సింగర్ గీతా మాధురి ప్రెగ్నెంట్, శ్రీమంతం ఫోటోస్ వైరల్!

Recommended Video

Geetha Madhuri Baby Shower Pics Goes Viral || Filmibeat Telugu

తెలుగులో సింగర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గీతా మాధురి... గతేడాది 'బిగ్ బాస్ తెలుగు 2' రియాల్టీ షోలో ఎంట్రీ ఇవ్వడం ద్వారా మరింత పాపులర్ అయ్యారు. ప్రస్తుతం గీతా మాధురికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

యాక్టర్ నందును ప్రేమ వివాహం చేసుకున్న గీతా మాధురి... త్వరలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె గర్భవతిగా ఉందని, ఇటీవల శ్రీమంతం ఫంక్షన్ జరిగిందంటూ సోషల్ మీడియాలో ఫోటోస్ హల్ చల్ చేస్తున్నాయి.

ఈ న్యూస్ ఎలా బయటకు వచ్చిందంటే..?

ఈ న్యూస్ ఎలా బయటకు వచ్చిందంటే..?

అయితే తాను గర్భం దాల్చినట్లుకానీ, శ్రీమంత ఫంక్షన్ జరిగినట్లు కానీ గీతా మాధురి, నందు నుంచి ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు. అయితే ఆమె ఫ్రెండ్ ఒకరు ఇందుకు సంబంధించిన వీడియో షేర్ చేస్తూ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి అంటూ కామెంట్ పోస్ట్ చేసింది. దీంతో గీతా మాధురి ప్రెగ్రెంట్ న్యూస్ లీక్ అయినట్లు తెలుస్తోంది.

గీతా మాధురి-నందు

గీతా మాధురి-నందు

గీతా మాధురి-నందు వివాహం ఫిబ్రవరి 9, 2014లో జరిగింది. ఇద్దరూ సినీ రంగానికి చెందిన వారే కావడంతో పెళ్లికి ముందు నుంచే వీరి మధ్య పరిచయం ఉంది. ఈ క్రమంలోనే వారి స్నేహం ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన ఐదేళ్ల గ్యాప్ తర్వాత ఈ దంపతులు పిల్లలను ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

చిన్నతనం నుంచే సంగీతంపై ఆసక్తి

చిన్నతనం నుంచే సంగీతంపై ఆసక్తి

గీతా మాధురి చిన్నతనంలోనే అద్భుతంగా పాటలు పాడేది. సంగీతంపై ఆమెకు ఉన్న ఇంట్రెస్ట్ గమనించిన తల్లిదండ్రులు క్లాసికల్, లైట్ మ్యూజిక్‌లో శిక్షణ ఇప్పించారు. ఈటీవీలో ప్రసారం అయ్యే ‘సై' అనే మ్యూజిక్ షోలో సెమి పైనలిస్టుగా నిలిచింది.

ప్రేమలేఖ రాశా సినిమాతో...

ప్రేమలేఖ రాశా సినిమాతో...

2009లో వచ్చిన ‘ప్రేమలేఖ రాశా' సినిమాతో గీతా మాధురి సింగర్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తన పదేళ్ల కెరీర్లో ఇప్పటి వరకు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో దాదాపు 550 పాటలు పాడారు. పలు చిత్రాల్లో ఆమె పాడిప పాటలకు అవార్డులు దక్కాయి.

బిగ్ బాస్ తెలుగు 2 షో రన్నరప్

బిగ్ బాస్ తెలుగు 2 షో రన్నరప్

గతేడాది నాని హోస్ట్‌గా ప్రసారమైన ‘బిగ్ బాస్ తెలుగు 2' రియాల్టీ షోలో కంటెస్టెంటుగా ఎంట్రీ ఇచ్చిన ఆమె చివరి వరకు కొనసాగడంతో పాటు ఆడియన్స్ సపోర్టుతో రన్నరప్‌గా నిలిచారు. ఈ షో ద్వారా తాను ఎంతో స్ట్రాంగ్ అండ్ డిటర్మైన్డ్ పర్సన్ అని నిరూపించుకున్నారు. ఈ షో ద్వారా ఆమెకు అభిమానులు మరింత పెరిగారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X