#HBD Chiranjeevi పునాదిరాళ్ల నుంచి సైరా వరకు.. మాస్‌కే బాస్‌గా మెగాస్టార్

సాధారణ జీవితం నుంచి అసాధారణంగా ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన స్టార్ ఎవరంటే వచ్చే సమాధానం కొణిదెల చిరంజీవి. స్వయంకృషితో ఎదిగిన అసామాన్యమైన నటుడు మెగాస్టార్ జన్మదినం అంటే అభిమానులకే కాదు.. సినీ స్టార్లకు కూడా గొప్ప పండగే. ఆగస్టు 22 తేదీన జన్మదినాన్ని పురస్కరించుకొని మెగాస్టార్ చిరంజీవికి తెలుగు ఫిల్మీబీట్ శుభాకాంక్షలు అందజేస్తూ..

సామాన్య కుటుంబంలో జన్మించి

సామాన్య కుటుంబంలో జన్మించి

కొణిదెల శివ శంకర వర ప్రసాద్‌గా 1955లో ఆగస్టు 22వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో అంజనాదేవి, వెంకట్ రావు దంపతులకు జన్మించారు. ఆయనకు నాగబాబు, పవన్ కల్యాణ్ సోదరులు, ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. చిరంజీవి వివాహం 1980లో ఫిబ్రవరి 20 తేదీన అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో జరిగింది. చిరంజీవి, సురేఖ దంపతులకు సుస్మిత, శ్రీజా, రాంచరణ్ సంతానం ఉన్నారు.

చిన్నస్థాయి నుంచి మెగాస్టార్ వరకు

చిన్నస్థాయి నుంచి మెగాస్టార్ వరకు

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ పునాదిరాళ్లుతో ప్రారంభమై.. ప్రాణం ఖరీదు, మనవూరి పాండవులు చిత్రాలతో గుర్తింపు పొందారు. ఖైదీ చిత్రంతో స్టార్ స్టేటస్‌ను సంపాదించుకొన్న తర్వాత చిరంజీవి కెరీర్‌కు ఎదురులేకుండా పోయింది. సంఘర్షణ, దొంగ, జ్వాలా, అడవిదొంగ, కొండవీటి రాజా, రాక్షసుడు, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, యముడికి మొగుడు, దొంగమొగుడు, స్వయం కృషి, రుద్రవీణ, జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి చిత్రాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకొన్నారు.

ప్రజారాజ్యంతో రాజకీయాల్లోకి

ప్రజారాజ్యంతో రాజకీయాల్లోకి

శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి బ్లాక్‌బస్టర్లను తన ఖాతాలో వేసుకొని దక్షిణాదిలో తిరుగులేని నటుడిగా క్రేజ్‌ను సంపాదించుకొన్న తరుణంలో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి వెళ్లారు. ఆ సమయంలో గంజీ స్థాయి నుంచి బెంజ్ స్థాయి వరకు ఎదిగిన తనకు ప్రజల కష్టాలు తెలుసు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వంలో పర్యాటక శాఖా మంత్రిగా సేవలందించారు.

స్వచ్చంద సేవలో

స్వచ్చంద సేవలో

సినీ, రాజకీయ రంగాల్లోనే కాకుండా చిరంజీవి సామాజిక సేవలో నిమగ్నమయ్యారు. రక్తదానం, నేత్రదానం లాంటి కార్యక్రమంలో స్వచ్ఛంద సేవకు అంకితమయ్యారు. సినిమా ఇండస్ట్రీలో సమస్యల పరిష్కారంలో పరిశ్రమ పెద్దగా ముందుకెళ్తున్నారు. రాజకీయాల్లో నుంచి మళ్లీ సినీ రంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చి ఖైదీ నంబర్ 150తో భారీ కలెక్షన్లతో రికార్డు తిరగరాశారు.

Recommended Video

Pawan Kalyan, Chiranjeevi, Bandla Ganesh Green India Challenge
ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా

ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా

ప్రస్తుతం ఆచార్య చిత్రంలో కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్ సమయంలో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌తో కరోనా క్రైసిస్ ఛారిటీతో సినీ కార్మికులు, జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకొనే ప్రయత్నాలు చేపట్టి సఫలమయ్యారు. సినీ, రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో సేవాలందిస్తున్న చిరంజీవి మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఫిల్మ్ బీట్ తెలుగు కోరుకొంటున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X