సన్నీలియోన్ ఇంట వినాయక సంబరాలు.. భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి..
వినాయక చవితి వచ్చిందంటే ఆ క్రేజే వేరు. ఎంతో ప్రత్యేకమైన ఈ పండుగను ఊరూరా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం వినాయకుడిని ఆది దేవుడైన వినాయకుడిని భక్తి శ్రద్దలతో పూజిస్తూ ఉత్సవాలు చేస్తారు. ప్రతీ వీధిలో, ప్రతీ ఇంటా గణపతి పప్ప విగ్రహాన్ని ప్రతిష్టించి గొప్పగా పూజలు చేస్తారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్ ఇంట వినాయక చవితి సంబరాలు జరిగాయి.
భర్త డానియెల్ వెబర్, తన కూతురు నిషా కౌర్ వెబర్, ఇద్దరు కుమారులు అషేర్ సింగ్, నోహ్ సింగ్‌తో కలిసి గణనాథుడి భక్తిలో మునిగిపోయింది సన్నీ. ప్రస్తుతం వినాయకుడి వద్ద కుటుంబంతో కలిసి కూర్చొన్న సన్నీ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షలాది లైకులు, కామెంట్లతో హోరెత్తించారు నెటిజన్లు. ఈ సందర్బంగా సన్నీకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

పోర్న్ స్టార్‌గా భారీ పాపులారిటీ తెచ్చుకున్న సన్నీలియోన్ అటు నుంచి బాలీవుడ్ తెరపై కాలుమోపింది. కెరీర్ ఆరంభంలోనే పలు సినిమాలతో మెప్పించడంతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. ఇక ఇటీవలే టాలీవుడ్‌లో రాజశేఖర్ హీరోగా నటించిన 'గరుడ వేగ' సినిమాలో ''డియ్యో డియ్యో'' అంటూ ఐటెం సాంగ్‌కే కొత్త వన్నె తెచ్చి ప్రేక్షకులను ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేసింది సన్నీ. దీంతో ఐటెం సాంగ్స్ కోసం సన్నీనే బెట్టర్ ఆప్షన్ అని భావిస్తున్నారు నేటితరం దర్శకనిర్మాతలు.


Click it and Unblock the Notifications











