twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి కోసం సరోజ్ ఖాన్.. షాట్ షాట్‌కి క్లాప్స్ కొట్టేవారు. .. నాటి విశేషాలు చెప్పిన డైరెక్టర్

    |

    మదర్ ఆఫ్ డ్యాన్స్, డ్యాన్సింగ్ క్వీన్ ఇలా ఎన్ని రకాలుగా పిలిచినా గుర్తొచ్చేది మాత్రం సరోజ్ ఖాన్ ఒక్కరే. ఆమె కంపోజ్ చేసిన పాటలన్నీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గవే. బాలీవుడ్ చిత్ర సీమలో ఆమె శకం ముగిసింది. గుండెపోటుతో నిన్న (జూలై 3) మరణించింది. ఆమె మరణంతో భారత సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. అయితే ఆమె తెలుగు సినిమాకు పని చేసింది అరుదు. అందులోనూ ఆమె చిరంజీవి కోసం తన కాలును కదిపారు. నాటి విశేషాలను డైరెక్టర్ గుణ శేఖర్ చెప్పుకొస్తూ ఎమోషనల్ అయ్యాడు.

    Recommended Video

    Saroj Khan జ్ఞాపకాలతో భావోద్వేగానికి గురైన Gunasekhar || Oneindia Telugu
    రెండు పాటలకు..

    రెండు పాటలకు..

    చూడాలని ఉంది సినిమా నాటి సంగతులను గుణ శేఖర్ వివరిస్తూ ఓ వీడియోను షేర్ చేశాడు. అందులోని సారాంశం ఏంటంటే..‘కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్ గారితో 1998లో వ‌చ్చిన‌ ‘చూడాలని ఉంది' సినిమా కోసం వ‌ర్క్ చేయ‌డం జ‌రిగింది. ఆ సినిమాలో రెండు పాట‌ల‌కి ఆమె కొరియోగ్ర‌ఫి చేశారు.

    చిరంజీవి కోసం వెంటనే..

    చిరంజీవి కోసం వెంటనే..


    ముందుగా ‘ఓ మారియా.. ఓ మారియా' పాట సరోజ్‌ఖాన్ గారితో చేద్దామ‌నుకుంటున్నాను అని అశ్విని దత్ గారితో చెప్ప‌గానే ఆయ‌న‌కు ఆమెతో ఉన్న అనుబంధంతో నేను వెళ్లి మాట్లాడ‌తాను అని చెప్పారు. అప్ప‌టికే ఇండియాలోనే బిజీ కొరియోగ్రాఫ‌ర్ అయిన‌ప్ప‌టికీ చిరంజీవిగారి సినిమా అన‌గానే ఎగ్జ‌యిట్ అయ్యి ఒప్పుకున్నారు. ఎందుకంటే చిరంజీవిగారు కొరియోగ్రాఫ‌ర్స్ తాలుకు ఎఫ‌ర్ట్‌ని త‌న డ్యాన్స్ మూమెంట్స్‌తో వంద‌రెట్లు ఎక్కువ చేస్తారు.

    మణిశర్మ గురించి..

    మణిశర్మ గురించి..

    నేను, మ‌ణిశ‌ర్మ సినీ కెరీర్ ప్రారంభించిన తొలి రోజులు అవి. పాట విన‌గానే మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎవ‌రు అని సరోజ్‌ఖాన్ గారు అడిగారు. మ‌ణిశ‌ర్మ అనే అప్‌క‌మింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ కంపోజ్ చేశారు అన‌గానే ఆ రిథ‌మ్స్ న‌చ్చి భ‌విష్య‌త్తులో త‌ప్ప‌కుండా పెద్ద మ్యూజిక్ డైరెక్ట‌ర్ అవుతాడు అని చెప్పారు. అలాగే హైద‌రాబాద్ రాగానే తోట త‌ర‌ణి గారి సెట్ ని బాగా లైక్ చేశారు.

    షాట్ షాట్‌కి క్లాప్స్

    షాట్ షాట్‌కి క్లాప్స్

    అది నా నాలుగ‌వ సినిమా. కెరీర్ తొలినాళ్ల‌లోనే మెగాస్టార్‌తో సినిమా అంటే అదోక అచీవ్‌మెంట్‌. దాంతో క్యాస్టింగ్‌, ఫోటోగ్ర‌ఫి, ఆర్ట్ మీద నేను పెట్టిన శ్ర‌ద్ద‌ని ఆమె మెచ్చుకొని న‌న్ను చాలా ప్రోత్స‌హించారు. అలాగే ఓ మారియా.. ఓ మారియా' పాటకు ఆమె కొరియోగ్ర‌ఫీ చేస్తోన్న విధానానికి, దానికి చిరంజీవిగారి డ్యాన్స్ స్కిల్స్‌కి యూనిట్ స‌భ్యులు షాట్ షాట్ కి క్లాప్స్ కొట్టేవారు.

    నంది అవార్డు..

    నంది అవార్డు..

    మా టీమ్ అంద‌రం ఎంత ఎంజాయ్‌చేస్తూ ఆ పాట‌ను చేశామో.. సినిమా విడుద‌లైన త‌ర్వాత ఆ పాట‌కు ఆడియ‌న్స్ అంత‌కంటే ఎక్కువ ఎంజాయ్ చేశారు. ఆ పాట‌కు ప్ర‌భుత్వం వారు సరోజ్‌ఖాన్ గారికి నంది అవార్డు కూడా ఇవ్వ‌డం జ‌రిగింది. ఆమె డ్యాన్స్ మూమెంట్స్‌ని ఎంత బాగా కంపోజ్ చేస్తారో ఎక్స్‌ప్రెష‌న్స్‌ని అంత బాగా క్యాప్చ‌ర్ చేస్తారు.

    ఆత్మకు శాంతి చేకూరాలి..

    ఆత్మకు శాంతి చేకూరాలి..

    దాంతో అబ్బ‌బ్బా ముద్దు..సాంగ్‌కి కూడా ఆమె కొరియోగ్ర‌ఫి చేస్తే బాగుంటుంద‌ని ద‌త్తుగారితో చెప్పి ఆ పాట కూడా ఆమెతోనే కొరియోగ్ర‌ఫి చేపించ‌డం జ‌రిగింది. ఆ పాట‌లో సౌంద‌ర్య‌గారి ఎక్స్‌ప్రెష‌న్స్‌కి, అలాగే చిరంజీవి గారి గ్రేస్ మూమెంట్స్‌కి ప్రేక్ష‌కులు మ‌రోసారి అంతే గొప్ప అనుభూతికి లోనయ్యారు. అప్ప‌టికే లెజెండ‌రీ కొరియోగ్రాఫ‌ర్ అయిన కొత్త‌వారికి ఆమె ఇచ్చిన ప్రోత్సాహం మ‌రువ‌లేనిది. ఆవిడ ఈ రోజు మ‌న‌మ‌ధ్య‌‌లేక పోవ‌డం కేవ‌లం మ‌న తెలుగు ఇండ‌స్ట్రీకే కాదు ఇండియ‌న్ సినిమాకే లోటు. ఆవిడ ఆత్మ‌కు శాంతిచేకూరాల‌ని ప్రార్దిస్తున్నాను

    English summary
    Gunasekhar About Saroj Khan And chiranjeevi. Gunasekhar Recalls Chudalani Vundhi Memories With Saroj Khan And chiranjeevi. Saroj Khan choreographed Two Songs.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X