గబ్బర్ సింగ్‌‌కు 8 ఏళ్లు: అప్పుడు బాక్సాఫీస్, ఇప్పుడు ట్విట్టర్ బెండు తీస్తూ, 34 మినిట్స్ లోనే రచ్చ

టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన గబ్బర్ సింగ్‌ ఎనిమిదేళ్లు పూర్తి చేసుకొన్నాడు. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన దంబంగ్ సినిమాకు రీమేక్‌గా పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శృతిహాసన్ జంటగా బండ్ల గణేష్ నిర్మాతగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తొలి ఆట నుంచి ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమా రిలీజ్ 8 ఏళ్లు పూర్తి చేసుకొన్న సందర్బంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఈ సినిమా గురించి కొన్ని విషయాలు మీకోసం..

30 కోట్లతో 150 కోట్లు

30 కోట్లతో 150 కోట్లు

బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన దంబంగ్ హక్కులను కొనుగోలు చేసి నిర్మాత బండ్ల గణేష్ తన సొంత బ్యానర్ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్‌పై రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ చిత్రం 11 మేన 2012న రిలీజైంది. మొదటి ఆట నుంచే రికార్డులు బద్దలు కొడుతూ గబ్బర్ సింగ్ చిత్రం రూ.150 కోట్లు వసూలు చేసి పెట్టింది.

పాటలు, మాటలు ప్రేక్షకులకు కిక్

పాటలు, మాటలు ప్రేక్షకులకు కిక్

పవన్ కల్యాణ్ స్టైల్, హీరోయిజం, దర్శకుడు హరీష్ శంకర్ రచన, మాటలు, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం ప్రేక్షకులకు కిక్కెక్కించాయి. దాంతో ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఇండస్ట్రీలో మైలురాయిగా నిలిచింది. అయితే ఈ సినిమాను స్వయంగా పవన్ కల్యాణ్ నిర్మాతగా మారి రూపొందించాలని అనుకొన్నారు. అప్పటికే తీన్మార్ సినిమాతో నష్టాల్లో ఉన్న బండ్ల గణేష్‌కు మరోసారి అవకాశం ఇవ్వడంతో ఆయన నిర్మాతగా మారారు.

లైఫ్ టైమ్ కలెక్షన్లు ఇలా..

లైఫ్ టైమ్ కలెక్షన్లు ఇలా..

గబ్బర్ సింగ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.8.15 కోట్లు వసూలు చేయగా, తొలి వారాంతం రూ.16.45 కోట్లు, తొలివారం రూ.27.4 కోట్లు, రెండో వారం రూ.11.6 కోట్లు, ఇండియా వైడ్ లైఫ్ టైమ్ కలెక్షన్లు రూ.55 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.129 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

గబ్బర్ సింగ్ రికార్డులు

గబ్బర్ సింగ్ రికార్డులు

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే రోజున గబ్బర్ సింగ్ సినిమాకు సంబంధించిన వీసీడీలు, డీవీడీలు, బ్లూరే డిస్క్‌లను రికార్డు ధరకు కొనుగోలు చేసి శ్రీ బాలాజీ వీడియోస్ రిలీజ్ చేశారు. అలాగే ఈ సినిమా శాటిలైట్ హక్కులు రూ.9 కోట్లకు అమ్మడం అప్పట్లో ఇండస్ట్రీ రికార్డు. ఈ సినిమాను 2013లో సంక్రాంతి సమయంలో టెలివిజన్‌లో ప్రసారం చేస్తే 24 పాయింట్ల టీఆర్సీ రేటింగ్ రావడం అదో చరిత్రగా నమోదైంది.

Recommended Video

Ranbir Kapoor About His Breakup With Deepika Padukone
34 నిమిషాల్లోనే ట్విట్టర్‌లో రికార్డుల మోత

34 నిమిషాల్లోనే ట్విట్టర్‌లో రికార్డుల మోత

ఇలాంటి రికార్డులతో హోరెత్తించిన గబ్బర్ సింగ్ మరోసారి 8 ఏళ్ల తర్వాత సోషల్ మీడియాలో చరిత్ర సృష్టించారు. #8YrsOfGabbarSinghHysteria ట్యాగ్ అతి తక్కువ సమయంలో దేశవ్యాపత్ంగా ఎక్కువ ట్వీట్లు సాధించిన చిత్రంగా రికార్డును సొంతం చేసుకొన్నది. గబ్బర్ సింగ్ చిత్రం 34 నిమిషాల్లోనే 1 మిలియన్ ట్వీట్స్ సాధించడం రికార్డుగా మారింది. పవన్ కల్యాణ్ బర్త్ డే ట్వీట్ 37 నిమిషాల్లో, 14 ఏళ్ల పోకిరి 53 నిమిషాల్లో, ఎన్టీఆర్ బర్త్ డే 65 నిమిషాలు్లో, థలా అజిత్ బర్త్ డే ట్వీట్ 70 నిమిషాల్లో 10 లక్షల ట్వీట్స్ సాధించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X