2022 Disaster Movie: ఈ ఏడాది డిజాస్టర్ మూవీస్.. చిరంజీవి, విజయ్‌కు షాక్.. సుధీర్ సినిమాకు దారుణంగా!

గత రెండు మూడు సంవత్సరాల్లో కరోనా కారణంగా చాలా తక్కువ సినిమాలే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ, ఈ ఏడాది మాత్రం అలాంటి ఇబ్బంది లేకపోవడంతో ఆశించిన దానికంటే ఎక్కువ మూవీలే విడుదల అయ్యాయి. అయితే, అందులో మాత్రం చాలా అంటే చాలా తక్కువ సినిమాలే ఆడియెన్స్ మనసులు దోచుకుని భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. మరికొన్ని మాత్రం ఆశించిన స్థాయిలో ఆడకుండా డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో 2022లో IMDBలో అత్యల్ప రేటింగ్ పొందిన సినిమాల గురించి తెలుసుకుందాం పదండి!

IMDB రేటింగ్స్ ప్రత్యేకంగా

IMDB రేటింగ్స్ ప్రత్యేకంగా

IMDB సంస్థ వినోద రంగానికి సంబంధించి రేటింగ్‌లు, ర్యాంకులు ఇస్తుంటుందన్న విషయం తెలిసిందే. వీళ్లు ఇచ్చే రేటింగ్ ఆధారంగానే సినిమాల ఫలితాలు డిసైడ్ అవుతుంటాయి. అంతలా ఈ సంస్థ తీర్పునకు ప్రధాన్యత ఉంటుంది. ఇక, తాజాగా 2022 సంవత్సరానికి గానూ తక్కువ రేటింగ్ పొందిన కొన్ని తెలుగు సినిమాల జాబితాను IMDB సంస్థ తాజాగా విడుదల చేసింది.

వారియర్‌కు షాకింగ్ రేటింగ్

వారియర్‌కు షాకింగ్ రేటింగ్


ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా లింగుసామీ తెరకెక్కించిన చిత్రమే 'ది వారియర్'. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో దీనికి నష్టాలు కూడా ఎదరయ్యాయి. ఇక, ఈ చిత్రానికి IMDB సంస్థ 10కి కేవలం 4.7 రేటింగ్ మాత్రమే ఇచ్చింది. ఫలితంగా ఇది ఈ ఏడాది తక్కువ రేటింగ్ చిత్రాల్లో 8వ స్థానంలో నిలిచింది.

స్టార్ వారసులకు ఒకే రేటింగ్

స్టార్ వారసులకు ఒకే రేటింగ్

పూరీ ఆకాశ్ ఈ ఏడాది 'చోర్ బజార్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి IMDB సంస్థ 10కి కేవలం 4.6 రేటింగ్ మాత్రమే ఇచ్చింది. అలాగే, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన 'గని' మూవీ కూడా ఎన్నో అంచనాలతో వచ్చి పరాజయం పాలైంది. దీనికి కూడా 4.6 రేటింగ్ మాత్రమే వచ్చింది. దీంతో ఈ రెండు చిత్రాలు జంటగా 7వ స్థానంలో ఉన్నాయి.

నితిన్, గోపీచంద్‌కూ తక్కువే

నితిన్, గోపీచంద్‌కూ తక్కువే

యూత్ స్టార్ నితిన్ తన పంథాను మార్చుకుని 'మాచర్ల నియోజకవర్గం' అనే యాక్షన్ మూవీ చేశాడు. దీనికి IMDB సంస్థ 10కి కేవలం 4.5 రేటింగ్‌ను మాత్రమే ఇచ్చింది. అలాగే, గోపీచంద్ నటించిన 'పక్కా కమర్షియల్' మూవీకి అయితే కేవలం 4.2 రేటింగ్ మాత్రమే ఇచ్చింది. దీంతో ఈ రెండు సినిమాలు తక్కువ రేటింగ్ సాధించిన లిస్టులో 6, 5వ స్థానంలో నిలిచాయి.

ఆచార్య సినిమాకు బిగ్ షాక్

ఆచార్య సినిమాకు బిగ్ షాక్

మెగాస్టార్ చిరంజీవి - రామ్ చరణ్ కాంబినేషన్‌లో కొరటాల శివ రూపొందించిన చిత్రం 'ఆచార్య'. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల మద్దతు లభించలేదు. ఫలితంగా ఇది చాలా తక్కువ కలెక్షన్లను మాత్రమే రాబట్టింది. దీంతో ఎక్కువ నష్టాలతో డిజాస్టర్ అయింది. దీనికి IMDB సంస్థ 10కి కేవలం 3.8 రేటింగ్ ఇచ్చింది. దీంతో ఇది 4వ స్థానానికి చేరుకుంది.

దేవరకొండ బ్రదర్‌కు దెబ్బ

దేవరకొండ బ్రదర్‌కు దెబ్బ

ఆనంద్ దేవరకొండ నటించిన సినిమా 'హైవే'. దీనికి IMDB సంస్థ 10కి కేవలం 3.7 రేటింగ్ ఇచ్చింది. అలాగే, టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటించిన సినిమా 'లైగర్'. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ చిత్రం ఎక్కువ నష్టాలతో డిజాస్టర్‌గా మిగిలిపోయింది. దీనికి IMDB సంస్థ 10కి కేవలం 3 రేటింగ్ మాత్రమే ఇచ్చింది. దీంతో ఇవి 3, 2 స్థానాల్లో ఉన్నాయి.

సుధీర్ సినిమాకు దారుణంగా

సుధీర్ సినిమాకు దారుణంగా

సునీల్‌, అనసూయ, సుడిగాలి సుధీర్‌, విష్ణుప్రియ, దీపికా పిల్లి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'వాంటెడ్‌ పండుగాడ్‌'. శ్రీధర్‌ సీపాన తెరకెక్కించిన ఈ మూవీని కే రాఘవేంద్రరావు సమర్పణలో తీసుకొచ్చారు. దీనికి IMDB సంస్థ 10కి కేవలం 2.4 రేటింగ్ ఇచ్చింది. దీంతో ఈ ఏడాది తక్కువ రేటింగ్ పొందిన చిత్రాల్లో ఇది టాప్ ప్లేస్‌లో నిలిచి పరాభవం మూటగట్టుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X