Don't Miss!
- News
ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ ఇంటికి వెళ్లిన జగన్ దంపతులు
- Finance
Twitter Blue: శుభవార్త చెప్పిన ఎలాన్ మస్క్.. ట్విట్టర్ బ్లూ ఖాతాదారులకు కనకవర్షం..
- Sports
INDvsAUS : ఆసీస్కు అది అలవాటే.. అది వాళ్ల మైండ్ గేమ్.. అశ్విన్ ఘాటు రిప్లై!
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
మళ్లీ మాల్దీవుల్లో రచ్చ.. ఈ సారి హన్సిక వంతు.. అందాల విందు అదరహో
ప్రస్తుతం మన తారలంతా మాల్దీవుల్లోనే సేద తీరుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు మాల్దీవుల్లో మంట పెట్టి వచ్చారు. అందాల ఆరబోతకు అడ్డూ అదుపూ లేదన్నట్టుగా మాల్దీవుల్లో రచ్చ చేశారు. ఇక ఇప్పుడు ఆ బాధ్యతను హన్సిక తీసుకున్నట్టుంది. కశ్మీర్ యాపిల్ హన్సిక ఇప్పుడు మాల్దీవుల్లో అందాలను ఆరబోస్తోంది. గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాను హన్సిక ఓ ఊపు ఊపేస్తోంది.

వరుసబెట్టి..
కరోనా, లాక్డౌన్ వల్ల కలిగిన ఫ్ట్రస్టేషన్‌ను హీరోయిన్లందరూ కూడా మాల్దీవుల్లో తీర్చేసుకున్నారు. మొదటగా తాప్సీ తన సోదరి, స్నేహితురాలితో కలిసి మాల్దీవులకు వెళ్లింది. అక్కడ తాప్సీ బికినీ అందాలతో అందరి మతులను పోగొట్టేసింది. అలా ఐదారు రోజులు అక్కడే ఎంజాయ్ చేశాక మళ్లీ తిరిగి షూటింగ్‌లతో బిజీ అయింది. ఆ తరువాత వరుసబెట్టి హీరోయిన్లందరూ మాల్దీవులకు చెక్కేశారు.

జంటలుగా వెళ్లి మరీ..
ఇక కొందరు హీరోయిన్లు ఒంటరిగా మాల్దీవుల్లో రచ్చ చేయగా.. ఇంకొందరు ఫ్యామిలీతో కలిసి రచ్చ చేశారు. అలా కాజల్ అగర్వాల్ తన భర్త గౌతమ్‌తో కలిసి హనీమూన్ కోసం మాల్దీవుల్లో రచ్చ చేసింది. భర్త బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసేందుకు సమంత చైతన్యలు మాల్దీవులకే చెక్కేశారు.

మాల్దీవులే కేరాఫ్ అడ్రస్..
ప్రణీత, రకుల్ ప్రీత్ వంటి హీరోయిన్లందరూ మాల్దీవుల్లోనే రచ్చ చేశారు. ప్రణీత ఒంటరిగా వెళ్తే.. రకుల్ మాత్రం తన ఫ్యామిలీతో వెళ్లింది. తన పేరెంట్స్ వివాహా వార్షికోత్సవాన్ని సెలెబ్రేట్ చేసేందుకు వెళ్లింది. అక్కడ ఫ్యామిలీ ఉన్నా కూడా రకుల్ మాత్రం బికినీ అందాలను ఓ లెవెల్‌లో ప్రదర్శించింది.

తాజాగా హన్సిక..
పూరి జగన్నాథ్ పరిచయం చేసిన అందాల్లో హన్సిక ఒకరు. దేశ ముదురు సినిమాలో కాశ్మీర్ యాపిల్‌లో మెరిసిపోవడంతో బాగానే క్లిక్ అయింది. కానీ తెలుగులో స్టార్డంను మాత్రం సంపాదించుకోలేకపోయింది. కోలీవుడ్‌లో మాత్రం హన్సిక బాగానే పాపులర్ అయింది. ఇప్పుడు హన్సిక చేతిలో అంతగా ఆఫర్స్ ఏమీ లేవు. అందుకే ఇలా సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.

మాల్దీవుల్లో అందాల ఆరబోత..
హన్సిక తాజాగా మాల్దీవుల్లో అందాలను విచ్చలవిడిగా ఆరబోస్తోంది. వీపు అందాలను తొడ అందాలను ప్రదర్శిస్తూ నెటిజన్లకు చుక్కలు చూపిస్తోంది. ప్రస్తుతం హన్సిక పెట్టిన మంటలు సోషల్ మీడియాలో ఇంకా రేగుతూనే ఉన్నాయి. హన్సిక ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.