జెనీలియా బర్త్ డే : ఫ్యామిలీతో రామ్ స్పెషల్ పిక్
జెనీలియా అంటే తెలుగు ప్రేక్షకులందరికీ నవ్వుల హాసిని గుర్తుకు వస్తుంది. బొమ్మరిల్లు చిత్రంతో హాసినిగా టాలీవుడ్‌లో చిరస్థాయిగా గుర్తుండిపోతుంది. ఆమె కెరీర్‌లో ఢీ, రెడీ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా ఉన్నాయి. తెలుగులో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న సమయంలోనే బాలీవుడ్‌కు చెక్కేసింది. అక్కడ రితేష్ దేశ్‌ముఖ్‌తో ప్రేమలో పడిపోయి పెళ్లి పీఠలు ఎక్కేసింది. అయితే ఇక్కడి హీరోలతో ఉన్న స్నేహబంధాన్ని మాత్రం వీడలేదు.
రెడీ చిత్రానికి పన్నెండేళ్లు గడిచిన సందర్భంలో జెనీలియా, రామ్ చేసిన ట్వీట్లు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అంతే కాకుండా ఢీ విడుదలై 13 ఏళ్లైన సందర్భంలో మంచు విష్ణుపై చేసిన ట్వీట్ చూస్తే మనోళ్లను ఇంకా మరిచిపోలేదని తెలుస్తోంది. పైగా రామ్ జెనీలియా కుటుంబంతోనూ ఎక్కువ క్లోజ్‌గా ఉంటాడు. తాజాగా జెనీలియా బర్త్ డే సంద్భంగా రామ్ చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.

జెనీలియాకు బర్త్ డే విషెస్ చెబుతూ ఆమె ఫ్యామిలీతో దిగిన ఫోటోను షేర్ చేశాడు. 'అస్సలు స్వార్థంలేని, ఎంతో జాగ్రత్తగా చూసుకునే స్నేహితురాలికి పుట్టినరోజు శుభాకాంక్షలు. జెనూ ఈ ఏడాదంతా నీకు బాగుండాలి. మళ్లీ మనమంతా కలిసి ఎంజాయ్ చేయాల'ని కోరుకున్నాడు.

దీనికి జెనీలియా స్పందిస్తూ.. నువ్ ఎప్పుడూ నాకు ఫేవరేట్ అని నీకు తెలుసా? థ్యాంక్యూ సో మచ్ రామ్ అని ట్వీట్ చేసింది. ఇక భార్య బర్త్ డే సందర్భంగా తన ప్రేమను ట్వీట్ రూపంలో తెలియజేశాడు రితేష్. వీరిద్దిరి ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











