Year End 2023: భారీ హిట్ మూవీలు ఇవే.. బాలయ్య దిమ్మతిరిగే రికార్డు.. కానీ చిరంజీవిదే టాప్ ప్లేస్
తెలుగు చిత్ర పరిశ్రమలో 2023లో దాదాపు వందకు పైగానే సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు వచ్చాయి. అందులో భారీ బడ్జెట్‌తో రూపొందిన సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ, వాటిలో కొన్నంటే కొన్ని మాత్రమే భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. అందులో నందమూరి బాలకృష్ణ సెన్సేషనల్ రికార్డును ఖాతాలో వేసుకున్నారు. కానీ, ఇందులో చిరంజీవి మాత్రమే టాప్ ప్లేస్‌ను అందుకున్నారు. అసలు ఈ ఏడాది ఏ సినిమాలు భారీ హిట్లను అందుకున్నాయో ఓ లుక్కేద్దాం పదండి!
చిరంజీవిదే టాప్ ప్లేస్:మెగాస్టార్ చిరంజీవి, రవితేజ హీరోలుగా బాబీ తెరకెక్కించిన చిత్రమే 'వాల్తేరు వీరయ్య'. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫుల్ రన్‌లో అన్ని ఏరియాల్లో కలిపి రూ. 137.85 కోట్లు రాబట్టింది. తద్వారా ఏకంగా రూ. 48.85 కోట్ల లాభాలను అందుకుంది. తద్వారా చిరు కెరీర్‌లోనూ ఈ ఏడాదిలోనూ అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా నిలిచింది.

బాలయ్య కూడా భారీగా:నటసింహా బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని రూపొందించిన మాస్ మూవీనే 'వీర సింహా రెడ్డి'. ఇది కూడా సంక్రాంతి కానుకగానే ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమాకు మంచి స్పందన దక్కింది. ఫలితంగా రూ. 74 కోట్ల టార్గెట్‌తో వచ్చిన ఈ చిత్రం రూ. 80 కోట్లు వసూలు చేసింది. తద్వారా రూ. 6 కోట్లు లాభాలను సొంతం చేసుకుంది.
సాయితేజ్ కమ్‌బ్యాక్:2023లో భారీ విజయాన్ని అందుకున్న మోస్తరు బడ్జెట్ చిత్రాల్లో 'విరూపాక్ష' ఒకటి. ఈ చిత్రంతో సాయి ధరమ్ తేజ్ అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చాడు. చేతబడుల నేపథ్యంతో విభిన్నమైన స్టోరీతో రూపొందిన ఈ సినిమాకు ఫుల్ రన్‌లో ఏకంగా రూ. 47.60 కోట్లు వసూళ్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 24.60 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి.

సార్ కూడా కుమ్మాడు:కోలీవుడ్ స్టార్ హీరో ధనూష్ నటించిన చిత్రమే 'సార్' (తమిళంలో వాతి). వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ మూవీ తమిళంలో కంటే తెలుగులోనే బిగ్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా ఈ చిత్రం మొత్తంగా తెలుగులో రూ. 24.00 కోట్లు షేర్‌ను వసూలు చేసింది. తద్వారా హిట్ స్టేటస్‌తో పాటు రూ. 17.30 కోట్లు లాభాలతో రికార్డును కూడా సాధించింది.
నాని దసరా సక్సెస్:టాలెంటెడ్ గాయ్ నాని హీరోగా.. శ్రీకాంత్ ఓదెల రూపొందించిన మాస్ మసాలా మూవీనే 'దసరా'. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు భారీ స్థాయిలో రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ సినిమాకు రూ. 64.04 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు నిర్మాతలకు రూ. 15.04 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి.

పోలిశెట్టి దంచాడు:అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి జంటగా చేసిన యూత్‌ఫుల్ మూవీనే 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగానూ భారీ స్పందనే వచ్చింది. ఫలితంగా ఈ చిత్రానికి వరల్డ్ వైడ్‌గా రూ. 24 కోట్లు వరకూ వసూలు చేసింది. దీంతో ఈ సినిమా హిట్ స్టేటస్‌తో పాటు రూ. 10 కోట్లు వరకూ లాభాలను కూడా ఖాతాలో వేసుకుంది.
బాలయ్యదే రికార్డు:ఈ ఏడాది బాలయ్య నటించిన మరో సినిమా కూడా విడుదలైంది. అదే 'భగవంత్ కేసరి'. ఈ మూవీకి ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో దీనికి మంచి రెస్పాన్స్ కూడా లభించింది. దీంతో ఇది రూ. 70 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేసి లాభాలను అందుకుంది. ఇక, ఈ చిత్రంతో ఈ ఏడాది రెండు హిట్లను అందుకున్న హీరోగా బాలయ్య రికార్డు సాధించారు.


Click it and Unblock the Notifications











