముందు మన సీనియర్ హీరోస్ నుంచే చూసుకుంటే టాలీవుడ్ లో సీనియర్ హీరోస్ మెగాస్టార్ చిరంజీవి ఇంకా నాగార్జున బెస్ట్ ఫ్రెండ్స్ అని చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ వీరిద్దరూ టాలీవుడ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే కాకుండా ఎప్పటి నుంచి బిజినెస్ పార్ట్నర్స్ గా కూడా కొనసాగుతున్నారు.

friendship day special tollywood stars who have best friends in industry

అలాగే కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంకా మంచు టాలీవుడ్ నుంచి మంచు మోహన్ బాబు కూడా మంచి స్నేహితులే.. కాకపోతే మోహన్ బాబు కొన్ని కామెంట్స్ చాలా మంది తేలిగ్గా తీసుకుంటారు కానీ రజినీకాంత్ కి మోహన్ బాబు అంటే ఎంతో అభిమానం ఇద్దరూ ఇప్పటికీ కలిసినపుడు ఎంతో కలివిడిగా మెలుగుతారు. ఇటీవల ఇద్దరిపై కూడా ఒక పిక్ వచ్చి వైరల్ గా మారింది.

ఇక ప్రెజెంట్ బిగ్ స్టార్స్ లో అయితే దర్శకుడు త్రివిక్రమ్ ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు మంచి స్నేహితులు వారి బాండింగ్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగే త్రివిక్రమ్ కి మహేష్ బాబు ఇంకా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా మంచి స్నేహితులుగా మారమని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇంకా వీరితో పాటుగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి మాత్రం టాలీవుడ్ స్టార్స్ లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు.

friendship day special tollywood stars who have best friends in industry

వారిలో బెస్టాఫ్ బెస్ట్ ఫ్రెండ్స్ గా అయితే శర్వానంద్ ఇంకా రానా దగ్గుబాటిలు ఎప్పుడు నుంచో మంచి బాండింగ్ ఉంది. వీరిలో చరణ్, రానా దగ్గుబాటిలు అయితే చిన్నపుడు నుంచి ఫ్రెండ్స్. ఇంకా మరో స్టార్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు అంటే వారు పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ అలాగే మ్యాచో హీరో గోపీచంద్ లు కూడా మంచి స్నేహితులు. పాన్ ఇండియా క్రేజ్ వచ్చిన తర్వాత కూడా ప్రభాస్ గోపీచంద్ ప్రతి సినిమాని తన బెస్ట్ విషెష్ తెలిపేవాడు.

అలాగే తన వైపు నుంచి సినిమాల పరంగా పలు సజెషన్స్ ని కూడా తాను ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ప్రభాస్ కి ఇంకా రామ్ చరణ్ కి కూడా మంచి బాండింగ్ ఉందని చాలా మందికి బాలయ్య టాక్ షోలోనే తెలిసింది. ఇంకా మళ్ళీ చరణ్ తో అక్కినేని యువ హీరో అక్కినేని అఖిల్ కూడా ఎంతో ఫ్రెండ్లీగా ఉంటాడు. వీరు కాకుండా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు అయితే బావా బావా అని పిలుచుకునేంత దగ్గర స్నేహితులు.

ఇంకా RRR కంటే ముందు నుంచే ఎన్టీఆర్, రామ్ చరణ్ లు మంచి స్నేహితులు అని చాలా మందికి తెలియదు. దీనితో సినిమాలోనే కాకుండా బయట కూడా ఈ ఇద్దరు మంచి స్నేహితులు అని ఈ సినిమా తర్వాతే తెలిసింది. ఇక వీరితో పాటుగా వీరి పవన్ కళ్యాణ్, ఆలీ ఒకప్పుడు మంచి స్నేహితులే అలాగే మిల్కీ బ్యూటీ తమన్నా, కాజల్ అగర్వాల్ లు మన తెలుగులో మంచి ఫ్రెండ్ ఎవరు అంటే రామ్ చరణ్ పేరునే చెబుతారు.

ఇక టైర్ 2 లోకి వస్తే విజయ్ దేవరకొండ, సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఇంకా దర్శకుడు నాగ్ అశ్విన్ లకి మంచి స్నేహితుడు కాగా నాచురల్ స్టార్ నానికి అయితే యంగ్ హీరోయిన్ నివేతా థామస్ మంచి ఫ్రెండ్ కాగా తాను హీరోయిన్ గా చేయకపోయినా కూడా తన సినిమాలకి ఆమె హాజరైన సందర్భాలు ఉన్నాయి. అలాగే నానికి కీర్తి సురేష్ కూడా మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ అని ఈ మధ్యే బయటకి వచ్చింది. ఇలా మన తెలుగు స్టార్స్ లో అయితే ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. మరి ఇందులో అత్యధికంగా అందరిలో కామన్ గా అయితే మెగా హీరో రామ్ చరణ్ కనిపిస్తున్నాడని చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X