twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలా చేస్తూ కిందపడబోయిన జెనీలియా.. కాపాడిన ఇస్మార్ట్ హీరో.. క్రేజీ వీడియో

    |

    ఇస్మార్ట్ హీరో రామ్ సోషల్ మీడియాలో ఎంత సందడి చేస్తాడో అందరికీ తెలిసిందే. ఎక్కువ యాక్టివ్‌గా ఉండకపోయినా రామ్ మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంటాడు. సినిమా అప్డేట్లు, పర్సనల్ విషయాలు, సమాజంలో జరిగే అన్యాయాలపైనా స్పందిస్తుంటాడు. ఇక రామ్ ప్రస్తుతం జెనీలియాతో కలిసి చేసిన అల్లరి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మళ్లీ నాటి రోజులను అందరికీ గుర్తు చేసిందీ జంట.

    రామ్ జెనీలియా అలా..

    రామ్ జెనీలియా అలా..

    రామ్ జెనీలియా కలిసి నటించిన రెడీ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. రామ్ జెనీలియా కెమిస్ట్రీ, కామెడీ ఇలా అన్నీ చక్కగా కుదరడంతో సినిమా రికార్డులను క్రియేట్ చేసింది. అలా నాటి నుంచి నేటి వరకు ఈ ఇద్దరూ మంచి స్నేహితుల్లా ఉన్నారు.

    ఫ్యామిలీ ఫ్రెండ్..

    ఫ్యామిలీ ఫ్రెండ్..

    జెనీలియా రితేష్ దేశ్‌ముఖ్ వివాహానంతరం రామ్ ఫ్యామిలీ ఫ్రెండ్‌లా మారిపోయాడు. ముంబైలో రామ్ అడుగుపెట్టాడంటే జెనీలియా ఇంట్లో సందడి చేయాల్సిందేనట్టుగా మారింది. ఆ మధ్య జెనీలియా ఇంట్లో రామ్ చేసిన అల్లరికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.

     తాజాగా ఇలా..

    తాజాగా ఇలా..

    అయితే తాజాగా జెనీలియా మొదటిసారిగా ఇన్ స్టాగ్రాం రీల్ వీడియోను చేసింది. ఇందులో జెనీలియా, రామ్ సందడి చేశారు. రెడీ సినిమాలోని అయ్యో అయ్యో దానయ్య అనే పాటకు స్టెప్పులు వేశారు. స్టెప్పులు వేస్తూ జెనీలియా జారి పడబోయింది.

    పట్టుకున్న రామ్..

    జెనీలియా చేతికి గాయమైనట్టు కనిపిస్తోంది. చేతికి పట్టి కట్టుకుని కనిపిస్తోంది. అయితే ఈ క్రమంలో డ్యాన్స్ చేస్తూ జెనీలియా కాలి జారింది. సడెన్‌గా పడిపోబోతోన్న జెనీలియాను రామ్ పట్టుకున్నాడు. మొదటి సారిగా రీల్ వీడియోను చేస్తున్నాను అని చెప్పుకొచ్చింది.

    రామ్ అలా..

    రామ్ అలా..

    రామ్ ప్రస్తుతం లింగుసామీ దర్శకత్వంలో ఓ మూవీని ఓకే చేశాడు. ద్విభాష చిత్రంగా రాబోతోన్న ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్‌గా ఎంపికైంది. చివరగా రామ్ రెడ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. సంక్రాంతి బరిలో దిగిన రామ్ విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

    English summary
    Genelia And Ram Pothineni Instagram Reel Video.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X