Don't Miss!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
Happy Birthday Sonu Sood: ఇక నుంచి విలన్ వేషాలు వేస్తే అభిమానులు ఒప్పుకోరేమో?
ఇండియన్ రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సోనూ సూద్ బర్త్ డే రానే వచ్చింది. జులై 30న సోనూ 47వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ ఒక రేంజ్ లో వెలువడుతున్నాయి. సోనూ సూద్ అంటే ఇప్పుడు విలన్ పాత్రలు చేసే నటుడు కాదు. నిజజీవితంలో సహాయం చేసే నిజమైన హీరో. ఇక నుంచి అతను సినిమాల్లో విలన్ వేషాలు వేస్తే అభిమానులు ఒప్పుకోరేమో అనిపిస్తోంది. అంతలా క్రేజ్ అందుకున్నాడు.
కేవలం మూడు నెలల్లోనే
కేవలం మూడు నెలల్లోనే సోనూ సూద్ అంటే ఏమిటో జనాలకు పూర్తిగా అర్ధమైపోయింది. అతను చేసిన మంచి పనులే నేడు ఒక హీరో అనే బ్రాండ్ ని తెచ్చిపెట్టింది. గతంలో ఎప్పుడు లేనంతగా సోనూ సూద్ పై ప్రశంసలు జల్లులు కురుస్తున్నాయి. 1999లో తమిళ్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు అతి తక్కువ కాలంలోనే తెలుగు హిందీ భాషల్లో కూడా బిజీ అయ్యారు.
ఆ బిజినెస్ లో మంచి లాభాలు
తెలుగులో సూపర్, ఏక్ నిరంజన్, అరుంధతి వంటి సినిమాలతో భారీ క్రేజ్ అందుకున్నాడు. హిందీలో దబాంగ్ సినిమా కూడా అతనిని మరింత బిజీగా మార్చింది. ఇక తన సేవింగ్స్ తో ముంబైలోనే హోటల్స్ ని నిర్మించుకున్న సోనూ ఆ బిజినెస్ లో మంచి లాభాలను అందుకున్నాడు. అతని ఆస్తి విలువ దాదాపు 100కోట్లకు పైగానే ఉంటుందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ప్రతి ఒక్కరి మనుసును తాకింది.
లాక్ డౌన్ కాలంలో సోనూ సూద్ చేసిన సహాయం ప్రతి ఒక్కరి మనుసును తాకింది. సొంత గూటికి చేరుకోవాలని రోడ్డు బాట పట్టిన ఎంతో మందికి వోల్వో బస్సులను ఏర్పాటు చేసి సొంత ఇళ్లకు చేర్చారు. అలాగే కొందరికి స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్ లను కూడా ఏర్పాటు చేశారు. పేదలకు ఆర్థిక సహాయం అందించడానికి కూడా వెనుకడుగు వేయలేదు.
లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి..
రీసెంగ్ గా ఆంద్రప్రదేశ్ లో రైతు కష్టాన్ని చూసి ఒక స్పెషల్ ట్రాక్టర్ ని పంపించిన విషయం తెలిసిందే. ఇలా అన్ని విధాలుగా సహాయం అందిస్తున్న సోనూ సూద్ లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి సమాజ సేవ కోసం దాదాపు రూ.10కోట్లకు పైగానే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ విధంగా ఎన్నో మంచి పనులతో గుర్తింపు తెచ్చుకున్న సోనూ సూద్ ఇలానే కొనసాగాలని అభిమానులు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తున్నారు.
ఉద్యోగ కల్పన..
వలస కార్మికులకే కాకుండా నిరుద్యోగులకు కూడా సోనుసూద్ అండగా నిలస్తున్నారు. వలస కార్మికులను స్వగృహాలకు పంపడంతో సోనూ సూద్ చేతులు దులుపుకోలేదు. ఉపాధి కోల్పోయిన ప్రతీ ఒక్కరికీ ఉద్యోగ కల్పనే ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేశాడు. ప్రవాసి రోజ్‌గార్ యాప్ ద్వారా దాదాపు రెండు మిలియన్ల మందికి ఉపాధిని కల్పించాలని ఆశిస్తున్నాడు.