Year Ender 2023: ఒక్క రోజే వంద కోట్లు.. అందులో అదొక్కటే డిజాస్టర్.. ప్రభాస్‌తో పాటు ఆ హీరోనే తోపే!

ప్రతి ఏడాది లాగే 2023లో కూడా ఇండియాలోని అన్ని ఇండస్ట్రీలకు చెందిన హీరోలు భారీ బడ్జెట్ చిత్రాలను చేశారు. అలా ఈ సంవత్సరం చాలా బిగ్ మూవీలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే, అందులో కొన్ని మాత్రమే ఆరంభం నుంచీ అంచనాలను ఏర్పరచుకున్నాయి. అంతేకాదు, వాటిలోనూ పలు చిత్రాలే హైప్‌కు తగ్గట్లుగా రాణించి భారీ స్థాయిలో ఓపెనింగ్స్ దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో 2023వ సంవత్సరంలో మొదటి రోజే వంద కోట్లు గ్రాస్‌ను వసూలు చేసిన సినిమాలపై ఓ లుక్కేద్దాం పదండి!

షారూక్ కమ్‌బ్యాక్‌ మూవీ:బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటించిన తాజా సినిమానే 'పఠాన్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదటి నుంచీ అంచనాలను ఏర్పరచుకుంది. అందుకు తగ్గట్లుగానే ఫస్ట్ డేనే మంచి టాక్ తెచ్చుకుని మొదటి రోజు రూ. 106 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. ఆ తర్వాత 1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి షారూక్‌కు అదిరిపోయే కమ్‌బ్యాక్‌ను ఇచ్చింది.

Goodbye 2023: Indian Movies Which Collected More Than Rs 100 Crore on Day 1

ప్రభాస్ డిజాస్టర్ కూడా:2023వ సంవత్సరానికి గానూ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఓపెనింగ్ డేనే రూ. 100 కోట్లు వసూలు చేసిన సినిమాల్లో ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' కూడా చోటు దక్కించుకుంది. ఈ మూవీకి టాక్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా స్పందన వచ్చింది. ఫలితంగా ఇది మొదటి రోజు రూ. 137 కోట్లు గ్రాస్ రాబట్టింది. కానీ, ఆ తర్వాత నిరాశ పరుస్తూ డిజాస్టర్‌గా మిగిలిపోయింది.

మరోసారి షారూక్ 100:బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ హీరోగా అట్లీ తెరకెక్కించిన యాక్షన్ సినిమానే 'జవాన్'. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాపైన కూడా ఏ రేంజ్‌లో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ మూవీకి మంచి టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రం కూడా మొదటి రోజే రూ. 129 కోట్ల కంటే ఎక్కువ రాబట్టింది. తద్వారా వంద కోట్ల ఓపెనింగ్ చిత్రంగా నిలిచింది.

Goodbye 2023: Indian Movies Which Collected More Than Rs 100 Crore on Day 1

లియోతో విజయ్ కోత:2023లో ఎన్నో సినిమాల పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల అయ్యాయి. కానీ, దక్షిణాదిలోనే వచ్చినా భారీ ఓపెనింగ్స్ సాధించి టాప్‌ ప్లేస్‌లో నిలిచిన చిత్రమే 'లియో'. ఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏకంగా మొదటి రోజు రూ. 146.15 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. తద్వారా ఈ ఏడాది టాప్ గ్రాసింగ్ ఫిల్మ్‌గా రికార్డు కొట్టింది.

Goodbye 2023: Indian Movies Which Collected More Than Rs 100 Crore on Day 1

యానిమల్‌తో మరోటి:2023వ సంవత్సరానికి గానూ విడుదలై ఓపెనింగ్ డేన 100 కోట్ల రూపాయలు, అంతకంటే ఎక్కువ గ్రాస్ సాధించిన సినిమాల్లో 'యానిమల్' కూడా నిలిచింది. రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ సినిమాకు మొదటి రోజు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ చిత్రం రూ. 116 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఆ తర్వాత కూడా భారీ వసూళ్లతో సత్తా చాటుకుంది.

సలారోడిది టాప్ ప్లేస్:2023లో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎన్నో సినిమాలు విడుదల అయ్యాయి. అందులో రూ. 100 కోట్లు ఓపెనింగ్స్ సాధించి టాప్‌ ప్లేస్‌లో నిలిచిన చిత్రమే 'సలార్: సీజ్‌ఫైర్'. రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏకంగా మొదటి రోజు రూ. 178.70 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. తద్వారా లియో రికార్డు బద్దలు కొట్టి టాప్ ప్లేస్‌కు చేరుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X