HBD Nani: నానికి అన్ని కోట్ల ఆస్తులు.. ఇండియాలో ఏకైక హీరోగా రికార్డు.. అతడి గురించి ఈ నిజాలు తెలుసా?
తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎలాంటి సినీ నేపథ్యం లేకుండానే వచ్చినా.. సహజసిద్ధమైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసేసి నేచురల్ స్టార్ అన్న పేరును తెచ్చుకున్నాడు నాని. ప్రతి సినిమాలోనూ అదిరిపోయే నటనతో అలరిస్తోన్న అతడు.. వన్ మ్యాన్ షోగా మార్చేస్తున్నాడు.
అదే సమయంలో ఎన్నో హిట్లను కూడా ఖాతాలో వేసుకుని తన రేంజ్‌ను పెంచుకుంటున్నాడు. ఇలా కెరీర్ పరంగా ఈ టాలెంటెడ్ హీరో మరింత ప్రభావాన్ని చూపిస్తూ ముందుకు సాగుతోన్నాడు. ఈ నేపథ్యంలో నాని పుట్టినరోజు సందర్భంగా అతడి రికార్డులు, రెమ్యూనరేషన్, ఆస్తుల గురించి తెలుసుకుందాం పదండి!

అలా మొదలైన ప్రయాణం: సినిమాల మీద ఉన్న మక్కువతో నాని చదువుకు మధ్యలోనే పుల్‌స్టాప్ పెట్టాడు. ఈ క్రమంలోనే 'రాధా గోపాలం' అనే సినిమాకు బాపు దగ్గర అసిస్టెంట్‌గా వర్క్ చేశాడు. ఆ తర్వాత బడా డైరెక్టర్లు రాఘవేంద్రరావు, శ్రీనువైట్ల సహా పలువురి దగ్గరా చేశాడు. ఈ క్రమంలోనే ఇంద్రగంటి మోమన్‌కృష్ణ తెరకెక్కించిన 'అష్టాచమ్మా' అనే సినిమాతో నాని హీరోగా కెరీర్‌ను మొదలెట్టాడు.

వరుస హిట్లతో పాటు పేరు: 'అష్టాచమ్మా' హిట్ అయినా నానికి మాత్రం పెద్దగా గుర్తింపు దక్కలేదు. అయితే, ఆ తర్వాత 'రైడ్', 'స్నేహితుడా', 'భీమిలీ కబడ్డీ జట్టు' వంటి సినిమాలు చేసి నటుడిగా ప్రశంసలు అందుకున్నాడు. సరిగ్గా అప్పుడే నందినీ రెడ్డి తెరకెక్కించిన 'అలా మొదలైంది'తో మొదటి హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత 'పిల్ల జమిందార్'తో నేచురల్ స్టార్ అనే పేరు సంపాదించాడు.

ఇండియాలో ఏకైక హీరోగా: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఈగ' మూవీతో నానికి స్టార్ ఇమేజ్ కూడా బాగా పెరిగింది. అయితే, ఆ తర్వాత చేసిన చిత్రాలు మాత్రం ఫ్లాప్ అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో 'భలే భలే మగాడివోయ్'తో మరోసారి నాని సక్సెస్ ట్రాక్ ఎక్కి వరుసగా ఎనిమిది హిట్లు కొట్టాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఏకైక ఇండియన్ హీరో రికార్డు సాధించాడు.
ఇప్పుడు సూపర్ ఫామ్‌లో: నేచురల్ స్టార్ నాని ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. గత ఏడాది అతడు 'దసరా' అనే పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత 'హాయ్ నాన్న' చిత్రంతో మళ్లీ సక్సెస్‌ను కొట్టాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు 'సరిపోదా శనివారం' అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే.

నిర్మాతగా, హోస్టుగానూ: సుదీర్ఘ కాలంగా హీరోగా సత్తా చాటుతోన్న నాని.. 'అ!' మూవీతో నిర్మాతగానూ మారాడు. ఇప్పటికే అతడు 'హిట్', 'హిట్ 2'తో బిగ్గెస్ట్ హిట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'హిట్: ది థర్డ్ కేస్' అనే సినిమాతో రాబోతున్నాడు. అంతేకాదు, 'బిగ్ బాస్' షోతో నాని హోస్టుగానూ మారాడు. ఇందులోనూ తనదైన మార్కును చూపించాడు.

ఆ స్టార్ల కంటే ఎక్కువగా: కెరీర్ ఆరంభంలో తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న నాని.. ఇప్పుడు తన మార్కెట్‌ను భారీ స్థాయిలో పెంచుకున్నాడు. దీంతో అతడి రెమ్యూనరేషన్ కూడా సినిమా సినిమాకూ పెరుగుతూనే ఉంది. ఇలా ఇప్పుడు నాని రూ. 22 - 25 కోట్లు వరకూ చార్జ్ చేస్తున్నాడు. ఇది టాలీవుడ్ సీనియర్ హీరోలు నాగార్జున, వెంకటేష్, రవితేజ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అని టాక్.

నానికి అన్ని కోట్ల ఆస్తి: ప్రస్తుతం నానికి రూ. 50 కోట్లకు పైగా నికర విలువ ఉన్నట్లు తెలిసింది. అంతేకాదు, ఈ స్టార్ హీరోకు హైదరాబాద్ సహా కొన్ని ప్రాంతాల్లో రూ. 30 కోట్ల విలువ చేసే ఇళ్లు ఉన్నాయట. అలాగే, దాదాపు రూ. 6 కోట్లు విలువైన కార్లు, రూ. 2 కోట్ల విలువైన యాక్ససిరీస్‌లు, రూ. 30 కోట్లు విలువైన ఫ్లాట్లు ఉన్నాయని తెలుస్తోంది.
భవిష్యత్‌లోనూ నాని సినీ హీరోగా, నిర్మాతగా మరెన్నో విజయాలను సొంతం చేసుకోవాలని కోరుకుంటూ ఫిల్మీబీట్ తరపున నేచురల్ స్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.


Click it and Unblock the Notifications











