Year End 2023: తెలుగులో రిచ్ హీరోలు వీళ్లే.. అందరి కంటే ఎక్కువ ఆ స్టార్‌కే.. ఎవరి ఆస్తి ఎంతో తెలుసా?
ఇండియా వ్యాప్తంగా సినిమాలకు లభించే మరే దేశంలోనూ దక్కదు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా తెలుగులో వచ్చే చిత్రాలకు మరింత ఎక్కువ రెస్పాన్స్ లభిస్తుంటుంది. అందుకే ఈ మధ్య కాలంలో మన సినిమాతో పాటు ఇక్కడి హీరోల రేంజ్ కూడా భారీగా పెరిగిపోయింది. ఫలితంగా టాలీవుడ్ స్టార్ హీరోల ఫాలోయింగ్, మార్కెట్‌తో పాటు సంపాదన కూడా భారీగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో 2023 సంవత్సరం ముగిసే సమయానికి ఏ తెలుగు హీరోకు ఎంత ఆస్తి ఉంది అనే ప్రత్యేక కథనంపై మీరే లుక్కేయండి!
తెలుగులో అత్యధిక ఆస్తి ఉన్న హీరోల లిస్టులో మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు. ఆయనకు 200 మిలియన్ డాలర్లు అంటే 1667 కోట్లు రూపాయలు ఆస్తి ఉందని సమాచారం.

టాలీవుడ్‌లోని రిచ్ హీరోల లిస్టులో విక్టరీ వెంకటేష్ రెండో స్థానంలో ఉన్నారని తెలిసింది. ఆయన పేరు మీద దాదాపు రూ. 1500 కోట్లు వరకూ ఆస్తులు ఉన్నట్లు తెలిసింది.
వెంకటేష్ తర్వాతి స్థానంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉన్నాడు. అతడికి 175 మిలియన్ డాలర్లు అంటే 1459 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నట్లు ఫిలిం నగర్ ఏరియా సమాచారం.
టాలీవుడ్‌లో ఎక్కువ ఆస్తి ఉన్న హీరోల్లో నాగార్జున నాలుగో స్థానంలో ఉన్నారు. ఆయనకు మొత్తంగా 123 మిలియన్ డాలర్లు అంటే 1025 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నట్లు తెలుస్తోంది.

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన రిచ్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఐదో స్థానంలో ఉన్నాడు. అతడి పేరిట 60 మిలియన్ డాలర్లు అంటే 500 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
టాలీవుడ్ రిచ్ హీరోల లిస్టులో అల్లు అర్జున్ ఆరో స్థానంలో ఉన్నాడని సమాచారం. అతడికి 50 మిలియన్ డాలర్లు అంటే 410 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు తాజాగా తెలిసింది.
తెలుగులో ఎక్కువ ఆస్తి ఉన్న హీరోల జాబితాలో మహేశ్ బాబు ఏడో స్థానంలో ఉన్నాడు. అతడి పేరిట 40 మిలియన్ డాలర్లు అంటే 330 కోట్ల రూపాయలకు పైగా ఆస్తి ఉందని టాక్.

టాలీవుడ్‌కు చెందిన రిచ్ హీరోల లిస్టులో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. అతడి పేరిట 30 మిలియన్ డాలర్లు అంటే 250 కోట్లు రూపాయల ఆస్తి ఉందని సమాచారం.
ఇప్పుడు టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోల్లో తక్కువ ఆస్తి ఉన్నది పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు అని తెలిసింది. ఆయన పేరు మీద కేవలం రూ. 150 కోట్లు ఆస్తి మాత్రమే ఉన్నట్లు సమాచారం.
మోహన్ బాబు కుటుంబంలోని అందరి పేరిట దాదాపు రూ. 500 కోట్లు వరకూ ఆస్తి ఉందని ప్రచారం జరుగుతోంది. అలాగే, నందమూరి బాలకృష్ణ పేరిట రూ. 100 కోట్లు ఆస్తులు ఉన్నాయట.
పైన పేర్కొన్న హీరోలు మాత్రమే కాకుండా వాళ్ల కుటుంబ సభ్యుల పేరిట కూడా ఎన్నో ఆస్తులు ఉన్నాయని సోషల్ మీడియాలో లెక్కలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











