HBD Amitabh Bachchan ఆ స్టార్ హీరోయిన్‌తో అమితాబ్ బ్రేకప్.. జయబాధురితో పెళ్లి ఎలా జరిగిందంటే?
యాంగ్రీ యంగ్ మ్యాన్ పాత్రలతో బాలీవుడ్‌లో సూపర్ స్టార్ స్థాయికి అమితాబ్ బచ్చన్ ఎదిగాడు. హీరో మెటీరియల్ కాదు అంటూ అవమానాలు ఎదుర్కొన్న అమితాబ్.. ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టించే హీరోగా తన స్టామినాను క్రియేట్ చేసుకొన్నాడు. కేవలం థియేటర్‌కు రప్పించడమే కాకుండా.. బుల్లితెరపై కేబీసీ షోతో ప్రేక్షకులను ఇంటికి పరుగులు పెట్టించి టీవీలకు అత్తుకుపోయేలా చేసిన ఘనత అమితాబ్‌కే దక్కుతుంది. 6 దశాబ్దాల కెరీర్‌కుపైగా ఎన్నో మైలు రాళ్లను అధిగమించాడు. ఆయన జీవితంలో ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకొన్నాయి. అమితాబ్ బచ్చన్ జన్మదినం అక్టోబర్ 11. ఈ సందర్బంగా ఆయన జీవితంలో చోటుచేసుకొన్న కొన్ని సంఘటనల వివరాల్లోకి వెళితే..
రాజేశ్ ఖాన్నా, ధర్మేంద్ర, సునీల్ దత్ లాంటి హీరోలు స్టార్లుగా బాలీవుడ్‌లో రాణిస్తున్న సమయంలో అమితాబ్ బచ్చన్ ఎంట్రీ ఇచ్చారు. జంజీర్, దీవార్, అభిమాన్, సిల్ సిలా లాంటి సినిమాలతో ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకొన్నాడు. హమ్, ఆఖరీరాస్తా, కూలీ, నమక్ హలాల్ లాంటి సినిమాలతో సూపర్ స్టార్‌గా మారారు. ఇప్పటికీ తన ఇమేజ్‌కు తగిన పాత్రలతో మెప్పిస్తున్నారు.

బుల్లితెరపైన కూడా అమితాబ్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. కౌన్ బనేగా కరోడ్ పతి (KBC) రియాలిటీ షోతో కోట్లాది మంది బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యారు. ఇప్పటికే ఎన్నో సీజన్లకు హోస్ట్‌గా ఉంటూ కేబీసీతో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నారు. కేబీసీ చరిత్రలో ఎన్నో అనుభూతులను పంచుకొంటున్నారు.

అమితాబ్ జీవితంలో ప్రేమ, పెళ్లి వ్యవహారాలు కూడా మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. 70, 80వ దశకంలో అమితాబ్, రేఖ ప్రేమాయణం గురించి కథలు కథలుగా చెప్పుకొంటారు. సిల్ సిలా అనే సినిమా షూటింగులో అమితాబ్, రేఖ మధ్య ప్రేమ చిగురించింది. అప్పట్లో వారిద్దరి ప్రేమకథలు మీడియాలో ప్రముఖంగా వచ్చేవి.
అమితాబ్, రేఖ మధ్య మధ్య అఫైర్ చాలా క్రేజీగా మారింది. వారిద్దరూ పెళ్లి చేసుకోవడం గ్యారెంటీ అనుకొనే సమయంలో అనూహ్యంగా తన తోటి నటి జయబాధురిని పెళ్లి చేసుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. సిల్ సిలా సమయంలో జయ బాధురితో ప్రేమ పెళ్లి వరకు తీసుకెళ్లింది. అమితాబ్, రేఖ బ్రేకప్ ఇప్పటికీ ఓ మిస్టరీ అని చెప్పుకోవచ్చు. అమితాబ్ తన అఫైర్ గురించి ఎన్నడూ బయటకు చెప్పలేదు. కానీ రేఖ మాత్రం తన మనసులోని మాటను మీడియాలో బహిరంగంగా చెప్పింది.
అమితాబ్‌తో తన అఫైర్ గురించి రేఖ ఓ సమయంలో స్పందిస్తూ.. బిగ్ బీ అంటే నాకు చెప్పలేనంత ఇష్టం. ఆయనతో నా బంధం ప్రత్యేకమైనది. నా జీవితంలో అమితాబ్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన నాకు టీచర్, నాకు గురువు లాంటి వారు. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ అనే తేడా లేకుండా ఆయన నుంచి చాలా నేర్చుకొన్నాను అని రేఖ చెప్పింది.

అమితాబ్‌తో బ్రేకప్ తర్వాత ముఖేష్ అగర్వాల్ అనే వ్యాపార వేత్తను పెళ్లి చేసుకొన్నది. అయన అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రేఖ ఒంటరిగానే జీవితాన్ని గడుపుతున్నది. అమితాబ్‌తో ఆమె రిలేషన్‌షిప్ మాత్రం సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతున్నది.


Click it and Unblock the Notifications











