For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అఫ్ఘాన్ క్రికెటర్‌ రషీద్ ఖాన్‌తో అనుష్క శర్మ పెళ్లి: కోహ్లీకి కోలుకోలేని షాకిచ్చిన బడా సంస్థ.!

  By Manoj Kumar P
  |

  క్రికెటర్లు సినీ పరిశ్రమకు చెందిన నటీమణులను పెళ్లాడడం కొత్తేమీ కాదు. గతంలో చాలా మంది ఇదే తరహా వ్యవహారంతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఈ మధ్య కాలంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ కూడా ప్రేమాయణం సాగించిన తర్వాత పెళ్లి పీటలెక్కారు. అప్పటి నుంచి తరచూ ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇక, ఈ మధ్యనే వీళ్లిద్దరూ ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో అనుష్క శర్మ... కోహ్లీ భార్య కాదని, మరో క్రికెటర్‌కు వైఫ్ అని పేర్కొనడం కలకలం రేపుతోంది. ఆ వివరాలు మీకోసం.!

  యాడ్‌లో కలిశారు... వివాహమాడారు

  యాడ్‌లో కలిశారు... వివాహమాడారు

  క్రికెటర్‌గా కోహ్లీ... హీరోయిన్‌గా అనుష్క శర్మ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరూ కలిసి ఓ షాంపూ యాడ్ చేశారు. ఆ సమయంలో ఈ జంట ప్రేమలో పడినట్లు ప్రచారం జరిగింది. అప్పటి నుంచి చాలా కాలం పాటు రహస్యంగా ప్రేమాయణం సాగించిన వీళ్లు... కొన్నేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు.

  ఇద్దరూ యాక్టివే.. అందుకే పాపులర్

  ఇద్దరూ యాక్టివే.. అందుకే పాపులర్

  కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ... విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఇద్దరూ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే తమ కెరీర్లకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు. అదే సమయంలో తమ వైవాహిక జీవితానికి సంబంధించిన అంశాలనూ షేర్ చేసుకుంటున్నారు. దీంతో తరచూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు.

  బిడ్డకు జన్మనివ్వబోతున్న అనుష్క

  బిడ్డకు జన్మనివ్వబోతున్న అనుష్క

  అనుష్క శర్మ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. దీంతో ఆమె తల్లి కాబోతుందన్న వార్తలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె చాలా సార్లు ఆ వార్తలను కొట్టి పారేసింది. అయితే, ఇటీవల తాను తల్లిని కాబోతున్నట్లు అనుష్క ప్రకటించింది. ఆమెతో పాటు కోహ్లీ కూడా దీనికి సంబంధించిన ట్వీట్ చేశాడు. దీంతో వీళ్ల ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు.

  గవాస్కర్ కామెంట్స్.. విమర్శల పాలు

  గవాస్కర్ కామెంట్స్.. విమర్శల పాలు

  ప్రస్తుతం కోహ్లీ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున క్రికెట్ ఆడుతున్నాడు. ఈ సీజన్ ఆరంభంలో వరుస వైఫల్యాలను ఎదుర్కొన్నాడతను. దీంతో సీనియర్ క్రికెటర్, కామెంటేటర్ గవాస్కర్ ‘కోహ్లీ లాక్‌డౌన్‌లో అనుష్క బౌలింగ్‌లో ప్రాక్టీస్ చేసినట్లున్నాడు' అని కామెంట్స్ చేయడంతో ఇది పెద్ద వివాదం అయింది. దీనిపై అనుష్క కూడా ఘాటుగానే స్పందించింది.

  రషీద్ ఖాన్‌తో అనుష్క శర్మ వివాహం

  రషీద్ ఖాన్‌తో అనుష్క శర్మ వివాహం

  అనుష్క శర్మ... విరాట్ కోహ్లీ భార్య అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, దీనికి భిన్నంగా ఆమెను అఫ్గానిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్‌ వివాహం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి సర్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తోన్న రషీద్‌కు ఇంకా వివాహం కాలేదు. కానీ, అతడికి అనుష్క భార్య అవుతుందని ఓ న్యూస్ బయటకు రావడంతో కలకలం రేగుతోంది.

  కోహ్లీకి కోలుకోలేని షాకిచ్చిన బడా సంస్థ.!

  కోహ్లీకి కోలుకోలేని షాకిచ్చిన బడా సంస్థ.!

  అనుష్క.. రషీద్ భార్య భర్తలన్న వార్త తెరపైకి రావడానికి కారణం గూగుల్ సంస్థ చేసిన పొరపాటే. ఈ బడా సెర్చ్ ఇంజన్‌లో ‘WHO IS RASHID KHAN WIFE' అని టైప్ చేస్తే ‘అనుష్క శర్మ' పేరే వస్తోంది. దీంతో ఇది చూసిన వారందరూ షాక్‌కు గురవుతున్నారు. గతంలో రషీద్ తన ఫేవరేట్ హీరోయిన్ అనుష్క అని చెప్పాడు. దీని వల్లే గూగుల్ ఇలా రిజల్ట్ చూపిస్తుందని అంటున్నారు.

  English summary
  Anushka Sharma and Virat Kohli, who got married in Italy in 2017, frequently make appearances on each other's Instagram profiles and we simply love it when that happens. On Valentine's Day this year, Virat shared a lovely picture on Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X