twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Happy Birthday Mahesh Babu: బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన అసలైన సూపర్ స్టార్

    |

    టాలీవుడ్ సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో మహేష్ బాబు. సౌత్ లో దాదాపు 150కోట్ల మార్కెట్ ఉన్న హీరోల్లో మహేష్ ఒకడు. క్లాస్ గా కనిపించే ప్రిన్స్ చాలా తక్కువ కాలంలో మాస్ ఆడియెన్స్ లో భారీ క్రేజ్ అందుకున్నాడు. ఇక నేడు ఈ సూపర్ స్టార్ 45వ పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో విషెస్ అందిస్తున్నారు.

    పసి వయసులోనే..

    పసి వయసులోనే..

    ఘట్టమనేని కృష్ణ గారి వారసత్వం ద్వారా ఎంట్రీ ఇచ్చినప్పటికీ మహేష్ తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకొని మరో స్థాయికి చేరుకున్నారు. హీరోగా 26సినిమాలు చేసిన మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా 9సినిమాలు చేశాడు. పసి వయసులోనే బిగ్ స్క్రీన్ పై స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచి మూడు తరాల ఆడియెన్స్ ని మెప్పిస్తూ వస్తున్నాడు.

    ఇంకా పాతికేళ్ల కుర్రాడిలానే

    ఇంకా పాతికేళ్ల కుర్రాడిలానే

    ఇండియాలో ఉన్న మొత్తం హీరోలలో అత్యంత అందగాళ్ల లిస్ట్ తీస్తే అందులో మహేష్ టాప్ లో ఉంటాడు. చాలా సార్లు కొన్ని. మ్యాగజైన్ నివేధికాల్లో కూడా అభిమానులు మహేష్ ని ఎక్కువగా లైక్ చేస్తారని ఋజువయ్యింది. 45ఏళ్ళ వయసులో కూడా మహేష్ ఇంకా పాతికేళ్ల కుర్రాడిలానే కనిపిస్తున్నాడు. ఒక విధంగా వయసు పెరుగుతున్న కొద్దీ మహేష్ మరింత అందంగా తయారవుతున్నారు అనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి.

    ఒక్కడు సినిమా ద్వారా

    ఒక్కడు సినిమా ద్వారా

    1979లో మొదట నీడ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సూపర్ స్టార్ ఆ తరువాత 1999లో రాజకుమారుడు సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మొదట్లో ఐదేళ్ల వరకు పెద్దగా సక్సెస్ చూడని మహేష్ 2003లో ఒక్కడు సినిమా ద్వారా అసలైన బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు.

    రిస్క్ లేకుండా సేఫ్ జోన్ లో

    రిస్క్ లేకుండా సేఫ్ జోన్ లో

    ఆ తరువాత కొన్ని ప్రయోగాలు చేసిన ప్రిన్స్ ఆతడు, పోకిరి వంటి సినిమాలతో తన రేంజ్ ని మార్కెట్ ని మరింత పెంచుకున్నాడు. ఇక శ్రీమంతుడు సినిమాతో మరో లెవెల్ కి వెళ్లిన సూపర్ స్టార్ చాలా వరకు రిస్క్ లేకుండా సేఫ్ జోన్ లో బాక్సాఫీస్ హిట్స్ అందుకుంటూ వస్తున్నాడు.

    Recommended Video

    #SarkaruVaariPaata: Kichcha Sudeep To Play Key Role In Mahesh Babu's Movie | Filmibeat Telugu
    బర్త్ డే వేడుకలకు దూరంగా ఉండాలని

    బర్త్ డే వేడుకలకు దూరంగా ఉండాలని

    ప్రస్తుతం సోషల్ మీడియాలో మహేష్ కి భారీ స్థాయిలో విషెస్ అందుతున్నాయి. అభిమానులు హ్యాపీ బర్త్ డే విషెస్ తో ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. ఇక మహేష్ అభిమానులకు ఇటీవల ఒక రిక్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా ఎక్కువగా సామూహికంగా అభిమానులు తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవద్దని కొరారు. ఇక ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట సినిమాతో రెడీ అవుతున్న విషయం తెలిసిందే.

    English summary
    In the Tollywood industry, everyone is talking about the first look of Mahesh Babu's new film. Sarkaru vaari paata along with their title, Mahesh Babu's new look has also increased the dose of anticipation in the film. If not, there are many rumors of ruminations on this film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X