దాని కంటే ఐటెం సాంగ్సే బెటర్.. హంసా నందిని ఇంట్రెస్టింగ్ కామెంట్స్

కావాల్సినంత అందం, కుర్రాళ్లకు మత్తెకించగల సోయగం హంసా నందిని సొంతం. ఆరుగడుల అందం అలా నడిచివస్తుంటే.. ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. హీరోయిన్‌గా కెరీర్‌ను ప్రారంభించిన హంసా.. సైడ్ క్యారెక్టర్స్, ఐటెమ్ సాంగ్స్, అతిథి పాత్రలకు పరిమితమైంది. హీరోయిన్ ట్యాగ్ నుంచి ఐటెమ్ సాంగ్స్ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. హంసా నందినీ అంటే ప్రస్తుతం అందరికీ ఐటెం సాంగ్సే గుర్తుకొస్తాయి. తాజాగా ఆమె హలో యాప్ లైవ్‌లో పాల్గొంటూ.. అనేక విషయాలను వెల్లడించింది.

అలా మొదలైంది..

అలా మొదలైంది..

2004లో వచ్చిన "ఒక్కటవుదాం" చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది హంసా నందిని. వంశీ దర్శకత్వంలో వచ్చిన అనుమానాస్పదం అనే చిత్రంతో నటిగా మంచి గుర్తింపు వచ్చింది. అందులోని ప్రతిక్షణం నీ దర్శనం అనే పాట ఎంతగానో ఫేమస్ అయింది.

స్పెషల్ పాత్రలకు గిరాకీ..

స్పెషల్ పాత్రలకు గిరాకీ..


హంసా నందినీ ప్రత్యేక పాత్రలకు మారుపేరుగా నిలిచింది. ఈగ, లౌక్యం వంటి సినిమాల్లో తన లుక్స్‌తో, హాట్‌నెస్‌తో కుర్రకారుకు మతి పోగొట్టేసింది. అయితే ఎంతగా అందాలను ఆరబోసిన హంసా నందిని దశ మాత్రం తిరగడం లేదు. కేవలం ఐటెమ్ సాంగ్స్, స్పెషల్ అప్పీయరెన్స్‌కు మాత్రం పరిమితమైపోతోంది.

ఐటెం సాంగ్ చేస్తే హిట్టే..

ఐటెం సాంగ్ చేస్తే హిట్టే..

ఒకానొక సమయంలో హంసా నందిని ఐటెమ్ సాంగ్ చేస్తే ఆ సినిమా హిట్టేనన్న పేరు వచ్చింది. మిర్చి, అత్తారింటికి దారేది, లౌక్యం, లెజెండ్ వంటి సినిమాల్లో ప్రత్యేకంగా నర్తించింది. ఇవన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదుచేశాయి. తాజాగా వీటిపై స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

Recommended Video

Sri Reddy vs Nandini Rai
దాని కంటే ఐటెం సాంగ్సే బెటర్..

దాని కంటే ఐటెం సాంగ్సే బెటర్..

హీరోయిన్‌గా తనకు వచ్చే రొటీన్ పాత్రలు నచ్చకపోవడం వల్లే సినిమాల్లో స్పెషల్ సాంగ్‌ల వైపు ఫోకస్ పెట్టానని చెప్పుకొచ్చింది. అలా రొటీన్ పాత్రలు చేసే కన్నా.. విభిన్నంగా ఉండే స్పెషల్ సాంగ్స్ చేయడమే ఇష్టమని తెలిపింది. తనకు కూడా సాంగ్స్, డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని తెలిపింది. అందుకే స్పెషల్ సాంగ్స్ చేస్తున్నానని పేర్కొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X