Year End 2023: ఇండియాలో టాప్ సినిమాలు ఇవే.. బాలయ్య మాస్ మూవీ రికార్డు.. ప్రభాస్‌ డిజాస్టర్ కూడా!

ఇండియా వ్యాప్తంగా ప్రతి ఏడాది వందల సంఖ్యలో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. అయితే, అందులో కొన్ని మాత్రమే భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకుని రిలీజ్ అవుతున్నాయి. వాటిలో కొన్ని సినిమాలు భారీ వసూళ్లతో సత్తా చాటుతున్నాయి. ఇలా 2023లో కూడా ఎన్నో ప్రాంతీయ, పాన్ ఇండియా స్థాయి చిత్రాలు ఆడియెన్స్‌ను అలరించాయి. మరి వాటిలో ఏ సినిమాలకు అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు వచ్చాయో మీరే చూసేయండి మరి!

ఈ ఏడాది టాప్‌లో లియో:2023లో ఎన్నో సినిమాల పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల అయ్యాయి. కానీ, దక్షిణాదిలోనే వచ్చినా భారీ ఓపెనింగ్స్ సాధించి టాప్‌ ప్లేస్‌లో నిలిచిన చిత్రమే 'లియో'. ఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏకంగా మొదటి రోజు రూ. 146.15 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. తద్వారా ఈ ఏడాది టాప్ గ్రాసింగ్ ఫిల్మ్‌గా నిలిచింది.

Goodbye 2023: Indian Top Gross Opening Movies 2023 List

ప్రభాస్ డిజాస్టర్ రెండు:2023వ సంవత్సరానికి గానూ విడుదలై ఓపెనింగ్ డేన టాప్ గ్రాస్ సాధించిన సినిమాల్లో ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' రెండో స్థానంలో నిలిచింది. ఈ మూవీకి టాక్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా స్పందన వచ్చింది. ఫలితంగా ఇది మొదటి రోజు రూ. 137 కోట్లు గ్రాస్ రాబట్టి రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో షారూక్ ఖాన్ 'జవాన్' చిత్రం 126 కోట్లతో ఉంది.

హిందీ చిత్రాల హవానే:2023వ ఏడాదిలో అత్యధిక ఓపెనింగ్ గ్రాస్‌ను వసూలు చేసిన సినిమాల్లో బాలీవుడ్ హవాను చూపించిందనే చెప్పాలి. ఇప్పటికే మూడు చిత్రాల్లో 'లియో' మినహా హిందీ పరిశ్రమ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఆదిపురుష్', 'జవాన్' చిత్రాలో టాప్ 3లో నిలిచాయి. ఇక, నాలుగో స్థానంలో 'పఠాన్' రూ 105 కోట్లు, టైగర్ 3 రూ. 97 కోట్లతో ఐదో స్థానంలో నిలిచాయి.

Goodbye 2023: Indian Top Gross Opening Movies 2023 List

తమిళ చిత్రాలు కూడా:ఈ సంవత్సరం అత్యధిక ఓపెనింగ్ గ్రాస్‌ను సాధించిన చిత్రాల జాబితాలో తమిళ చిత్రాలు కూడా మరిన్ని చోటు దక్కించుకున్నాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'జైలర్' మూవీకి మొదటి రోజు రూ. 91.20 కోట్లు వచ్చాయి. అలాగే, 'పొన్నియన్ సెల్వన్ 2' మూవీకి రూ. 53.12 కోట్లు కలెక్ట్ అయ్యాయి. దీంతో ఈ చిత్రాలు ఆరు, ఏడు స్థానాలను సొంతం చేసుకున్నాయి.

టాప్ 10లో బాలయ్యకు:2023వ సంవత్సరంలో రిలీజ్ అయి అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాల జాబితాలో 'గదర్ 2' 53.50 కోట్లతో 9వ స్థానంలో నిలిచింది. ఇక, నందమూరి బాలకృష్ణ నటించిన 'వీర సింహా రెడ్డి' సినిమా టాప్ 10లో చోటు దక్కించుకుంది. ఈ చిత్రం మొదటి రోజు రూ. 50.10 కోట్లు వసూలు చేసింది. తద్వారా ఈ లిస్టులో చేరిన ఏకైక తెలుగు ప్రాంతీయ చిత్రంగా నిలిచింది.

Goodbye 2023: Indian Top Gross Opening Movies 2023 List

మెగా సినిమాలు ఇలా:2023వ ఏడాదిలో అత్యధిక ఓపెనింగ్ గ్రాస్‌ను వసూలు చేసిన సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' మూవీ 49.10 కోట్లతో 11వ స్థానంలో నిలిచింది. అలాగే, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో రూపొందిన BRO మూవీ 48.50 కోట్ల గ్రాస్ వసూళ్లతో 12వ స్థానంలో ఉంది. మొత్తంగా ఈ సారి హిందీ, తమిళ చిత్రాలు ప్రభావం చూపాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X