twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వైరల్ పిక్స్ : కృష్ణవంశీ బర్త్ డే సెలెబ్రేషన్స్.. భర్తతో రమ్యకృష్ణ ఫుల్ ఎంజాయ్

    |

    స్టార్ సెలెబ్రిటీ కపుల్స్‌లో రమ్యకృష్ణ-కృష్ణవంశీలది ప్రత్యేకమైన జంట. దర్శకుడు-హీరోయిన్‌ల కేటగిరీలో వీరెప్పటికీ స్పెషల్. వీరి ప్రేమ కథ కూడా ఎంతో చక్కగా ఉంటుంది. అయితే తెరపై కృష్ణవంశీ చూపించే భావాలే ఇంట్లోనూ ఉంటాయని, కుటుంబాలను గౌరవించడం, భార్యగా తనకు స్వాతంత్ర్యం ఇస్తారని రమ్యకృష్ణ తన భర్త గురించి ఎంతో గొప్పగా చెప్పుకొంటూ ఉంటుంది. నేడు (జూలై 28) కృష్ణ వంశీ బర్త్ డే. ఈ సందర్భంగా టాలీవుడ్, కోలీవుడ్ అంతా కృష్ణవంశీకి బర్త్ డే విషెస్ చెబుతున్నారు.

    విషెస్‌ల వెల్లువ..

    విషెస్‌ల వెల్లువ..

    సోషల్ మీడియాలో కృష్ణవంశీకి విషెస్‌లు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ సెలెబ్రిటీలందరూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుతున్నారు. నటుడు బ్రహ్మాజీ.. నా కృష్ణ వంశీ అంటూ ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నాడు. మంచు మనోజ్ సైతం దర్శకుడిపై ఉన్న ప్రేమను విషెస్ రూపంలో తెలిపాడు.

    ఇంట్లో సందడి..

    ఇంట్లో సందడి..

    కృష్ణవంశీ బర్త్ డే సందర్భంగా ఇంట్లో ఫుల్ సందడి నెలకొన్నట్టు కనిపిస్తోంది. భార్య రమ్యకృష్ణ దగ్గరుండి మీర సెలెబ్రేషన్స్ గ్రాండ్‌గా నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు రమ్యకృష్ణ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

    భర్తతో ఎంజాయ్..

    భర్తతో ఎంజాయ్..

    కృష్ణ వంశీ బర్త్ డే సందర్భంగా..రమ్యకృష్ణ కేక్ కట్ చేయించినట్టు తెలుస్తోంది. ఇక కేక్ మొత్తాన్ని తన భర్త మొహానికి పుసినట్టు తెలుస్తోంది. చేసేదేమీ లేక భార్యకు లొంగిపోయి.. మొహం నిండా కేకును పూయించుకున్నట్టున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

    Recommended Video

    Aha Originals : Bhanumathi Rama Krishna Teaser | ఆహాలో ‘భానుమతి రామకృష్ణ'
    ఎమోషనల్ పోస్ట్..

    ఎమోషనల్ పోస్ట్..

    సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న రమ్యకృష్ణ గత కొన్ని రోజులుగా వరుసగా పోస్ట్‌లు చేస్తూనే ఉంది. పాత ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. నేడు భర్త బర్త్ డే సందర్భంగా షేర్ చేసిన ఫోటోలు, చేసిన కామెంట్ తెగ హల్చల్ చేస్తోంది. ‘సంతోషం, బాధ, కుటుంబం, గొడవలు, నా మొహంపై మొటిమ, నా ప్రతీ విషయంలో నీ వల్లే పరిపూర్ణత వచ్చింది. అంతా నీవల్లే.. హ్యాపీ బర్త్ డే'.. కృష్ణవంశీ, బర్త్ డే, భార్యాభర్తలు అంటూ హ్యాష్ ట్యాగ్‌లతో రచ్చ చేస్తోంది.

    English summary
    Happy Birthday KRishna Vamsi Ramya Krishnan Celebrated Grandly. Joy, pain, family, fight....the pimple on my cheek and the yin to my yang...that's about as mushy as I can get
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X