దారుణమైన పరిస్థితులను చూశా.. ధైర్యంగా ఎదురించా.. ఆ కష్టాలు మాటల్లో చెప్పలేను.. గౌతమి

Recommended Video

Actress Gautami Speech @Continental Hospital's Breast Support Group Press Meet

క్యాన్సర్ వ్యాధిపై అవగాహన పరిస్థితులపై సినీ నటి, సామాజిక కార్యకర్త గౌతమి స్పందించారు. ప్రముఖ హాస్పిటల్ నిర్వహించిన క్యాన్సర్ అవగాహన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడిన బాధితుల కోసం కాంటినెంటల్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో బ్రెస్ట్ సపోర్ట్ గ్రూప్‌ను ఆమె ప్రారంభించారు. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు కల్పించాల్సిన అవగాహన, చికిత్స పద్దతులు, చికిత్స సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆమె ఏమన్నారంటే..

 క్యాన్సర్‌ను చూసి భయపడొద్దు

క్యాన్సర్‌ను చూసి భయపడొద్దు

క్యాన్సర్ వ్యాధి బారిన పడిన వారికి భయం పట్టుకుంటుంది. భయం వల్ల ఓడిపోయే విషయంగా మారుతున్నది. క్యాన్సర్ గురించి సరిగా మనకు తెలియకపోవడమే ప్రధాన కారణం. క్యాన్సర్‌ భూతానికి భయపడకూడదు. అలా అని ఆ వ్యాధిని తేలికగా తీసుకోకూడదు అని జాగ్రత్తలు చెప్పారు.

మానసిక స్థైర్యంతోనే జయం

మానసిక స్థైర్యంతోనే జయం

క్యాన్సర్ వ్యాధిని ఎదుర్కోవాలంటే ముందుగా కావాల్సింది మానసిక స్థైర్యం. వ్యాధి బారిన పడిన ప్రతీ ఒక్కరికి 50 శాతం ఔషదాలు పనిచేస్తే మిగితా 50 శాతం మానసిక స్థైర్యంతోనే వ్యాధి నయం అవుతుంది. మనసు, శరీరం పూర్తిస్థాయిలో సహకరించాలి. అప్పుడే క్యాన్సర్‌ నుంచి సులభంగా బయటపడటానికి అవకాశం ఉంటుందని ఆమె చెప్పారు.

దారుణమైన పరిస్థితులు

దారుణమైన పరిస్థితులు

క్యాన్సర్ వ్యాధికి గురైనప్పుడు నేను చాలా దారుణమైన పరిస్థితులను చవిచూశాను. చికిత్స జరిగేటప్పుడు ఒక్కొక్కరికి ఒక రకంగా సైడ్ ఎఫెక్టులు ఎదురవుతుంటాయి. నేను క్యాన్సర్ వ్యాధికి గురైనప్పుడు నా వయసు 35 ఏళ్లు. ఆ సమయంలో అనుభవించిన కష్టాలు మాటల్లో చెప్పలేను అని గౌతమి వెల్లడించారు.

క్యాన్సర్ గురించి తెలిసి భయపడలే

క్యాన్సర్ గురించి తెలిసి భయపడలే

నాకు క్యాన్సర్ వ్యాధి ఉన్నప్పడు నేను అయ్యోయ్యో అని భయపడలేదు. దానిని ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్దమయ్యాను. నాకు వైద్యుల నుంచి మంచి సహకారం అందింది. మా ఇంట్లో నా తల్లిదండ్రులు వైద్యులు కావడం నాకు కొంత బెనిఫిట్ అయింది. జీవితంలో ప్రతీ విషయానికి చక్కటి సొల్యూషన్ ఉంటుందనే విషయాన్ని స్పష్పంగా చెప్పారు.

పూర్తి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ కోసం

ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ కోసం

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X