twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Happy Birthday Chiranjeevi: చిరంజీవి డైరెక్ట్ చేసిన ఏకైక సినిమా.. ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్

    |

    మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు రాష్ట్రాల్లో అస్సలు పరిచయం అవసరం లేని పేరిది. అంతలా ఈయన దాదాపు నాలుగు దశాబ్దాలుగా సినీ రంగంలో హవాను చూపిస్తూ దూసుకుపోతున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి బడా హీరోలు సత్తా చాటుతోన్న సమయంలోనే.. ఏమాత్రం బ్యాగ్రౌండ్‌ లేకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరో అయిపోయారు చిరు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తున్నారు. సుదీర్ఘమైన కెరీర్‌లో దాదాపు 150 సినిమాల్లో ఎన్నో రకాల పాత్రల్లో నటించి మెప్పించి అసలైన మెగాస్టార్ అనిపించుకుంటున్నారు. ఇన్నేళ్ల ప్రయాణంలో మెగాస్టార్ చిరంజీవి ఒకే ఒక్క సినిమాకు దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. ఇంతకీ ఏంటా సినిమా? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ అందరి కోసం!

    ‘పునాది’ పడింది.. ఖైదీగా మారిపోయారు

    ‘పునాది’ పడింది.. ఖైదీగా మారిపోయారు

    1978లో వచ్చిన 'పునాదిరాళ్లు' సినిమాతో మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు దక్కలేదు. అయితే, 1983లో కోదండరామ్‌ దర్శకత్వంలో వచ్చిన 'ఖైదీ' అనే సినిమా.. చిరంజీవిని కెరీర్‌ను మార్చేసింది. ఇందులో ఆయన నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అప్పట్లోనే ఈ సినిమాతో 4 కోట్లకు పైగా వసూలు చేసి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఈ మూవీతోనే చిరంజీవికి స్టార్ స్టేటస్ కూడా దక్కడంతో పాటు సినీ ప్రియులందరి హృదయాల్లో ఖైదీగా మారిపోయారాయన.

    టాప్‌ను కిందకు జరిపి షాకిచ్చిన భూమిక: మరీ ఇంత ఘాటుగానా.. ఆమెనిలా చేస్తే తట్టుకోలేరు!టాప్‌ను కిందకు జరిపి షాకిచ్చిన భూమిక: మరీ ఇంత ఘాటుగానా.. ఆమెనిలా చేస్తే తట్టుకోలేరు!

    ఏదైనా సునాయాసంగా.. ఇప్పటికీ గ్రేస్‌గా

    ఏదైనా సునాయాసంగా.. ఇప్పటికీ గ్రేస్‌గా

    నలభై ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా వెలుగొందడం అంటే సాధారణమైన విషయం కాదు. అందుకు మెగాస్టార్ చిరంజీవి అన్ని విధాల అర్హతలు కలిగి ఉన్నారన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాక్టింగ్, డైలాగ్స్, డ్యాన్స్, గ్రేస్, ఫైట్స్, పాటలు ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ ఆల్‌రౌండర్ అనిపించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా బ్రేక్ డ్యాన్స్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసింది ఆయన అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. 'ఇంద్ర' సినిమాలో చిరంజీవి వేసిన వీణ స్టెప్ ఇప్పటికీ ఎవర్‌గ్రీనే. ఆరు పదుల వయసులోనూ ఆయనలో గ్రేస్ ఏమాత్రం తగ్గలేదు.

    అలా రీఎంట్రీ.. ఫుల్ జోష్‌తో మూవీలు

    అలా రీఎంట్రీ.. ఫుల్ జోష్‌తో మూవీలు

    చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. 'ఖైదీ నెంబర్ 150'తో రీఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో చిరు నటన, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ ఆకట్టుకున్నాయి. ఈ ఉత్సాహంతోనే ఆ వెంటనే 'సైరా: నరసింహారెడ్డి' అనే సినిమాను చేశారు. ఇది అంతగా ఆకట్టుకోలేదు. కానీ, ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే కొరటాలతో 'ఆచార్య' అనే మూవీని పూర్తి చేసిన ఆయన.. ప్రస్తుతం మోహన్ రాజాతో 'గాడ్ ఫాదర్', మెహర్ రమేష్‌తో 'భోళా శంకర్', బాబీతో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. వీటికి సంబంధించిన అప్‌డేట్స్ వస్తున్నాయి.

    బోల్డు షోతో రెచ్చిపోయిన అనుపమ పరమేశ్వరన్: అలా తీసిన ఫొటోలో అందాల అరబోతబోల్డు షోతో రెచ్చిపోయిన అనుపమ పరమేశ్వరన్: అలా తీసిన ఫొటోలో అందాల అరబోత

    ఆ రెండు తప్ప.. జోక్యం చేసుకోరని పేరు

    ఆ రెండు తప్ప.. జోక్యం చేసుకోరని పేరు

    ఆరు పదుల వయసు.. నాలుగు దశాబ్దాల సినీ అనుభవం మెగాస్టార్ చిరంజీవి సొంతం. అన్ని కలల గురించి తెలిసిన ఈ హీరో.. ఇప్పటి వరకూ దర్శకుల విషయంలో జోక్యం చేసుకున్నారన్న పేరును మాత్రం తెచ్చుకోలేదు. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎంతో మంది సీనియర్లు, జూనియర్ డైరెక్టర్లతో పని చేసిన ఈ స్టార్ హీరో.. కేవలం డ్యాన్స్, ఫైట్స్ విషయాల్లోనే జోక్యం చేసుకుంటారని అంటుంటారు. అలాగే, ఆ రెండు తప్ప మిగిలిన ఏ అంశాలను కూడా పట్టించుకోరని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అందుకే చిరంజీవిని దర్శకుల హీరో అని కూడా పిలుస్తుంటారన్న విషయం తెలిసిందే.

    ఆ ఒక్క సినిమాకు దర్శకుడిగా పని చేసి

    ఆ ఒక్క సినిమాకు దర్శకుడిగా పని చేసి

    సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో ఎంతో అనుభవాన్ని సంపాదించుకున్న చిరంజీవి.. ఏనాడూ దర్శకత్వం వైపు చూడలేదు. అసలు సినిమాను తెరకెక్కించే ఉద్దేశ్యమే తనకు లేదని చాలా సందర్భాల్లో చెప్పారు. అందుకు అనుగుణంగానే ఇప్పటి వరకూ అలాంటి ఆలోచనే చేయలేదు. కానీ, తన సినీ కెరీర్‌లో ఒకే ఒక్క సినిమాకు మాత్రం చిరంజీవి దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. అది ఆయన కెరీర్‌లోనే బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రం. అదేంటంటే చిరంజీవికి మాస్ ఇమేజ్‌ను తెచ్చి పెట్టడంలో ఎంతగానో ఉపయోగపడిన 'గ్యాంగ్ లీడర్' మూవీ. అవును దీన్నే ఆయన తెరకెక్కించారు.

    ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న రాశీ ఖన్నా హాట్ సెల్ఫీ: గతంలో చూడని విధంగా అందాల ఆరబోతఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న రాశీ ఖన్నా హాట్ సెల్ఫీ: గతంలో చూడని విధంగా అందాల ఆరబోత

    సగం సగం పంచుకున్నట్లుగా మార్చేసి

    సగం సగం పంచుకున్నట్లుగా మార్చేసి

    'గ్యాంగ్' లీడర్ సినిమాకు విజయ బాపినీడు దర్శకత్వం వహించారు. ఈ విషయాన్ని ఆ సినిమాలో నటించిన నారాయణరావు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ''గ్యాంగ్‌ లీడర్‌' సినిమా దాదాపు 40 శాతం చిరంజీవి రీషూట్‌ చేశారు. మురళీమోహన్‌ను హత్య చేసే సన్నివేశం, ఆయన స్నేహితులమైన మమ్మల్ని వెంటాడి చంపే సీన్లు అవన్నీ తీశారు. అప్పటి వరకూ ఆయన గొప్ప నటుడు అని మాత్రమే నాకు తెలుసు. కానీ, అది చూసిన తర్వాత ఆయనలో ఓ గొప్ప దర్శకుడు కూడా ఉన్నాడని అర్థమైంది. ఈ విషయం ఎక్కడా ఎవరికీ చెప్పుకోలేదు' అని ఆయన చెప్పుకొచ్చారు.

    Recommended Video

    Brandy Diaries ఫ్రెండ్షిప్ కి నిదర్శనం.. క్రౌడ్ ఫండెడ్ మూవీ - Director Sividu
    చిరంజీవికి ఎన్నోసార్లు.. కానీ చేయలేదు

    చిరంజీవికి ఎన్నోసార్లు.. కానీ చేయలేదు

    మెగాస్టార్ చిరంజీవికి తన సినీ ప్రయాణంలో ఎన్నో సార్లు దర్శకత్వం వహించే అవకాశాలు దక్కాయి. కానీ, ఏనాడూ ఆయన మెగా ఫోన్ పట్టుకోలేదు. 'గ్యాంగ్ లీడర్‌'కు మాత్రం తప్పని సరి పరిస్థితుల్లో దర్వకత్వం వహించారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇది కలెక్షన్లకు కలెక్షన్లు రాబట్టి అప్పట్లో సంచలనం అయిపోయింది. అంతటి నైపుణ్యం ఉన్నా చిరంజీవి ఎందుకనో దర్శకత్వం చేయలేదు. ఈ విషయంలో మాత్రమే ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు. మరోసారి ఫిల్మీబీట్ తరపున మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

    English summary
    Tollywood Senior Hero Megastar Chiranjeevi Birthday Today. On The Occasion of His Birthday.. Let we Know Which Movie Directed in his Career.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X