For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  HBDAmeeshaPatel: గ్లామర్ షోలో అమీషాను మించినోళ్లే లేరు.. లేటు వయసులోనూ ఘాటు ఫొటోలతో రచ్చ

  |

  సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ.. చాలా తక్కువ సమయంలోనే ఊహించని ఎత్తుకు ఎదిగిన వారిలో అమీషా పటేల్ ఒకరు. దాదాపు రెండు దశాబ్దాలుగా వెండితెరపై సందడి చేస్తోన్న ఈ భామ.. ఎన్నో చిత్రాల్లో ఆకట్టుకునే అందంతో పాటు అద్భుతమైన నటనతో మెస్మరైజ్ చేసింది. అదే సమయంలో వరుసగా ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటింది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. అందులో మాత్రం ఈ అమ్మడు అందాలు ఆరబోస్తూనే ఉంది. ఇక, ఈరోజు అమీషా పటేల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె గురించి స్పెషల్ ఆర్టికల్ మీకోసం!

  Recommended Video

  Akatayi Movie Press Meet | Mani sharma | ameesha patel | Telugu Filmibeat

  పొట్టి నిక్కరులో కనువిందు చేస్తోన్న పార్వతి నాయర్

  అలా మొదలైన కెరీర్... ఇలా ఎంట్రీ

  అలా మొదలైన కెరీర్... ఇలా ఎంట్రీ

  సినిమా నటి అవ్వాలన్న లక్ష్యంతో మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది అమీషా పటేల్. ఈ క్రమంలోనే ఎన్నో ఈవెంట్లలో క్యాట్ వాక్ చేసింది. అలా కొన్ని అందాల పోటీల్లో సైతం పాల్గొంది. అంతేకాదు, కొన్ని వ్యాపార ప్రకటనల్లో సైతం నటించింది. ఇలా ఫుల్ ఫేమస్ అయిన ఈ బ్యూటీ.. 'కహో నా ప్యార్ హై' అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది.

  పవన్ సినిమాతో టాలీవుడ్ ప్రవేశం

  పవన్ సినిమాతో టాలీవుడ్ ప్రవేశం

  బాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగు పెట్టిన ఏడాదే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'బద్రీ' అనే సినిమాతో అమీషా పటేల్ టాలీవుడ్‌లోకి ప్రవేశించింది. పూరీ జగన్నాథ్ రూపొందించిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు అమీషాకు మంచి పేరును తెచ్చింది. మొదటి సినిమాతోనే అద్భుతమై యాక్టింగ్‌తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. అప్పట్లో కుర్రాళ్లకు క్రష్ అయిపోయింది.

  ఇక్కడ నిరాశ... అందుకే దూరంగా

  ఇక్కడ నిరాశ... అందుకే దూరంగా

  'బద్రీ' తర్వాత అమీషా పటేల్ మహేశ్ బాబుతో 'నాని', జూనియర్ ఎన్టీఆర్‌తో 'నరసింహుడు', నందమూరి బాలక‌ృష్ణతో 'పరమ వీర చక్ర' వంటి సినిమాల్లో నటించింది. కానీ, ఇవన్నీ బాక్సాఫీస్ ముందు దారుణమైన పరాజయాలను చవి చూశాయి. దీంతో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఈ అమ్మడు దూరమైపోయింది. ఇక, చాలా గ్యాప్ తర్వాత 'ఆకతాయి' అనే సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది.

  అతడితో లవ్.. ఐదేళ్ల తర్వాత బ్రేక్

  అతడితో లవ్.. ఐదేళ్ల తర్వాత బ్రేక్

  ఇతర భాషల్లో వేగం తగ్గించినా.. బాలీవుడ్‌లో మాత్రం వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్లింది అమీషా పటేల్. ఈ క్రమంలోనే 'ఆప్ ముజే అచ్చే లంగే లగే' అనే సినిమా చేసిన సమయంలో దర్శకుడు విక్రమ్ భట్‌తో ప్రేమలో పడింది. అప్పటి నుంచి అతడితో దాదాపు ఐదేళ్ల పాటు డేటింగ్ చేసింది. కొద్ది రోజుల్లో పెళ్లి చేసుకుంటారు అన్న సమయంలో ఆ ఫిల్మ్ మేకర్‌కు బ్రేకప్ చెప్పేసింది.

   అందులో మాత్రం ఎప్పుడూ బిజీనే

  అందులో మాత్రం ఎప్పుడూ బిజీనే

  అప్పట్లో వరుస సినిమాలతో హవా చూపించిన అమీషా పటేల్.. సోషల్ మీడియాలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. అందులో ఆమెకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. దీంతో ఆమె దాదాపు అన్ని సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు తెరిచేసింది. అదే సమయంలో స్పెషల్ యాప్‌ను కూడా ఏర్పాటు చేసుకుంది. వీటి ద్వారా తన ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లో ఉంటూ హల్‌చల్ చేస్తోందీ బ్యూటీ.

   అందాల విందు చేస్తోన్న హీరోయిన్

  అందాల విందు చేస్తోన్న హీరోయిన్

  సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అమీషా పటేల్.. తన అందాలతో కుర్రాళ్ల మతి పోగొడుతోంది. సినిమాల్లో సంప్రదాయంగా కనిపించిన ఈ భామ.. ఇందులో మాత్రం అందాల విందు చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తద్వారా ఫాలోవర్ల సంఖ్యను గణనీయంగా పెంచుకుంటోంది. అదే సమయంలో ట్రెండ్ అవుతోంది.

  లేటు వయసులో ఘాటు ఫొటోలతో

  లేటు వయసులో ఘాటు ఫొటోలతో

  అమీషా పటేల్‌కు ఇప్పుడు 45 ఏళ్లు. లేటు వయసులోనూ ఈ అమ్మడు ఘాటు అందాలతో రెచ్చగొడుతోంది. నిత్యం హాట్ హాట్ ఫొటోలు, వీడియోలనే వదులుతూ.. గ్లామర్ షోలో తనను మించిన వారు లేరు అన్నట్లు రచ్చ చేస్తోంది. ఫలితంగా అమీషా పటేల్ షేర్ చేసే ఫొటోలకు విపరీతమైన స్పందన వస్తోంది. దీంతో ఆమె ఏది వదిలినా ఇట్టే వైరల్ అవుతోంది. ఇక, ఈ బ్యూటీ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటోంది తెలుగు ఫిల్మీబీట్.

  English summary
  Tollywood actress and a former model Ameesha Patel Birthday Today. On The Occasion of Her Birthday.. We Shared Some Best Moments of Ameesha Career.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X