2022 Top Movies: టాప్ మూవీస్‌లో రెండు తెలుగు చిత్రాలు.. పదిలో ఐదు సౌత్ మూవీలు.. RRR స్థానం ఎంతంటే!

కరోనా మహమ్మారి ఇబ్బంది పెట్టిన కారణంగా గత రెండు సంవత్సరాలు పెద్దగా సినిమాలు విడుదల కాలేదు. కానీ, ఈ ఏడాది కొంచెం ఎక్కువగా చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. మరీ ముఖ్యంగా మన తెలుగు చిత్రాలతో పాటు సౌతిండియా మూవీలు కూడా దేశ వ్యాప్తంగా హవాను చూపించాయి. తద్వారా ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాయి. అలాగే, కొన్ని బాలీవుడ్ సినిమాలు కూడా ఓ రేంజ్‌లో హైలైట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో 2022లో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన చిత్రాల జాబితాను తాజాగా సదరు సంస్థ విడుదల చేసింది. వాటిని మీరే చూసేయండి!

టాప్ మూవీగా విజువల్ వండర్

టాప్ మూవీగా విజువల్ వండర్

2022 ముగింపు దశకు చేరడంతో ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా వెతికిన చిత్రాల జాబితా తాజాగా విడుదలైంది. దేశ వ్యాప్తంగా ఉన్న సినిమాల జాబితాలో మొదటి స్థానంలో 'బ్రహ్మాస్త్ర' నిలిచింది. రణ్‌బీర్ కపూర్ - అయాన్ ముఖర్జీ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో ఆలియా, నాగార్జున, అమితాబ్, మౌనీ రాయ్‌లు నటించారు.

రెండవ స్థానం రాఖీ సొంతమే

రెండవ స్థానం రాఖీ సొంతమే


ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ నటించిన చిత్రమే 'కేజీఎఫ్ చాప్టర్ 2'. మొదటి భాగం సూపర్ హిట్ అవడంతో దీన్ని మరింత హై రేంజ్‌లో రూపొందించారు. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ చిత్రం దాదాపు రూ. 1200 కోట్లు వసూలు చేసింది. తద్వారా అందరి దృష్టిలో పడింది. ఫలితంగా గూగుల్ టాప్ సెర్చ్ మూవీస్‌లో ఇది రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది.

3వ ప్లేసులో కాంట్రవర్శీ మూవీ

3వ ప్లేసులో కాంట్రవర్శీ మూవీ

2022లో దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోయిన చిత్రాల్లో 'ది కాశ్మీరీ ఫైల్స్' ఒకటి. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో కాశ్మీరి పండిట్‌ల ఊచకోతకు సంబంధించిన కథతో ఈ సినిమా తెరకెక్కింది. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి లాంటి ఎంతో మంది స్టార్లు ఇందులో నటించారు. నేషనల్ రేంజ్‌లో సెన్సేషన్ అయిన ఈ చిత్రం గూగుల్ టాప్ మూవీస్‌లో 3వ స్థానంలో నిలిచింది.

మన RRRకు నాలుగో స్థానమే

మన RRRకు నాలుగో స్థానమే


దర్శకధీరుడు రాజమౌళి రూపకల్పనలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన సినిమానే RRR (రౌద్రం రణం రుధిరం). ఎన్నో అంచనాలతో వచ్చి దాదాపు రూ. 1200 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా హవాను చూపించింది. ఫలితంగా ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువ మంది వెతికిన చిత్రాల జాబితాలో ఇది నాలుగో స్థానాన్ని దక్కించుకుంది.

సెన్సేషనల్ కాంతార ఐదులో

సెన్సేషనల్ కాంతార ఐదులో

కన్నడ చిత్ర పరిశ్రమలో తెరకెక్కి ఇండియా మొత్తం మోత మోగించిన చిత్రమే 'కాంతార'. రిషబ్ శెట్టి నటించి, తెరకెక్కించిన ఈ మూవీ గ్రామ దేవతల కాన్సెప్టుతో వచ్చింది. ఇది దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి రూ. 400 కోట్లకు పైగా గ్రాస్‌ను రాబట్టింది. దీంతో ఈ చిత్రంపై అంతా ఫోకస్ చేశారు. ఫలితంగా ఇది గూగుల్ లిస్టులో ఏకంగా ఐదో స్థానాన్ని అందుకుంది.

ఆరులో మరో తెలుగు సినిమా

ఆరులో మరో తెలుగు సినిమా


గూగుల్‌లో 2022లో అత్యధికంగా వెతికిన చిత్రాల జాబితాలో ఇప్పటి వరకూ చెప్పిన, చెప్పుకోబోయే చిత్రాలన్నీ ఈ ఏడాదే విడుదల అయ్యాయి. అయితే, ఒక్క సినిమా మాత్రమే గత ఏడాది వచ్చినా ఈ లిస్టులో చోటు దక్కించుకుంది. అదే అల్లు అర్జున్ నటించిన 'పుష్ప'. పాన్ ఇండియా రేంజ్‌లో 350 కోట్లు రాబట్టిన ఈ మూవీ ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది.

మిగిలిన స్థానాల్లో ఈ చిత్రాలు

మిగిలిన స్థానాల్లో ఈ చిత్రాలు

పైన పేర్కొన్న సినిమాలతో పాటు మరో నాలుగు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అందులో విశ్వనాయకుడు కమల్ హాసన్ నటించిన 'విక్రమ్' ఏడో స్థానంలో, అమీర్ ఖాన్, చైతూ నటించిన 'లాల్ సింగ్ చడ్డా' ఎనిమిదో స్థానంలో, అజయ్ దేవగణ్ నటించిన 'దృశ్యం' తొమ్మిదో స్థానంలో, హాలీవుడ్ మూవీ 'థోర్: లవ్ అండ్ థండర్' పదో స్థానంలో నిలిచాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X