HBD NTR: రాముడి నుంచి దేవరగా.. ఎన్టీఆర్ ఆస్తి అన్ని వందల కోట్లు.. ఏకైక హీరోగా సంచలన రికార్డు
నందమూరి తారక రామారావు మనవడిగా సినిమాల్లోకి వచ్చినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్, సాంగ్స్, యాంకరింగ్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ ఆల్‌రౌండర్ అనిపించుకుంటున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. చాలా చిన్న వయసులోనే స్టార్‌డమ్‌ను అందుకున్న అతడు.. ఇప్పుడు వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ దూసుకుపోతోన్నాడు. ఈ ఉత్సాహంతోనే వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ ముందుకు సాగుతోన్నాడు. ఈ నేపథ్యంలో నేడు తారక్ పుట్టినరోజు సందర్భంగా అతడి గురించి అతడి ఆస్తుల గురించి కీలక విషయాలు తెలుసుకుందాం!
బాల రాముడిగా వచ్చాడు:నందమూరి తారక రామారావు నటించిన 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' అనే సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ బాల నటుడిగా ఎంటరయ్యాడు. ఆ తర్వాత అంటే 13 ఏళ్ల వయసులో 'బాల రామాయణం' అనే సినిమాలో రాముడిగా నటించాడు. చైల్డ్ ఆర్టిస్టులతో చేసిన ఈ సినిమాకు మంచి గుర్తింపు లభించింది. అదే సమయంలో ఉత్తమ బాలల చిత్రంగా ఇది జాతీయ అవార్డును అందుకుంది.

హీరోగా మారి.. అటుఇటు:జూనియర్ ఎన్టీఆర్ 'స్టూడెంట్ నెం1' అనే సినిమాతో హీరోగా పరిచయం కావాల్సి ఉంది. కానీ, అనివార్య కారణాల వల్ల అది ఆలస్యం అవడంతో.. 'నిన్ను చూడలని' అనే సినిమా ముందుగా విడుదలైంది. ఈ చిత్రం నిరాశ పరిచింది. కానీ, రాజమౌళి తెరకెక్కించిన 'స్టూడెంట్ నెం1' మాత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఆలస్యంగా వచ్చినా ఇది తారక్‌కు పేరు తెచ్చింది.
భారీ హిట్లు.. ఫ్లాపులతోనూ:మొదట్లోనే ఎన్టీఆర్‌కు 'స్టూడెంట్ నెం1', 'ఆది' వంటి హిట్లు వచ్చాయి. దీంతో అతడికి మాస్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. ఆ తర్వాత కొన్ని పరాజయాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వచ్చిన 'సింహాద్రీ' ఇండస్ట్రీ హిట్ దక్కింది. దీని తర్వాత 'యమదొంగ' వచ్చే వరకూ వరుస ఫ్లాపులను చవి చూశాడు. ఆ సమయంలోనూ అతడు ఏమాత్రం వెనుకడుగు వేయలేదు.

పాన్ ఇండియా స్టార్‌గానే:'యమదొంగ' తర్వాత ఎన్టీఆర్ చాలా ఫ్లాపులు చూశాడు. ఈ పరిస్థితుల్లో 'టెంపర్'తో అతడు మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. అక్కడి నుంచి వరుసగా 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ', RRR వంటి హిట్లతో డబుల్ హ్యాట్రిక్ కొట్టి సంచలన రికార్డును అందుకున్నాడు. అదే సమయంలో పాన్ ఇండియా స్టార్‌గానూ ఎన్టీఆర్ ఎదిగిపోయాడు.
దేవరగా.. క్రేజీ కాంబోలు:RRRతో అంతర్జాతీయ ఖ్యాతిని అందుకున్న ఎన్టీఆర్.. ఇప్పుడు వరుసగా ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇప్పటికే కొరటాల శివతో 'దేవర' అనే సినిమాను చేస్తోన్న తారక్.. ప్రశాంత్ నీల్‌తో 31వ సినిమాను సెట్ చేసుకున్నాడు. వీటితో పాటు బాలీవుడ్ మూవీ 'వార్ 2'లో కూడా నటిస్తాడు. అలాగే, మరికొందరు దర్శకులతోనూ సంప్రదింపులు చేస్తున్నాడు.

ఎన్టీఆర్ ఆస్తులు ఎంత?:టాలీవుడ్‌లో వంద కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటోన్న ఎన్టీఆర్‌కు మొత్తం ఎంత ఆస్తి ఉంటుందని చాలా మంది ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం.. అతడికి ఇప్పుడు రూ. 570 - 600 కోట్లు వరకూ ఆస్తులు ఉన్నట్లు తెలిసింది. అంతేకాదు, ఎన్టీఆర్‌కు రూ. 80 కోట్లు విలువైన ఓ ప్రైవేట్ జెట్ కూడా ఉన్నట్లు ఇటీవలే ఓ న్యూస్ బయటకు వచ్చింది.

మిగిలిన వాటి వ్యాల్యూ:ఎన్టీఆర్‌కు హైదరాబాద్‌లో ఓ విలాసవంతమైన భవనం ఉంది. దీని విలువ సుమారు రూ. 100 కోట్లు ఉంటుందట. వేరే ప్రాంతాల్లో ఇల్లు, స్థలాలు కలిపి రూ. 100 కోట్లు విలువ చేస్తాయని టాక్. అలాగే, ప్రస్తుతం అతడు వాడుతోన్న కార్లు, ఇతర యాక్సిసిరీస్‌ల విలువ రూ. 25 కోట్లు ఉంటుందట. అలాగే, వాచ్‌లు అంటే ఇష్టమున్న తారక్‌కు రూ. 10 కోట్లు విలువైనవి ఉన్నాయట.
ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు కొడుతూ.. సక్సెస్‌కు చిరునామాలా మారిన ఎన్టీఆర్.. మరిన్ని విజయాలను అందుకోవాలని.. తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తూ ఉండాలని కోరుకుంటూ ఫిల్మీబీట్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.


Click it and Unblock the Notifications











