twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గణేష్ పాట ఉంటే హిట్టే.. సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్న ఫిల్మ్ మేకర్స్

    |

    హిందూ సంప్రదాయం ప్రకారం వినాయకుడిని ఆది దేవుడు అంటారు. అందుకే ఆయన పూజతోనే అన్ని పనులు ప్రారంభిస్తారు. అది ఏ రంగమైనా సరే గణపతి పూజ ఉండాల్సిందే. ఇక, సెంటిమెంట్లు ఎక్కువగా ఫాలో అయ్యే సినిమా రంగం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. తమ సినిమా ప్రారంభం రోజు గణపతి పూజ చేసి షూటింగ్ స్టార్ట్ చేసేస్తారు. చాలా మందైతే ప్రత్యేకంగా ఆయనకు సంబంధించిన పాటలు, సన్నివేశాలు పెట్టుకుంటారు. ఇలా ఎన్నో సినిమాల్లో గణేష్ పాటలు సందడి చేశాయి. వీటిలో చాలా వరకు హిట్ చిత్రాలుగా నిలిచాయి.

    ఆ పదకొండు రోజులూ పండుగే

    ఆ పదకొండు రోజులూ పండుగే

    వినాయక చవితి వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త సందడి మొదలవుతుంది. గ్రామాలు, పట్టణాలు, నగరాలు ఇలా ఎక్కడ చూసినా గణేష్ పాటలతో సందడి మొదలవుతుంది. ప్రతి గల్లీలోని ఒక విఘ్నేశ్వరుడు వెలుస్తాడు. ఆ లంబోదరుడి సేవలో నిమగ్నమైపోతారు. గణనాథుడిని ప్రతిష్టించడం దగ్గర నుంచి నిమజ్జనం చేసేంత వరకు చిన్నా పెద్దా చాలా బిజీ అయిపోతారు.

    ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి పాట ఇదే

    ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి పాట ఇదే

    గణేశుడి మండపాల వద్ద మ్యూజిక్ సిస్టమ్స్ పెట్టి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వినాయకుడిపై ఇప్పటికే బోలెడన్ని భక్తి గీతాలు వచ్చాయి. వీటితో పాటు సినిమాల్లోనూ గణేశుడిపై పాటలు స్వరపరుస్తారు. సినిమాల్లో వినాయకుడి పాటలు ఎప్పటి నుంచో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ ‘కూలీ నెం.1' సినిమాలోని ‘దండాలయ్యా ఉండ్రాలయ్యా' పాట ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్‌గ్రీన్ అనే చెప్పాలి.

    ఆ తర్వాత ఎన్నో పాటలు

    ఆ తర్వాత ఎన్నో పాటలు

    మొదటి తరం హీరోల సినిమాల నుంచి ప్రస్తుత తరం వాళ్ల వరకు ఎన్నో సినిమాల్లో గణపతికి సంబంధించిన పాటలు వచ్చాయి. వీటిలో ‘దేవుళ్లు' సినిమాలో ‘వక్రతుండ మహాకాయ', ‘జై చిరంజీవ'లోని ‘జై జై గణేషా', రామ్ నటించిన గణేష్‌లో ‘రాజా మహారాజా', బాలకృష్ణ ‘డిక్టేటర్' సినిమాలోని ‘గంగంగం గణేషా', నాని - నాగార్జున ‘దేవదాస్'లోని ‘లక లక లకుమికరా' సహా ఎన్నో పాటలు తెలుగు సినిమాల్లో వచ్చాయి.

    చాలా వరకు హిట్లే

    చాలా వరకు హిట్లే

    టాలీవుడ్‌లోనే కాదు.. అన్ని భాషల్లో కలిపి ఇప్పటి వరకు చాలా సినిమాల్లో గణపతిపై పాటను వాడుకున్నారు. వీటిలో చాలా వరకు హిట్ చిత్రాలుగా నిలిచిన విషయం తెలిసిందే. అందుకే ఎన్నో ఏళ్లుగా ఆయనపై పాటను రూపొందిస్తూనే ఉన్నారు. అలాగే, చాలా సినిమాల్లో ముఖ్యమైన సన్నివేశాలను కూడా పెట్టుకుంటున్నారు. వీటినే గణేష్ నవరాత్రులు సందర్భంగా వాడుకుంటుండడం విశేషం.

    English summary
    This festival is celebrated with enthusiasm and zeal in Maharashtra and especially in Mumbai. There are a lot of movies with sequences around this festival. Usually, these sequences come along with songs which capture the flavour of this festival to the core.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X