Year End 2023: చరిత్ర సృష్టించిన తెలుగు చిత్రాలు.. తక్కువ బడ్జెట్‌తోనే కోట్లు.. ఆ సినిమాలు ఏవంటే!

సాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఈ ఏడాది వందకు పైగానే సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే ఆడియెన్స్ మనసును దోచుకుని విజయాలను అందుకున్నాయి. వాటిలో చాలా తక్కువ మాత్రమే భారీ బడ్జెట్ సినిమాలు ఉండగా.. ఎన్నో చిన్న వ్యయంతో రూపొందిన చిత్రాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా 2023లో కొన్ని చిన్న సినిమాలు సెన్సేషనల్ సక్సెస్‌లను సొంతం చేసుకున్నాయి. ఆ సినిమాలు ఏంటో మీరే చూసేయండి మరి!

చరిత్ర సృష్టించిన బేబీ మూవీ:2023లో తక్కువ బడ్జెట్‌తో వచ్చి చరిత్ర సృష్టించే విజయాన్ని అందుకున్న చిత్రమే 'బేబి'. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీని సాయి రాజేష్ తెరకెక్కించాడు. ఇది రూ. 8 కోట్లు టార్గెట్‌తో వచ్చి రూ. 43 కోట్లు షేర్ వసూలు చేసింది. తద్వారా రూ. 35 కోట్లు లాభాలను సొంతం చేసుకుని సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.

Goodbye 2023: Small Budget Telugu movies became big hits In 2023

భారీ లాభాలు తెచ్చిన బలగం:ప్రముఖ కమెడియన్ వేణు ఎల్దండి దర్శకుడిగా మారి తెరకెక్కించిన సినిమానే 'బలగం'. కుటుంబ విలువలను చాటి చెప్పే కథతో వచ్చిన ఈ మూవీకి కేవలం రూ. 1.15 కోట్లు బిజినెస్‌తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఫుల్ రన్‌లో ఊహించని విధంగా రూ. 12.55 కోట్లు వరకూ షేర్ రాబట్టింది. తద్వారా ఇది రూ. 11.25 కోట్లు లాభాలతో సరికొత్త చరిత్రను సృష్టించింది.

శ్రీ విష్ణు కెరీర్‌లోనే బిగ్ హిట్‌గా:ఈ ఏడాది మరో భారీ విజయాన్ని అందుకున్న సినిమానే 'సామజవరగమన'. రామ్ అబ్బరాజు తెరకెక్కించిన ఈ మూవీ ద్వారా శ్రీ విష్ణు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా కేవలం రూ. 3.50 కోట్లు బడ్జెట్‌తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, 15 కోట్లు వరకూ షేర్ వసూలు చేసింది. తద్వారా రూ. 11.50 కోట్లు లాభాలను అందుకుని సత్తా చాటింది.

Goodbye 2023: Small Budget Telugu movies became big hits In 2023

మ్యాడ్ ఎక్కించిన సినిమానే:సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన కామెడీ సినిమానే 'మ్యాడ్'. కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కేవలం రూ. 2.50 కోట్లు బిజినెస్‌ను మాత్రమే చేసుకుంది. అయితే, ఈ మూవీకి అదిరిపోయే టాక్ రావడంతో రెస్పాన్స్ భారీగా వచ్చింది. దీంతో ఇది రూ. 9.50 కోట్లు వసూలు చేసింది. తద్వారా రూ. 7 కోట్లు లాభాలను సొంతం చేసుకుంది.

కార్తికేయకు థ్రిల్లింగ్ సక్సెస్:కార్తికేయ గుమ్మకొండ నటించిన లేటెస్ట్ మూవీనే 'బెదురులంక 2012'. ఫన్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్టుతో రూపొందిన ఈ చిత్రం కూడా మంచి టాక్‌ను తెచ్చుకుని భారీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా రూ. 4.50 కోట్లు టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొత్తంగా రూ. 7 కోట్లు వరకూ షేర్ రాబట్టింది. దీంతో రూ. 2.50 కోట్లు లాభాలను అందుకుంది.

Goodbye 2023: Small Budget Telugu movies became big hits In 2023

పొలిమేర, కోటబొమ్మాళిలు:2023లో తక్కువ బడ్జెట్‌తో వచ్చి సక్సెస్ అయిన సినిమాల్లో 'రైటర్ పద్మభూషణ్', 'మా ఊరి పొలిమేర 2', 'కోటబొమ్మాళి పీఎస్' వంటి సినిమాలు కూడా ఉన్నాయి. ఈ సినిమా ద్వారా డిస్ట్రిబ్యూటర్లకు భారీ మొత్తంలో లాభాలు వచ్చాయి. ఇలా ఈ ఏడాది చాలా చిన్న సినిమాలు సంచలన విజయాలను సొంతం చేసుకుని.. ఎన్నో రికార్డులను కూడా నమోదు చేసుకున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X