NBA ఇంటర్నేషనల్ బాస్కెట్ బాల్ పోటీలో కుర్చీ మడతపెట్టి సాంగ్ .. ట్రెండింగ్‌గా సాంగ్ వీడియో!
సంక్రాంతి 2024 కానుకగా రిలీజైన గుంటూరు కారం చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ సినిమా టాక్ ప్రతికూలంగా ఉన్నప్పటికీ.. కలెక్షన్లతో రికార్డులు తిరగరాసింది. బాక్సాఫీస్ వద్దే కాకుండా ఈ సినిమాలోని పాటలు ప్రపంచవ్యాప్తంగా కేవలం తెలుగు వారినే కాకుండా అన్ని భాషల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నది. తాజాగా అమెరికాలో ప్రతిష్టాత్మకంగా భావించే నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (NBA) ఛాంపియన్ పోటీల్లో కుర్చి మడతపెట్టి సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఆ సంఘటన వివరాల్లోకి వెళితే..
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం సమకూర్చిన కుర్చి మడత పెట్టి సాంగ్ ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాలను ఆకట్టుకొన్నది. సాధారణ ప్రేక్షకులనే కాకుండా ఇంటర్నేషనల్ క్రికెటర్లు, మ్యూజిక్ లెజెండ్స్‌ను కూడా ఈ పాట స్టెప్పులేసేలా చేసింది. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ కూడా ఈ పాటకు రీల్స్ చేసు ఆకట్టుకొన్నారు.

ఇక కుర్చి మడతపెట్టి సాంగ్ రీల్స్ సోషల్ మీడియాలో రికార్డు సృష్టించింది. మిలియన్ల కొద్ది రీల్స్‌తో అభిమానులు, సంగీత ప్రియులు సంచలనం రేపారు. దాదాపు 100 మిలియన్ల రీల్స్ వరకు చేసినట్టు సమాచారం. ఆ పాట ప్రస్తుతం ఇంకా అందర్నీ వెంటాడుతున్నది. ఇటీవల ఈ పాట యూట్యూబ్‌లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఇదిలా ఉండగా, అమెరికాలో నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (NBA) పోటీలు ఇటీవల ప్రారంభం అయ్యాయి. ఈ పోటీల్లో కుర్చి మడతపెట్టి సాంగ్‌ను ఆరంభ వేడుకల్లో ప్రదర్శించారు. అమెరికాలోని ఔత్సాహిక డ్యాన్సర్లు ఈ పాటను ఎంపిక చేసుకొని వారి లెవెల్‌లో కొరియోగ్రఫిని చేసుకొని డ్యాన్స్‌ను ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది.
ఇక గుంటూరు కారం సినిమా విషయానికి వస్తే.. నెగిటివ్ రివ్యూలను ఎదురించి ఈ మూవీ రికార్డు వసూళ్లను సాధించింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను సాధించింది. అటు బాక్సాఫీస్ పరంగా, ఇటు మ్యూజిక్ చార్ట్ బస్టర్స్‌లోను నెంబర్‌వన్‌గా నిలవడం విశేషంగా మారింది.


Click it and Unblock the Notifications











