ప్రియుడిని ముద్దుల్లో ముంచెత్తిన గుత్తా జ్వాలా.. విష్ణు విశాల్ బుగ్గను గట్టిగా కొరుకుతూ.. ఫోటో వైరల్
తమిళ నటుడు విష్ణు విశాల్, బాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా రొమాన్స్ పీక్స్‌కు వెళ్లింది. ఇటీవలే నిశ్చితార్థం చేసుకొన్న ఈ జంట ఇప్పుడు డేటింగ్‌తో అదరొట్టేస్తున్నారు. తాజాగా ప్రియుడితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు ఇంటర్నెట్ మీడియాలో వైరల్ అయ్యాయి. వారిద్దరి మధ్య గాఢమైన ప్రేమ వారి చర్యల్లో కనిపించింది. వారి ముద్దు ముచ్చట మీరే చూడండి..

లాక్‌డౌన్‌లో విరహా వేదనతో
కొద్దినెలలుగా జ్వాలా గుత్తా, విష్ణు విశాల్ ఇద్దరూ అఫైర్‌లో ఉన్నారనే వార్తలు మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి. సోషల్ మీడియాలో వారిద్దరి విరహ వేదన నెటిజన్లకు జోష్ కలిగించింది. లాక్‌డౌన్‌లో వారి విరహా వేదన తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా తమిళ మీడియాలో కూడా హాట్ టాపిక్‌గా మారింది.

ఇద్దరి వైవాహిక జీవితంలో గందరగోళం
విష్ణు విశాల్, జ్వాలా గుత్తా ఇద్దరి వ్యకిగత జీవితాలు చూస్తే.. వారిద్దరూ తమ వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. జ్వాలా గుత్తా కొన్నేళ్ల క్రితం భర్తకు విడాకులు ఇస్తే.. విష్ణు విశాల్ ఇటీవలే ప్రేమించి పెళ్లి చేసుకొన్న భార్యకు విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత జ్వాలా, విష్ణు విశాల్ ప్రేమలో పడ్డారు.

జ్వాలాతో విష్ణువిశాల్ ఎంగేజ్‌మెంట్
కొద్ది నెలలుగా వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ దక్షిణాది మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో తన బర్త్ డే సందర్భంగా విష్ణు విశాల్ తన ప్రేయసి జ్వాలాకు ఉంగరాన్ని బహుకరించి ఎంగేజ్‌మెంట్ చేసుకొన్నారు. దాంతో వారి రిలేషన్‌షిప్ అధికారికంగా వెల్లడైంది.

గట్టిగా బుగ్గను కొరుకుతూ.. కౌగిలిలో బంధించి
విష్ణు విశాల్, జ్వాలా తాజాగా ముద్దు ముచ్చటలో మునిగిపోయారు. విశాల్‌ను గాఢంగా ముద్దు పెట్టుకొంటూ కనిపించారు. అంతేకాకుండా కౌగిలో బంధించి ఆయన బుగ్గను గట్టిగా కొరుకుతూ రొమాన్స్‌లో మునిగిపోయారు. ప్రియురాలు ముద్దు పెట్టుకొంటుంటే.. విష్ణు విశాల్ తన్మయత్వం చెందుతూ కనిపించారు.

విడదీయలేనంతగా బంధం
విష్ణు విశాల్‌ను గాఢంగా ముద్దు పెట్టుకొంటున్న ఫోటోను గుత్తా జ్వాలా తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేశారు. జీవితంలో మంచి ఉత్సాహం, జోష్ పొందాలంటే.. ఎవరో ఒకరు విడదీయలేనంతగా బంధం ఉండాలి అంటూ ఫోటోతోపాటు కామెంట్ చేశారు. ఇప్పుడు వారిద్దరి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











