తల్లి అయిన గీతామాధురి.. పండంటి సంతానం.. నెట్టింట వైరల్ పిక్
సింగర్ గీతామాధురి.. ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. క్లాస్, మాస్ ఆడియన్స్ అంతా గీతామాధురి అనగానే చటుక్కున గుర్తు పట్టేస్తారు. తెర వెనుక నుండే కేవలం గొంతుతో భారీ క్రేజ్ సంపాదించింది గీత. తనదైన శైలిలో పాటలు పాడుతూ.. తెలుగు చిత్ర సీమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కాగా తాజాగా గీతామాధురికి పండంటి సంతానం కలిగిందనే విషయం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఆమె భర్త నందు పోస్ట్ పెట్టాడు. వివరాల్లోకి పోతే..

నందుతో ప్రేమ వివాహం
గీతామాధురి, యాక్టర్ నందు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్దరి మ్యారేజ్ ఫిబ్రవరి 9వ తేదీ 2014 సంవత్సరంలో జరిగింది. తాను ప్రేమించిన నటుడు నందును పెళ్లి చేఉకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేసింది గీతా మాధురి. నందుకు నటుడిగా సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు ఉంది.

సీక్రెట్‌గా సీమంతం.. అలా బయటకు
ఇటీవలే గర్భం దాల్చిన గీతామాధురి ఆ విషయాన్ని సీక్రెట్ గానే ఉంచింది. గీతామాధురి గర్భవతి అనే విషయాన్ని ఆమె గానీ, ఆమె భర్త గానీ వెల్లడించలేదు. కాకపోతే ఎలాగోలా ఆమె సీమంతానికి సంబందించి కొన్ని పిక్స్ బయటకు రావడంతో గీతామాధురి గర్భవతి అని అందరికీ తెలిసిపోయింది. కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో ఘనంగా గీతామాధురి సీమంతం వేడుక జరిగింది. హిందూ ఆచార సంప్రదాయాలతో సాగిన ఈ వేడుక అప్పట్లో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే.
గీతామాధురి ఇంట పండంటి ఆడబిడ్డ
కాగా ఆగస్టు 9 వ తేదీన గీతా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె భర్త నందు సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ తల్లీ, బిడ్డ.. ఇద్దరూ ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారని తెలిపాడు. ఈ సందర్బంగా అందరికీ ధన్యవాదాలు అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తమ ఫ్యామిలీ ఫొటో అభిమానులతో పంచుకున్నాడు నందు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

గీతామాధురి కెరీర్
గీతామాధురి పదేళ్ల కెరీర్లో ఇప్పటి వరకు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో దాదాపు 550 పాటలు పాడింది. పలుచిత్రాల్లో ఆమె పాడిన పాటలకు అవార్డులు కూడా దక్కాయి. ఇక గతేడాది 'బిగ్ బాస్ 2' రియాల్టీ షో ద్వారా తెరపై ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీ సంపాదించింది గీతా మాధురి.


Click it and Unblock the Notifications











