Ram Charan: చిరుత మూవీకి 50 లక్షలు.. ఇప్పుడు అన్ని కోట్లు.. ఏంటి రామ్ చరణ్ ఆస్తి అన్ని వందల కోట్లా!
మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా సినీ రంగ ప్రవేశం చేసినా.. ఆరంభంలోనే తనదైన టాలెంట్లతో సత్తా చాటి స్టార్ హీరోగా ఎదిగిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మధ్యలో కొన్ని చిత్రాలు నిరాశ పరిచినా.. ఇటీవలి కాలంలో మాత్రం వరుసగా హిట్లు కొడుతూ తన రేంజ్‌ను పెంచుకున్నాడు. తద్వారా గ్లోబల్ స్టార్ అయిపోయాడు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రామ్ చరణ్ సినిమాలు, యాడ్స్, ప్రొడక్షన్, బిజినెస్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలో నేడు అతడి పుట్టినరోజు సందర్భంగా చరణ్ నికర విలువ, ఆస్తుల గురించి తెలుసుకుందాం పదండి!
ఇప్పుడా సినిమాలతో బిజీ:మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇప్పటికే ఎస్ శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' అనే సినిమాను చేస్తోన్న అతడు.. బుచ్చిబాబు సనతోనూ ఓ మూవీ ప్రకటించాడు. ఇటీవలే ఇది పూజా కార్యక్రమాలు జరుపుకుంది. దీని తర్వాత రామ్ చరణ్.. సుకుమార్ దర్శకత్వంలోనూ మరో సినిమాను అనౌన్స్ చేశాడు.

50 లక్షల నుంచి కోట్లకు:రామ్ చరణ్ తన మొదటి చిత్రం 'చిరుత' కోసం రూ. 50 లక్షలు మాత్రమే రెమ్యూనరేషన్‌గా తీసుకున్నాడు. అయితే, ఆ తర్వాత స్టార్‌గా ఎదిగిన అతడు.. దాన్ని క్రమంగా పెంచుకుంటూ వెళ్లాడు. ఇలా ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా మారిన రామ్ చరణ్ ఒక్కో సినిమాకు రూ. 100 కోట్లు చార్జ్ చేస్తున్నాడు. 'గేమ్ చేంజర్' నుంచే అతడి ఈ మైలురాయిని అందుకున్నాడు.
యాడ్స్ కోసం భారీగానే:దాదాపు దశాబ్దా కాలంగా వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఈ మధ్య కాలంలో వ్యాపార ప్రకటనల్లో కూడా ఉత్సాహంగా నటిస్తున్నాడు. ఇలా అతడు ఒక్కో యాడ్‌కు 3 - 4 కోట్ల రూపాయలు చార్జ్ చేస్తున్నట్లు తెలిసింది. మొత్తంగా తన కెరీర్‌లో రామ్ చరణ్ ఏకంగా 35కు పైగా యాడ్స్‌లో నటించినట్లు తెలిసింది.

రామ్ చరణ్ ఆస్తులిలా:గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తులు కాకుండా సొంతంగా కూడగట్టుకున్నవి చాలానే ఉన్నాయి. ఇలా ప్రస్తుతం అతడికి రూ. 1459 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు తెలిసింది. తద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కువ ఆస్తులు ఉన్న హీరోల జాబితాలో చరణ్ నాలుగో స్థానానికి చేరాడట. అతడికంటే ముందు చిరు, నాగ్, వెంకటేష్ ఉన్నారని సమాచారం.
ఇళ్లకు కూడా భారీగానే:మెగాస్టార్ చిరంజీవి కుమారుడైన రామ్ చరణ్‌కు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఓ విలాసవంతమైన ఇల్లు ఉంది. దీని విలువ రూ. 100 కోట్లు వరకూ ఉంటుందని తెలిసింది. అలాగే, చెన్నై, ముంబైలో కూడా రామ్ చరణ్ పేరిట రెండు ఇళ్లు ఉన్నాయట. వీటి విలువ దాదాపు రూ. 70 కోట్లు వరకూ ఉంటుందని అంటున్నారు. వీటితో పాటు వ్యవసాయ భూమి కూడా ఉందని టాక్.

కార్లు, యాక్ససిరీస్‌లు:గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు కార్లు అంటే చాలా ఇష్టం. అందుకే కొత్తగా వచ్చే మోడళ్లను అతడు కొంటుంటాడు. ఇలా ఇప్పుడు అతడి గ్యారేజ్‌లో రూ. 10 కోట్లు విలువైన కార్లు ఉన్నాయని తెలిసింది. అలాగే, మిగిలిన యాక్ససిరీస్‌ల విలువ రూ. 10 కోట్లు వరకూ ఉంటుందట. ఇందులో అతడు పెట్టుకునే వాచ్‌లకే ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తుంటాడనే టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











