HBD Nani: ఆ రికార్డు సాధించిన ఏకైక ఇండియన్ హీరో.. నాని చేసిన పెద్ద తప్పు అదే.. ఈ నిజాలు మీకు తెలుసా!
టాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న టాలెంటెడ్ అండ్ బడా హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఒకడు. స్వయంకృషితోనే పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. పదిహేనేళ్లుగా తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతోన్నాడు. అంతేకాదు, సహజ సిద్ధమైన నటనతో ఎన్నో సినిమాలను వన్ మ్యాన్ షోగా మార్చి నేచురల్ స్టార్ అనిపించుకున్నాడు. తద్వారా మరెవరికీ సాధ్యం కాని రీతిలో విజయాలను అందుకున్నాడు. ఇక, ఇప్పుడు పాన్ ఇండియాపై దండయాత్ర చేసేందుకు సిద్దం అవుతోన్నాయి. ఇక, నేడు నాని పుట్టినరోజు సందర్భంగా అతడి జీవితంలోని అత్యంత ముఖ్య విషయాలు, రికార్డులు, వివాదాల గురించి తెలుసుకుందాం పదండి!

అలా మొదలు.. హీరోగా ఎంట్రీ
నాని సినిమాల మీద ఉన్న మక్కువతో చదువుకు మధ్యలోనే పుల్‌స్టాప్ పెట్టాడు. ఈ క్రమంలోనే 'రాధా గోపాలం' అనే సినిమాకు బాపు దగ్గర అసిస్టెంట్‌గా పని చేశాడు. ఆ తర్వాత బడా డైరెక్టర్లు రాఘవేంద్రరావు, శ్రీనువైట్ల సహా పలువురి దగ్గరా చేశాడు. ఈ క్రమంలోనే ఇంద్రగంటి మోమన్‌కృష్ణ తెరకెక్కించిన 'అష్టాచమ్మా' అనే సినిమాతో నాని హీరోగా కెరీర్‌ను ప్రారంభించాడు.

వరుస చిత్రాలు.. ఎన్నో హిట్లు
మొదటి చిత్రం 'అష్టాచమ్మా' హిట్ అయినా నానికి మాత్రం పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత 'రైడ్', 'స్నేహితుడా', 'భీమిలీ కబడ్డీ జట్టు' వంటి సినిమాలు చేసి నటుడిగా ప్రశంసలు అందుకున్నాడు. సరిగ్గా అప్పుడే నందినీ రెడ్డి తెరకెక్కించిన 'అలా మొదలైంది'తో మొదటి బ్రేక్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత 'పిల్ల జమిందార్'తో నేచురల్ స్టార్‌గా మారాడు.

నాని స్పెషల్.. నేచురల్‌గానే
కథ ఏదైనా.. కంటెంట్ ఎలా ఉన్నా.. యాక్టింగ్‌లో మాత్రం నాని అదరగొడుతుంటాడు. నేచురల్ స్టార్ అనే బిరుదుకు సార్థకం చేస్తూ ఎన్నో సినిమాల్లో సహజసిద్ధమైన పాత్రలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ప్రతి సినిమాను వన్ మ్యాన్ షోగా మారుస్తూ ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు. ఈ విషయంలో మాత్రం తనకు తానే పోటీ అనేటట్లుగా అలరిస్తున్నాడు.

8 హిట్లు కొట్టిన ఏకైక హీరోగా
రాజమౌళి తెరకెక్కించిన 'ఈగ' నాని కెరీర్‌లో స్పెషల్ మూవీ అని చెప్పొచ్చు. అంతేకాదు, దీనితో అతడి స్టార్ ఇమేజ్‌కు కూడా బాగా పెరిగింది. అయితే, ఆ తర్వాత చేసిన చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో 'భలే భలే మగాడివోయ్'తో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కి వరుసగా ఎనిమిది హిట్లు కొట్టాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఏకైక ఇండియన్ హీరో అయ్యాడు.

నాని కెరీర్‌లో అదే తప్పంటూ
ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే నేచురల్ స్టార్ నాని.. బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి హోస్టుగా ఎంట్రీ ఇచ్చాడు. ఎన్నో వివాదాలతో నడిచిన రెండో సీజన్‌ను అద్భుతంగా నడిపించాడు. అయినప్పటికీ నానిపై ఓ వర్గం విమర్శనాస్త్రాలు సంధించింది. అప్పుడు అతడి కెరీర్‌లో పెద్ద తప్పు ఇదే అని చాలా మంది అనుకున్నారు. దీంతో నాని ఈ షో నుంచి తప్పుకున్నాడు.

నానికి నిరాశ.. దసరా అంటూ
గత ఏడాది నాని 'అంటే.. సుందరానికీ' అనే సినిమాతో వచ్చాడు. కానీ, ఇది నిరాశనే మిగిల్చింది. దీంతో ఈ సారి గట్టిగా కొట్టాలని డిసైడ్ అయిన అతడు.. ఇప్పుడు 'దసరా' అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ఇది మార్చి 30వ తేదీన విడుదల కానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలెట్టారు. ఇది నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు.

నిర్మాతగా హిట్.. మరోసారి
సుదీర్ఘ కాలంగా హీరోగా సత్తా చాటుతోన్న నాని.. నిర్మాతగానూ మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే అతడు 'హిట్', 'హిట్ 2'తో బిగ్గెస్ట్ హిట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'హిట్: ది థర్డ్ కేస్' అనే సినిమాతో రాబోతున్నాడు. దీనికి నిర్మాతగా వ్యవహరించడంతో పాటు హీరోగానూ చేయనున్నాడు. అలాగే, 30వ చిత్రాన్ని కూడా ఇప్పటికే ప్రకటించాడు.
భవిష్యత్‌లోనూ నాని సినీ హీరోగా, నిర్మాతగా మరెన్నో విజయాలను సొంతం చేసుకోవాలని కోరుకుంటూ ఫిల్మీబీట్ తరపున నేచురల్ స్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.


Click it and Unblock the Notifications











