గంగవ్వకు నిరాశను మిగిల్చిన బిగ్‌బాస్.. ఇళ్లు కట్టించే విషయంలో..
బిగ్‌బాస్ రియాలిటీ షోలో గంగవ్వ లాంటి కంటెస్టెంట్‌ను తెరపైకి తీసుకొచ్చి చేసిన ప్రయోగానికి అనూహ్యమైన స్పందన లభించింది. దేశవ్యాప్తంగా పలు భాషల్లోని బిగ్‌బాస్ షోకు ఆమె ఎంపిక స్పూర్తిగా నిలిచింది. సరైన విద్య లేకుండా గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కూలీగా పనిచేసే 50 ఏళ్ల మహిళ బిగ్‌బాస్‌లో రాణించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే..

గంగవ్వ ఎంపిక ఆశ్చర్యకరంగా
కోవిడ్ 19 సమయంలో ప్రారంభమవుతుందా? లేదా? అనే అనుమానాల మధ్య బిగ్‌బాస్ తెలుగు 4 మొదలైంది. అయితే కరోనా పరిస్థితుల కారణంగా పేరున్న నటీనటులు వెనుకంజ వేయడంతో కేవలం యూట్యూబ్ స్టార్లు, ఆ తర్వాత వర్థమాన నటులను కంటెస్టెంట్లుగా ఎంపిక చేశారు. ఇక గంగవ్వ ఎంపిక అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

గంగవ్వ రాణింపుతో బిగ్‌బాస్‌కు ఓపెనింగ్స్
బిగ్‌బాస్ ఆరంభంలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ గంగవ్వ రాణించిన తీరు బిగ్‌బాస్‌కు మంచి ఓపెనింగ్స్ లభించింది. ప్రేక్షకాదరణ లేని కంటెస్టెట్లపై పెదవి విరిచే సమయంలో గంగవ్వ రియాలిటీ షోకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. గంగవ్వ ముక్కుసూటితనం, అమాయకత్వంతో కూడిన మాటలు అందర్నీ ఆకట్టుకొన్నాయి.

అనారోగ్యం సహకరించకపోవడంతో
అయితే గంగవ్వ అనూహ్యరీతిలో రాణిస్తున్న సమయంలో అనారోగ్యం బారిన పడింది. గంగవ్వను ఇంటిలోనే ఉంచి వైద్య సదుపాయాలు అందించారు. అయినా గంగవ్వ ఆరోగ్యం సహకరించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటకు రావడం ఇంటి సభ్యులనే కాకుండా ప్రేక్షకులను కూడా నిరాశపరిచింది.

బిగ్‌బాస్, నాగ్‌కు గంగవ్వ రిక్వెస్ట్
బిగ్‌బాస్ నుంచి గంగవ్వ బయటకు వస్తున్న సమయంలో తన మనసులోని కోరికను బయటపెట్టింది. పెద్దన్న (బిగ్‌బాస్), చిన్నన్న (నాగార్జున) కలిసి నాకు ఇళ్లు కట్టి ఇవ్వండి అంటూ కోరుకొన్నది. అందుకు బిగ్‌బాస్, నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సొంతింటి కల ఆశతో గంగవ్వ తన సొంతూరుకు చేరుకొన్నది. అయితే ఇటీవల మీడియాతో మాట్లాడుతూ బిగ్‌బాస్ అనుమతిస్తే.. దసరా రోజున ఇళ్లు కట్టుకోవడానికి ముగ్గు పోసుకొంటానని చెప్పింది.
Recommended Video

దసరా రోజున ఇంటి కలను ప్రారంభించాలని..
అయితే దసరా రోజున సొంతింటి కలను సాధ్యం చేసుకొందామని ఆశించిన గంగవ్వకు బిగ్‌బాస్ నిర్వాహకుల నుంచి సరైన సహకారం అందలేదు. అందుకు బిగ్‌బాస్‌కు సంబంధించిన కొన్ని నిబంధనలు అడ్డుపడ్డాయని, త్వరలోనే గంగవ్వకు రావాల్సిన మొత్తంతోపాటు ఇంటికి అవసరమైన సొమ్మును జమచేసి స్వయంగా నిర్వాహకులే నిర్మాణ బాద్యతను తీసుకొంటారనే విషయం తెలిసింది. త్వరలోనే గంగవ్వ సొంతింటి కల నిజమవుతుందని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications











