Happy Birthday Maniratnam: ముగ్గురు స్టార్ హీరోలతో మెగా ప్రాజెక్ట్.. అగ్రదర్శకుడికి విషెస్ వెల్లువ
ఇండియన్ ఆల్ టైమ్ బెస్ట్ డైరెక్టర్ గా ఒకానొక దశలో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మణిరత్నం. ప్రయోగాత్మక కథలతో కమర్షియల్ ప్రయోగాలు చేసి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. జీవితంలో ఒక్కసారైనా మణిరత్నంతో వర్క్ చేస్తే చాలు అనుకునే నటీనటులు చాలా మంది ఉన్నారు. ఇకపోతే నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా మణిరత్నంపై అనేక కథనాలు వెలువడుతున్నాయి..

ఆల్ టైమ్ బెస్ట్ డైరెక్టర్..
నేడు మణిరత్నం 64వ పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన అభిమానులు విషెస్ అందిస్తున్నారు. స్టార్ సెలబ్రెటీస్ సిమ్రాన్, అరుణ్ విజయ్, విక్రమ్ ప్రభు లాంటి ప్రముఖులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు అందజేశారు. ఇష్టమైన దర్శకుడు మరెన్నో మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. తమిళ్ దర్శకుడు అయినప్పటికీ మణిరత్నం సౌత్ నార్త్ అని తేడా లేకుండా అన్ని భాషల్లోను సినిమాలు చేసి ఆల్ టైమ్ బెస్ట్ డైరెక్టర్ అనిపించుకున్నాడు.

బాక్సాఫీస్ హిట్స్..
నాయకన్, బొంబాయి, దళపతి, యువ, దిల్ సే, వంటి ఎన్నో బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న మణిరత్నం అన్ని వర్గాల ప్రేక్షకులకు ఇష్టమైన దర్శకుడిగా మారాడు. తెలుగులో ఆయన చేసిన గీతాంజలి సినిమా కూడా ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఇప్పటికి కూడా ఆ సినిమా టీవీలలో వస్తే.. కదలకుండా చూసేవాళ్ళు ఉన్నారు.

మెగా రజినీ ఖాన్..
రజనీకాంత్, మమ్ముట్టి, అరవింద్ వంటి స్టార్ హీరోలతో మణిరత్నం తీసిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ దళపతి అప్పట్లో ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఆ తరువాత బాలీవుడ్ లో దిల్ సే సినిమాతో కూడా మణిరత్నం మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో మూడు భాషల హీరోలను కలపాలని అనుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి, రజినీకాంత్, షారుక్ ఖాన్ లతో ఒక బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ని ప్లాన్ చేసుకున్నాడు.
Recommended Video

ట్రెండ్ సెట్టర్..
మెగా రజినీ ఖాన్ అంటూ అప్పట్లో ఆ ప్రాజెక్ట్ పై అనేక రకాల రూమర్స్ వచ్చాయి. కానీ ఎందుకో మణిరత్నం ముగ్గురు అగ్ర హీరోలను కలపలేకపోయాడు. తెలుగులో మహేష్ బాబుతో కూడా ఒక సినిమా చేయాలని అనుకున్న మణిరత్నం అప్పుడు ఫామ్ లో లేకపోవడంతో రిజెక్ట్ చేశారని రూమర్స్ వచ్చాయి. ఏదేమైనా మణిరత్నం ఒక ట్రెండ్ సెట్ చేశాడనే చెప్పాలి.


Click it and Unblock the Notifications











