Year Ender 2023: టాలీవుడ్‌లో టాప్ హీరోలు వీళ్లే.. ప్రభాస్‌దే ఫస్ట్ ప్లేస్.. మెగా హీరోలకు బాలయ్య షాక్
ప్రతి ఏడాది మాదిరిగానే 2023లో సైతం తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు వచ్చాయి. అయితే, అందులో కేవలం ఓ 25 సినిమాలు మాత్రమే అదిరిపోయే రెస్పాన్స్‌ను సొంతం చేసుకుని సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. మిగిలిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి. మొత్తానికి ఈ ఏడాది చాలా సినిమాలు భారీ వసూళ్లతో టాప్ ప్లేస్‌లో నిలిచాయి. అందులో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అందరి కంటే పైచేయి సాధించాడు. ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి మరి!
ఈ ఏడాది సలార్ టాప్:2023లో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎన్నో సినిమాలు విడుదల అయ్యాయి. అందులో భారీ ఓపెనింగ్స్ సాధించి టాప్ ప్లేస్‌లో నిలిచిన చిత్రమే 'సలార్: సీజ్‌ఫైర్'. రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏకంగా మొదటి రోజు రూ. 178.70 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. తద్వారా ఈ ఏడాది ఇండియాలోనే టాప్ గ్రాసింగ్ ఫిల్మ్‌గా నిలిచింది.

ప్రభాసే 2వ స్థానంలో:2023వ సంవత్సరానికి గానూ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఓపెనింగ్ డేన టాప్ గ్రాస్ సాధించిన సినిమాల్లో ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' రెండో స్థానంలో నిలిచింది. ఈ మూవీకి టాక్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా స్పందన వచ్చింది. ఫలితంగా ఇది మొదటి రోజు రూ. 137 కోట్లు గ్రాస్ రాబట్టి రెండో స్థానంలో నిలిచింది. ఇండియా వైడ్‌గా అయితే మూడో స్థానంలో ఉంది.

బాలయ్యకు మూడోది:2023వ సంవత్సరంలో రిలీజ్ అయి అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన తెలుగు సినిమాల జాబితాలో నందమూరి బాలకృష్ణ నటించిన 'వీర సింహా రెడ్డి' సినిమా మూడో స్థానంలో నిలిచింది. ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 50.10 కోట్లు వసూలు చేసింది. తద్వారా ఈ లిస్టులో మూడో స్థానంలో చోటు దక్కించుకున్నా.. ఇండియా వ్యాప్తంగా 11వ స్థానంలో నిలిచింది.
చిరుకు నాల్లో ర్యాంక్:2023వ ఏడాదిలో అత్యధిక ఓపెనింగ్ గ్రాస్‌ను వసూలు చేసిన టాలీవుడ్ సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' మూవీ కూడా టాప్‌లో నిలిచింది. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 49.10 కోట్లు వచ్చాయి. దీంతో తెలుగులో 4వ స్థానంలోనూ, ఇండియా వైడ్‌గా 12వ స్థానంలో నిలిచింది.

పవన్‌ది ఐదో స్థానం:ఈ సంవత్సరంలో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాల్లో 'బ్రో' (BRO) నిలిచింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ మూవీ మొదటి రోజు రూ. 48.50 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఫలితంగా టాలీవుడ్‌లో ఐదో స్థానంలో నిలిచింది. ఇండియా వైడ్‌గా చూస్తే 13వ స్థానంలో ఉంది.
ఫైన పేర్కొన్న సినిమాలు మాత్రమే కాదు.. ఈ ఏడాది చాలా తెలుగు చిత్రాలు భారీ స్థాయిలో ఓపెనింగ్స్‌ను రాబట్టి సత్తా చాటుకున్నాయి.


Click it and Unblock the Notifications











