twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Happy Birthday Kartikeya: నటనలో ఆల్ రౌండర్.. భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు

    |

    ఒక హీరోగా సక్సెస్ కావడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టమైన పని. ఇక సక్సెస్ వచ్చిన తరువాత మళ్ళీ ఆడియెన్స్ అంచనాలను అందుకోవడం అంటే మరింత కష్టమైన పని. అయితే ముందుగా ఆడియెన్స్ కి ఒక మంచి నటుడిగా దగ్గరైతే చాలు ఆ తరువాత వాళ్లే సపోర్ట్ చేస్తారనే ఫార్ములా చాలా తక్కువ మంది ఫాలో అవుతారు. అలాంటి వారిలో కార్తికేయ ఒకడు. ఈ రోజు ఈ టాలెంటేడ్ యాక్టర్ పుట్టినరోజు.

    నాగార్జున గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ వారసుడు అయినప్పటికీ కార్తికేయ హైదరాబాద్ గల్లీలో ఒక సాధారణ యువకుడిలానే తన లైఫ్ ని ఎంజాయ్ చేశాడు. వరంగల్ ఏన్ఐటిలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత పూర్తిగా తనకు ఇష్టమైన నటనపై దృష్టి పెట్టాడు. కష్టపడి వర్కౌట్స్ చేసి డ్యాన్స్ నేర్చుకొని మొదట చిన్న చిన్న అవకాశాల కోసం కూడా బాగానే ట్రై చేశాడు.

    happy birthday kartikeya gummakonda a perfect all rounder

    ప్రేమతో మీ కార్తీక్ అనే సినిమాతో నటుడిగా పరిచయమైన ఈ హీరో అప్పుడు అనుకున్నంతగా క్రేజ్ అయితే అందుకోలేదు. ఇక RGV శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో RX100 సినిమాను సొంత ప్రొడక్షన్ లోనే నిర్మించుకున్న కార్తికేయ పవర్ఫుల్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమాతోనే అగ్ర దర్శకులను ఆకర్షించారు. హిప్పీ, గుణ 369, 90ML వంటి సినిమాలతో ఆడియెన్స్ కి మరింత దగ్గరయ్యాడు.

    ఇక ఆర్ఎక్స్100 సినిమాలో అతని నటనకు దర్శకుడు విక్రమ్ కుమార్ ఎట్రాక్ట్ అయ్యి నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ ఆఫర్ చేశాడు. నటనకు ఎక్కువగా స్కోప్ ఉన్న క్యారెక్టర్ కావడంతో కార్తికేయ ఆ పాత్రకు సరైన న్యాయం చేశాడు. మొత్తానికి సక్సెస్ ఫుల్ యాక్టర్ గా దూసుకుపోతున్న ఈ హీరోకు సోషల్ మీడియాలో బర్త్ విషెస్ భారిగానే అందుతున్నాయి. ఇక నెక్స్ట్ చావు కబురు చల్లగా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అలాగే తమిళ్ లో కూడా ఒక సినిమా చేస్తున్నాడు.

    English summary
    Hero Karthikeya ABout Chaavu Kaburu Challaga Shooting, Chala Rojul tarvatha shoot start avthundi so konchm camera Alavatu avvalani.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X