క్రేజీ ప్రాజెక్ట్‌లో సమంత.. గుణ శేఖర్ మళ్లీ మ్యాజిక్ చేస్తాడా?
సమంత ఇప్పుడు ఓ సినిమా ఒప్పుకుందంటే అదో సెన్సేషన్. ఎందుకంటే సమంత మామూలుగా సినిమాలు ఒప్పుకోవడం లేదు. ఆచితూచి ప్రాజెక్ట్‌లను ఎంచుకుంటోంది. తన ప్రతిభను నిరూపించుకునే పాత్రలు, తన స్థాయిని పెంచుకునేలా ఉండే క్యారెక్టర్స్‌ను మాత్రం సెలెక్ట్ చేసుకుంటోంది. తాజాగా సమంత ఓ తెలుగు ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పింది. వర్సటైల్ డైరెక్టెర్ గుణ శేఖర్ చిత్రంలో సమంత నటిస్తోంది.
అయితే గుణ శేఖర్ మాత్రం రుద్రమదేవి సినిమా తరువాత మరో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోయాడు. రానాతో హిరణ్యకశ్యప అనే ఓ చిత్రాన్ని ప్లాన్ చేశాడు. కానీ అది ఇంత వరకు ముందుకుసాగలేదు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని ఆ మధ్య టాక్ వచ్చింది. అయితే తాజాగా గుణ శేఖర్ తన కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'శాకుంతలం' సినిమాలో సమంతను హీరోయిన్‌గా తీసుకున్నట్టు తెలిపాడు.

అందమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో కావ్యనాయకిగా సమంతను ఎంచుకున్నట్టు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. నూతన సంవత్సరం సందర్భంగా 'శాకుంతలం' టైటిల్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఇందులో మణిశర్మ ఇచ్చిన సంగీతం అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే మునుపటిలా గుణ శేఖర్ మణిశర్మ మ్యాజిక్ చేయగలరా? సమంత ఏ మేరకు సత్తాను చాటుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











